BigTV English
Advertisement

NTR Character in War 2 : వార్ 2 స్టోరీలో ట్విస్ట్.. ఇంతకీ జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ ఏంటి బాసూ!

NTR Character in War 2 : వార్ 2 స్టోరీలో ట్విస్ట్.. ఇంతకీ జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ ఏంటి బాసూ!
latest update on war 2
latest update on war 2

War 2 Update: అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రలలో నటించిన బడే మియాన్ చోటే మియాన్ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ గా యష్ రాజ్ ఫిల్మ్స్ వ్యవహరిస్తోంది. ఈ సినిమా టీజర్, పాటలకు అక్కడ మంచి స్పందన వచ్చింది. టైగర్, అక్షయ్ ఇద్దరూ హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలకు పెట్టింది పేరు. అందుకే అభిమానులు ఈ యాక్షన్-థ్రిల్లర్‌పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. టైగర్ జిందా హై దర్శకుడు అబ్బాస్ అలీ జాఫర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మానుషి చిల్లార్, సోనాక్షి సిన్హా నటించారు. ఈ సినిమా ఏప్రిల్ 9న విడుదల కానుంది.


బడే మియాన్ చోటే మియాన్ సినిమా భారతదేశానికి చెందిన అత్యంత ప్రమాదకరమైన ఆయుధాన్ని దొంగిలించకుండా శత్రువుతో పోరాడే ఇద్దరు ఉత్తమ అధికారుల గురించి తెలియజేస్తుంది. యష్ రాజ్ ఫిల్మ్స్ బృందం సినిమా ట్రైలర్‌ను చూసినప్పుడు.. హృతిక్ రోషన్, కియారా అద్వానీ, జాన్ అబ్రహం, జూనియర్ ఎన్టీఆర్ నటిస్తోన్న వార్ -2 సినిమా కథాంశాన్ని పోలినట్లు అభిప్రాయపడ్డారు. దాంతో వార్-2 కి ఇప్పుడు కొత్త ట్విస్ట్ ఇవ్వాలన్న యోచనలో పడినట్లు తెలుస్తోంది. అలా చేస్తే.. వార్ 2 బడేమియాన్ చోటే మియాన్ కు కాపీ కంటెంట్ లా అనిపించకుండా ఉంటుందని ఆలోచిస్తున్నారట.

Read More: మెగా హీరోకి అవమానం, క్షమాపణలు కోరిన ఫ్యాన్స్‌


అయితే.. వార్-2 లో జూనియర్ ఎన్టీఆర్ విలన్ గా నటిస్తున్నాడని ఇప్పటి వరకూ అందరూ భావించారు. కానీ తాజాగా ఎన్టీఆర్ ఇందులో విలన్ పాత్ర చేయడంలేదని సమాచారం. ఒక గూఢచారి పాత్రలో నటిస్తున్నాడట. అయితే ఆ క్యారెక్టర్ పాజిటివ్ గా ఉంటుందా ? నెగిటివ్ గా ఉంటుందా ? అన్నదానిపై ఇంకా క్లారిటీ లేదు.

షారుఖ్ నటించిన పఠాన్.. టైగర్ 3ని పోలి ఉండటంతో అది సక్సెస్ కాలేదు. దాంతో యష్ రాజ్ ఫిల్మ్స్ నిరాశచెందింది. మరోసారి అలాంటి తప్పు రిపీట్ కావొద్దని ఆదిత్యచోప్రా బృందం ఇప్పుడు మరో పెద్ద స్పై యూనివర్స్ ను ప్లాన్ చేస్తున్నారు. ఇందులో పఠాన్‌గా షారుఖ్ ఖాన్, టైగర్‌గా సల్మాన్ ఖాన్, కబీర్‌గా హృతిక్ రోషన్ నటిస్తున్నారు. స్పై కంటెంట్ తో వచ్చే సినిమాలను నిర్మించేందుకు యష్ రాజ్ ఫిల్మ్స్ ఆసక్తి చూపిస్తుంది. వార్ 2, పఠాన్ 2 నే కాకుండా.. అలియా భట్ శర్వరీ వాఘ్ నేతృత్వంలో ఒక మహిళా ప్రధాన గూఢచారి చిత్రాన్ని కూడా యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తుందని సమాచారం.

కాగా.. ఎన్టీఆర్ నటిస్తోన్న దేవర సినిమా ఈ ఏడాది అక్టోబర్ 10న విడుదల చేస్తామని చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అటు దేవర, ఇటు వార్ 2 షూటింగ్స్ లో పాల్గొంటూ.. రెండు సినిమాలను పూర్తిచేసే పనిలో ఉన్నాడు ఎన్టీఆర్. వచ్చే ఏడాది ఆగస్టు 15న వార్ 2 ను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Tags

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×