BigTV English

Devara team chit chat : స్పిరిట్ మూవీపై వైరల్ అవుతున్న ఎన్టీఆర్ కామెంట్స్

Devara team chit chat : స్పిరిట్ మూవీపై వైరల్ అవుతున్న ఎన్టీఆర్ కామెంట్స్

NTR Devara team chit chat with Sandeep reddy vanga..coments on spirit movie: ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో దేవర మూవీ రిలీజ్ కానుంది. దేవర. సెప్టెంబర్ 27న విడుదలకాబోయే ఈ మూవీ లేటెస్ట్ ట్రైలర్ మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోంది. ఓవర్సీస్ లో కూడా ఈ మూవీపై క్రేజ్ మామూలుగా లేదు. అయితే ఈ సినిమాకు కొందరు పనిగట్టుకుని నెగెటివ్ ప్రచారం చేస్తూ బ్యాడ్ సెంటిమెంట్ అంటున్నారు. వాటన్నింటినీ పట్టించుకోకుండా చిత్ర యూనిట్ సినిమాపై ఎప్పటికప్పుడు హైప్ ఇస్తూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇటీవల యానిమల్ చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తో దేవర టీమ్ఇంటర్వ్యూ నిర్వహించారు. దానికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం వైరల్ గా మారింది. సందీప్ వంగా అడిగిన ప్రశ్నలకు ఎన్టీఆర్ ఫన్నీగా తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.


ఆకట్టుకుంటున్న ప్రోమో

ఈ ఇంటర్వ్యూ ప్రోమోలో సందీప్ రెడ్డి వంగా, ఎన్టీఆర్ తో సహా సైఫ్ ఆలీఖాన్, జాన్వీకపూర్,కొరటాల శివ కూడా పొల్గొన్నారు. దేవర ఎలా ఉండబోతోందని సందీప్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఎన్టీఆర్ మాస్ ఎలిమెంట్స్ తో పాటు యాక్షన్ డ్రామా ఉన్న మూవీ ఇది అంటూ తెలిపారు. మాస్ ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుందని అన్నారు. ఇంకా ఈ సినిమా విశేషాల గురించి మాట్లాడుతూ 35 రోజుల పాటు అండర్ వాటర్ సీక్వెన్స్ చేశానని..తన కెరీర్ లోనే దేవర బెస్ట్ అవుతుందని అన్నారు. కెరటాలతో తనకున్న బాండింగ్ గురించి కూడా ఎన్టీఆర్ తెలిపారు. మధ్యమధ్యలో జాన్వి సందీప్ పై పంచ్ లు వేసింది. మొత్తం మూవీ కథంతా ఇప్పుడే చెప్పమంటున్నారు సందీప్ సార్. అలా చెప్పేస్తే కిక్ ఏముంటుంది. థియేటర్ లో చూడండి అంటూ ఫన్నీగా జాన్వీ స్పందించారు.


Also Read: ఏపీలో రాజకీయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఎన్నిఏపీలో గణేష్ నిమజ్జనం వేళ.. జగన్ పాటల గోల కేసులు నమోదు చేసిన పోలీసులు

రన్ టైమ్ పై కామెంట్

దేవర మూవీ రన్ టైమ్ పై సందీప్ సరదాగా కామెంట్ చేశారు. అందుకు స్పందించిన ఎన్టీఆర్ యానిమల్ రన్ టైమ్ ఎంతో తెలపాలని సందీప్ ని అడిగారు. సందీప్ నవ్వుతూ మూడు గంటల 24 నిమిషాలని చెప్పారు. అయితే ప్రభాస్ నటించబోయే స్పిరిట్ మూవీ కోసం ఎదురుచూస్తున్నానని ఎన్టీఆర్, సైఫ్ అన్నారు సందీప్ తో. ఫస్ట్ డే ఫస్ట్ షో సందీప్ తో కలిసి చూడాలన్నారు. స్పిరిట్ మూవీ టీమ్ కి ఆల్ ద బెస్ట్ అని ఎన్టీఆర్ సందీప్ ని విష్ చేశారు ఎన్టీఆర్. ఈ మూవీ ఇండస్ట్రీ రికార్డులు క్రియేట్ చేస్తుందని తనకు ఆ నమ్మకం ఉందని అనడంతో సందీప్ ఎన్టీఆర్ కు థాంక్స్ తెలిపారు.

ఎదురుచూస్తున్న ఫ్యాన్స్

ఆద్యంతం ఫన్నీగా సాగిన ఈ ప్రోమోని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఈ ఆదివారం పూర్తి ఇంటర్వ్యూని రిలీజ్ చేస్తామని సినిమా యూనిట్ తెలిపారు. దేవర మూవీ పూర్తి ఇంటర్వ్యూ కోసం అభిమానుల వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. తమని ప్రోమో ఎంతగానో ఆకట్టుకుందని..ఈ ప్రోమోతో దేవరపై అంచనాలు మరింతగా పెరుగుతాయని తాము భావిస్తున్నామని అభిమానులు అంటున్నారు.

Related News

Venuswamy: గుడి నుంచి తరిమేశారు… వేణు స్వామికి ఘోర అవమానం.. ఎక్కడంటే ?

Sitara Ghattamaneni : అది నేను కాదు… దయచేసి నమ్మి మోసపోకండి

Alekhya Chitti Sisters: దెబ్బకు ఆపరేషన్‌ చేసుకుని జెండర్ మార్చేసిన అలేఖ్య.. ట్రోల్స్‌పై సుమ రియాక్షన్!

Miss Universe -2025: మిస్ యూనివర్స్ 2025 విజేతగా రాజస్థాన్ బ్యూటీ!

Rahul Sipligunj – Rathika : ఘనంగా రాహుల్ ఎంగేజ్మెంట్, గుక్కపెట్టి ఏడుస్తున్న రతిక

Free Pickle Offer: ఈ ఛాలెంజ్ క్లియర్ చేస్తే పికిల్ ప్యాకెట్ ఫ్రీ… పచ్చళ్ళ అక్క బంపర్ ఆఫర్?

Big Stories

×