BigTV English

Stree 2 OTT Release : భయపెట్టే స్త్రీ 2 ఓటీటీ రిలీజ్.. ఎందులో రాబోతోందంటే..

Stree 2 OTT Release : భయపెట్టే స్త్రీ 2 ఓటీటీ రిలీజ్.. ఎందులో రాబోతోందంటే..

Stree 2 Movie OTT Release: లేటెస్ట్ బాలీవుడ్ హారర్ థ్రిల్లర్ స్త్రీ-2 (Stree 2) మూవీ థియేటర్లలో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే సినిమా రిలీజ్ అయి ఒక్క రోజు కూడా కాలేదు.. అప్పుడే ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌ (OTT Release) గురించి చర్చ మొదలైంది.


ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌లో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్ (Shraddha Kapoor), రాజ్‌కుమార్ రావ్ (Raj Kumar Rao) ప్రధాన పాత్రల్లో నటించిన స్త్రీ 2018 రిలీజై సూపర్ హిట్ అయింది. దానికి సీక్వెల్‌గా డైరెక్టర్ అమర్ కౌశిక్ ‘‘స్త్రీ2: సర్‌కటే కా ఆతంక్’’ మూవీని రూపొందించారు.

ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం (Independence Day) సందర్భంగా ఈ సినిమా గురువారం విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి చర్చ మొదలైంది. టాప్ ఓటీటీ ప్లాట్ ఫాంలైన అమెజాన్ ప్రైమ్ (Amazon Prime), నెట్‌ఫ్లిక్స్(Netflix), హాట్‌స్టార్(Hotstar) లలో ఎందులో ఈ సినిమా రీలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.


అయితే ఈ మధ్య విడుదలవుతున్న బాలీవుడ్ సినిమాలను బట్టి చూస్తే ఈ సినిమా మరో రెండు నెలల తర్వాత అంటే అక్టోబర్ 15 తర్వాత ఓటీటీలోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అది కూడా అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా అందుబాటులో ఉండొచ్చని బాలీవుడ్ ఎక్స్‌పర్ట్స్ అంచనా వేస్తున్నారు. అయితే అఫీషియల్‌గా మాత్రం ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కి సంబంధించి ఎలాంటి ఎనౌన్స్‌మెంట్ ఇంకా రాలేదు.

Also Read: ‘దేవర’ నుంచి భైర గ్లింప్స్.. గూస్‌బంప్స్ వచ్చాయంతే..

ఇక స్త్రీ2 సినిమా గురించి మాట్లాడుకుంటే.. అమర్ కౌశిక్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో బాలీవుడ్ సింపుల్ బ్యూటీ శ్రద్ధాకపూర్ కీ రోల్ పోషించగా.. రాజ్‌కూమార్ రావ్ హీరో పాత్ర పోషించారు. అలాగే అభిషేక్ బెనర్జీ, పంకజ్ త్రిపాఠి, అపరశక్తి ఖురానా వంటి ఇంపార్టెంట్ కాస్ట్ ఉంది. స్త్రీ సినిమా కథకు ఈ సినిమా సీక్వెల్‌గా సాగుతుంది. సరిగ్గా ఆ సినిమా ఎక్కడైతే ఆగింతో అక్కడి నుంచే ఈ సినిమా మొదలవుతుంది. చందేరి గ్రామంలోని ప్రజలంతా స్త్రీని పూజిస్తూ ఉంటారు. అయితే ఆమె బెడద తీరిందని ఆనందపడే లోపే ఇప్పుడు కొత్తగా తలలేకుండా కేవలం మొండెంతో తిరుగుతున్న ఓ దెయ్యం గ్రామాన్ని పట్టి పీడించడం మొదలుపెడుతుంది. ఈ దెయ్యాన్ని ఊళ్లోని జనాలంతా సర్‌కటా అని పిలుస్తుంటారు. మొదటి సినిమాలో స్త్రీ మగవాళ్లని ఎత్తుకెళ్లినట్లే ఈ దెయ్యం ఆడవాళ్లని కిడ్నాప్ చేస్తూ ఉంటుంది. అందులోనూ మోడ్రన్‌గా ఉండే అమ్మాయిలనే ఈ దెయ్యం టార్గెట్ చేస్తూ ఉంటుంది. ఇక ఈ మిస్టరీని సాల్వ్ చేయడానికి బిక్కీ, జన్నా, బిట్టు, రుద్రలు మళ్లీ కలిసి ఈ గ్రామానికొస్తారు.

అయితే బిట్టు గర్ల్‌ఫ్రెండ్‌ని కూడా ఆ దెయ్యం ఎత్తుకెళ్లడంతో కథలో స్పెషల్ ట్విస్ట్ వస్తుంది. అదే టైంలో చందేరి పురాణం అనే ఒక పుస్తకం వీళ్లకి దొరకడం.. అందులో ఆ సర్‌కటా దెయ్యం గురించిన కథ ఉండడంతో దాని సహాయంతో ఆ దెయ్యాన్ని మన హీరోలు ఎలా ఓడించారనేదే స్టోరీ.

 

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×