BigTV English

NTR – Prashanth Neel: సైలెంట్ గా పని మొదలు పెడుతున్న దిగ్గజద్వయం.. ఫ్యాన్స్ కూడా ఊహించని రీతిలో..!

NTR – Prashanth Neel: సైలెంట్ గా పని మొదలు పెడుతున్న దిగ్గజద్వయం.. ఫ్యాన్స్ కూడా ఊహించని రీతిలో..!

NTR – Prashanth Neel:జూనియర్ ఎన్టీఆర్(Jr. NTR), ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబోలో రాబోయే సినిమా కోసం చాలామంది నందమూరి ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా? ఎప్పుడెప్పుడు చూసేద్దామా? అని చాలామంది ఆతృతగా ఉన్నారు. అయితే ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ అయితే ఇవ్వడం లేదు. ఈ సినిమా షూటింగ్ విషయానికి వస్తే..ఈ వారం స్టార్ట్ అవ్వాల్సి ఉంది.కానీ ఈ వారం ఈ సినిమా షూటింగ్ వాయిదా పడినట్టు తెలుస్తోంది. కానీ నందమూరి ఫ్యాన్స్ కి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ (Jr. NTR- Prashanth Neel) కాంబోలో రాబోయే సినిమాకి సైలెంట్ గా ఆ పని చేస్తున్నారట. మరి ఇంతకీ ప్రశాంత్ నీల్ , జూనియర్ ఎన్టీఆర్ లు ఎలాంటి మ్యాజిక్ చేస్తారు.. ? వీళ్ళు ప్రస్తుతం సినిమాకి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వబోతున్నారు? అనేది ఇప్పుడు చూద్దాం..


వచ్చేవారం నుండి రెగ్యులర్ షూటింగ్..

గత ఏడాది కొరటాల శివ (Koratala shiva) డైరెక్షన్లో జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర'(Devara) మూవీ తో వచ్చి సైలెంట్ గా హిట్టు కొట్టారు.అయితే ఈ మూవీ మొదటి షో తోనే చాలామంది నెగటివ్ టాక్ స్ప్రేడ్ చేశారు. ముఖ్యంగా నందమూరి ఫ్యాన్స్ సైతం ఈ సినిమా బాలేదని రివ్యూలు ఇవ్వడంతో రాజమౌళి (Rajamouli) సెంటిమెంట్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాకి కూడా పట్టుకుంది అని చాలామంది కామెంట్లు చేశారు.కానీ ఈ సినిమా సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ రూ.600 కోట్లు రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అంతేకాదు ఈ సినిమా చాలాచోట్ల వంద రోజులు పూర్తి చేసుకుంది. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ 31(NTR 31) వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా షూటింగు వచ్చేవారం రెగ్యులర్ గా జరగబోతున్నట్టు టాలీవుడ్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. ఏది ఏమైనప్పటికీ ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ లు తమ సినిమాకు సంబంధించిన వర్క్ ని సైలెంట్ గా పూర్తి చేస్తున్నట్టు సమాచారం. అయితే ఈ విషయం అభిమానులు కూడా ఊహించి ఉండరని చెప్పవచ్చు.


రూ.1000 కోట్ల టార్గెట్ తో బరిలోకి..

ఇక ఈ సినిమా రూ.1000 కోట్ల కలెక్షన్స్ రాబట్టడం పక్కా అని ఇప్పటికే చాలామంది భావిస్తున్నారు. ఎందుకంటే ప్రశాంత్ నీల్ డైరెక్షన్ చేసిన కేజిఎఫ్1, కేజీఎఫ్ టు, సలార్ వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. ఇక జూనియర్ ఎన్టీఆర్ , ప్రశాంత్ నీల్ కాంబో అంటే థియేటర్లు దద్దరిల్లాల్సిందే. అంతేకాకుండా ఇప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్(Jr. NTR) ఖాతాలో రూ.1000 కోట్ల సినిమా పడలేదు. ఆర్ఆర్ఆర్ (RRR ) సినిమా వచ్చినప్పటికీ ఈ సినిమా క్రెడిట్ పూర్తిగా ఎన్టీఆర్ కి ఇవ్వలేము. అలాగే దేవర సినిమా తో వెయ్యి కోట్ల క్లబ్ లో చేరలేదు. ఇక నెక్స్ట్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో రాబోయే సినిమానే వెయ్యి కోట్లు కలెక్షన్స్ చేస్తుంది అని నందమూరి ఫ్యాన్స్ లో ఒక నమ్మకం అయితే ఉంది. మరి చూడాలి ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో రాబోయే సినిమాతో ఎన్టీఆర్ సోలోగా రూ.1000 కోట్ల కలెక్షన్స్ సాధిస్తాడా అనేది.. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా రుక్మిణి వసంత్(Rukmini Vasanth) ని తీసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×