NTR: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తన గొప్ప మనసును చాటుకున్నాడు. చావు బతుకుల్లో ఉన్న తన అభిమాని చివరి కోరికను ఎన్టీఆర్ నెరవేర్చాడు. రెండు రోజుల క్రితం ఎన్టీఆర్ అభిమాని అయిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కౌశిక్ అనే 19 ఏళ్ళ కుర్రాడు రెండేళ్లుగా బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. ప్రస్తుతం అతడు బెంగళూరులోని కిడ్‌వై హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు.
పరిస్థితి విషమించడంతో ఆ కుర్రాడు రేపో మాపో చనిపోతారని డాక్టర్స్ తేల్చి చెప్పేశారు. ఇలాంటి విషమ పరిస్థితిలో కూడా కౌశిక్.. తనను జీవితం మొత్తం బతికించమని కోరకుండా సెప్టెంబర్ 27 వరకు మాత్రమే బతికించమని కోరడం సంచలనంగా మారింది. కౌశిక్ .. ఎన్టీఆర్ వీరాభిమాని కావడంతో.. ఆరోజు దేవర సినిమా చూసి చనిపోతానని, అప్పటివరకు బ్రతికించమని కౌశిక్, వైద్యులను బతిమిలాడాడు. ఈ విషయాన్నీ కౌశిక్ అమ్మనాన్న ఒక వీడియో ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Devara: ఆ స్టార్స్ ఏంటి.. ఆ ఇంటర్వ్యూలు ఏంటి.. బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావ్ తారక్
కనీసం తన కొడుకును దేవర సినిమా చూసేవరకు అయినా బతికించమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హీరో జూనియర్ ఎన్టీఆర్‌లను తల్లిదండ్రులు ప్రాధేయపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో చివరకు ఎన్టీఆర్ వద్దకు చేరుకుంది. ఇక ఈ వీడియో చూడగానే.. ఎన్టీఆర్ తక్షణమే కౌశిక్ కు వీడియో కాల్ చేసి మాట్లాడాడు. దైర్యంగా ఉండాలని కౌశిక్ ను ఓదార్చాడు.
తప్పకుండా నువ్వు బతుకుతావు.. దేవర సినిమా గురించి తరువాత.. ముందు నువ్వు చికిత్స తీసుకో.. అమ్మానాన్నలు ఇబ్బంది పెట్టకు అని ఎన్టీఆర్ దైర్యం చెప్పాడు. ఇక కౌశిక్ తల్లిదండ్రులకు కూడా ఎన్టీఆర్ దైర్యం ఇచ్చాడు. కొడుకు బతుకుతాడని, మీరు కూడా దైర్యంగా ఉండాలని తెలిపాడు. కౌశిక్ కు మంచి చికిత్స ఇప్పించే బాధ్యత తనది అని, అతను కోలుకోవాలని నేను కూడా దేవుడ్ని ప్రార్దిస్తానని తెలిపాడు.
అతన్ని పక్కన పెట్టుకొనే దేవర సినిమా చూస్తానని చెప్పిన తారక్.. కచ్చితంగా తనను చూడడానికి హాస్పిటల్ కు వస్తానని మాట ఇచ్చాడు. ఇక కౌశిక్ నవ్వు బావుందని, ఆయాల్నే నవ్వుతూ ఉండాలని తెలిపాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఎన్టీఆర్ గొప్ప మనసును చూసి అభిమానులు సూపర్ అన్నా .. అందుకే నువ్వంటే మాకు ఇష్టం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
https://t.co/RfExyVdBJV pic.twitter.com/aKAuXTG8bZ
— Vamsi Kaka (@vamsikaka) September 14, 2024