NTR Dragon..జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ (Jr. NTR-Prashanth Neel)ల కాంబినేషన్లో ఎన్టీఆర్ 31(NTR 31) సినిమా తెరకెక్కుతున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ మొదలై పోయింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా రుక్మిణి వసంత్(Rukmini Vasanth) నటించబోతున్నట్టు మీడియాలో ఇప్పటికే లీకులు వచ్చాయి. ఈ విషయం పక్కన పెడితే.. తాజాగా జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న ఎన్టీఆర్ 31 సినిమాకి బడ్జెట్ భారీగానే పెడుతున్నట్టు టాలీవుడ్ ఇన్సైడ్ వర్గాల నుండి ఓ రూమర్ వినిపిస్తోంది. మరి ఇంతకీ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ల కాంబోలో రాబోతున్న సినిమాకి బడ్జెట్ ఎంత పెడుతున్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ఎన్టీఆర్ ,ప్రశాంత్ మూవీకి భారీ బడ్జెట్..
మైత్రి మూవీ మేకర్స్ (Mytri Movie Makers) బ్యానర్ లో తెరకెక్కుతున్న తాజా మూవీ ఎన్టీఆర్ 31. ఇప్పటి వరకు ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ బయట పెట్టలేదు. అయితే ప్రశాంత్ నీల్.. సలార్(Salaar) సినిమా తర్వాత ఎన్టీఆర్ తో చేసే సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసి, ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ఎన్టీఆర్ (NTR) లేని సన్నివేశాలు అన్నీ చిత్రీకరణ చేస్తున్నారు. ఇక ఈ మార్చి చివరిలోకల్లా ఎన్టీఆర్ కూడా ఈ షూటింగ్లో పాల్గొనబోతున్నట్టు తెలుస్తోంది.ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ఎన్టీఆర్ పాల్గొన్నాక, చేసే సన్నివేశాల కోసం భారీ సెట్స్ కూడా వేయిస్తున్నారట ప్రశాంత్ నీల్.తన మార్క్ డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కబోతుందని, ఇప్పటివరకు వచ్చిన కేజీఎఫ్, కేజీఎఫ్-2, సలార్ సినిమాలు ఏ విధంగా అయితే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయో.. అదే రేంజ్ లో ఎన్టీఆర్, నీల్ ల సినిమా కూడా ఉండబోతున్నట్టు తెలుస్తోంది.ఈ నేపథ్యంలోనే భారీ సెట్స్ వేస్తే బడ్జెట్ కూడా భారీగానే అవసరం ఉంటుంది. అందుకే ఈ సినిమా కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టడానికైనా మైత్రి మూవీ మేకర్స్ ముందుకు వస్తున్నట్టు తెలుస్తోంది. అయితే తాజాగా ఈ మూవీకి దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ పెట్టబోతున్నట్టు ఇన్సైడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది
ఆ నమ్మకమే మైత్రి మూవీ మేకర్స్ ను ముందుకు నడిపిస్తోందా..?
అయితే ఇందులో ఎక్కువ శాతం బడ్జెట్ మైత్రి మూవీ మేకర్స్ పెడుతుందని, కొంత భాగం ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మాణ సంస్థ బడ్జెట్ పెడుతున్నట్టు సమాచారం. ఏది ఏమైనప్పటికీ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న సినిమాకి రూ.500 కోట్ల బడ్జెట్ అంటే మామూలు విషయం కాదు.ఇక బడ్జెట్ ఎంత పెట్టామో ఆ రేంజ్ లోనే సినిమా టాక్ ఉండాలి. అందుకే సినిమా షూటింగ్ విషయంలో ఎక్కడా తగ్గకుండా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్ సినిమాకి ఆలోచించకుండా ఎంత బడ్జెట్ అయినా పెడతాం అనడానికి ప్రధాన కారణం ఎన్టీఆర్, మైత్రి మూవీ మేకర్స్ కాంబోలో ఇప్పటికే జనతా గ్యారేజ్ (Janatha Garage) మూవీ వచ్చింది.ఈ సినిమాకి రూ. 50 కోట్లు పెడితే రూ.130 కోట్లు కలెక్ట్ చేయడంతో భారీ హిట్ అందుకుంది. అందుకే ఎన్టీఆర్ సినిమా అంటే మైత్రి మూవీ మేకర్స్ కి మినిమం హిట్ గ్యారెంటీ అనే ఓ నమ్మకం ఉంది. ఇక ప్రస్తుతం ఈ సినిమా డ్రాగన్ అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే