BigTV English

Action Movie OTT : ఓటీటీలోకి నిహారిక యాక్షన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Action Movie OTT : ఓటీటీలోకి నిహారిక యాక్షన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Action Movie OTT : ఓటిటిలోకి కొత్త కొత్త సినిమాలు వరుసగా విడుదల అవుతూనే ఉంటాయి అందులో కొన్ని సినిమాలు యాక్షన్ జానెర్ లో వస్తే.. మరికొన్ని సినిమాలు కామెడీ ఛానల్ లో వస్తాయి ఇంకొన్ని సినిమాలు క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు గా ప్రేక్షకులు ముందుకు వస్తాయి. అయితే కొన్ని సినిమాలు ఓటిటిలో మంచి సక్సెస్ టాక్ ను అందుకోవడం మనం చూస్తూనే ఉంటాం.. ఇక తాజాగా మెగా డాటర్ నిహారిక నటించిన యాక్షన్ మూవీ ఓటిటి లోకి వచ్చేందుకు రెడీ అవుతుంది. ఈమధ్య నిహారిక నిర్మాణ సంస్థను స్టార్ట్ చేసి కొత్త సినిమాలు తీయడంతో పాటు ప్రధాన పాత్రలో కొత్త సినిమాలను కూడా చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా నటించిన సినిమా ఏంటి? ఆ సినిమా ఏ పోటీటి ప్లాట్ఫామ్ లోకి రాబోతుందో? ఇప్పుడు మనం తెలుసుకుందాం..


మూవీ & ఓటీటీ.. 

మెగా డాటర్ నిహారిక కొణిదల గురించి అందరికీ తెలుసు. ఒకప్పుడు ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కూడా నటించిన సినిమాల్లో ఒక్కటి కూడా మంచి గుర్తింపును తీసుకురాలేదు. ఇప్పుడు ప్రస్తుతం సినిమాలపై ఫోకస్ పెట్టిన నిహారిక తమిళ ఇండస్ట్రీలో భారీ యాక్షన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ మూవీ పేరు మద్రాస్‌కారణ్.. థియేటర్లలో రిలీజై నెల రోజులు కూడా కాకముందే ఓటీటీలోకి వస్తోంది. మద్రాస్‌కారణ్ మూవీలో షేన్ నిగమ్, కలైయరాసన్‌, ఐశ్వర్య దత్తా ప్రత్యేక పాత్రలో నటించారు. యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాకు వాలి మోహన్ దాస్ దర్శకత్వం వహించాడు.. ఈ మూవీ రిలీజ్ అయింది కొద్ది రోజులకి పోటీలో రాబోతుందని వార్తలు వినిపిస్తుంది.. సంక్రాంతి సందర్భంగా జనవరి 10న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయింది. ఇక అప్పుడే ఓటిటిలోకి రావడం గమనార్హం.. ప్రముఖ ఓటిడి సంస్థ ఆహాలో ఫిబ్రవరి 7న ఈ సినిమా రిలీజ్ తెలుస్తుంది. రిలీజ్ డేట్‌ను ఆహా ఓటీటీ అఫీషియల్‌గా అనౌన్స్‌చేసింది. ఓ యాక్షన్ పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నది..


స్టోరీ విషయానికొస్తే..

ఈ సినిమాలో గ్లామర్ రోల్ లో నిహారిక కొణిదెల నటించింది.. ఈమూవీలోని పాటలో నిహారిక, షేన్ నిగమ్ రొమాంటిక్ స్టెప్పులతో అదరగొట్టారు. ఈ రీమిక్స్ సాంగ్‌లో హీరోహీరోయిన్ల కెమిస్ట్రీ హైలైట్‌గా నిలిచింది.. ఈ మూవీలో మీరా, సత్యలు ప్రేమించుకుంటారు. పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. తల్లిదండ్రుల కోరిక మేరకు సొంత ఊరిలో పెళ్లి చేసుకోవాలని అనుకున్న సత్య బంధువులతో కలిసి ఓ పల్లెటూరికి వస్తాడు సత్య. పెళ్లి హడావిడిలో సత్య ఓ యాక్సిడెంట్ చేస్తాడు.. ఆ తర్వాత ఏం జరిగింది అనేది సినిమాలో చూడాల్సిందే.. ఈ యాక్సిడెంట్ తర్వాత సత్య వాళ్ళ ఫ్యామిలీ లోకల్ లీడర్ వాళ్లకు టార్గెట్ అవుతారు. ఆ తర్వాత సత్య వాళ్ళ ఫ్యామిలీ ఆ లీడర్ టార్చర్ నుంచి ఎలా బయటపడతారు అనేది ఈ సినిమా స్టోరీ.. స్టోరీ లేని బాగానే ఉన్నా డైరెక్టర్ అక్కడక్కడ తడబడినట్టు తెలుస్తుంది. మొత్తానికి అనుకున్న విధంగా స్టోరీని తీసుకురాలేకపోయాడని టాక్.. దాంతో సినిమా యావరేజ్ టాక్ ని సొంతం చేసుకుంది. థియేటర్లలో యావరేజ్ టాక్ను అందుకున్న ఈ మూవీ ఓటిటిలో ఎలాంటి టాక్ని సొంతం చేసుకుంటుందో చూడాలి..

Tags

Related News

OTT Movie : ఓటీటీలో దూసుకుపోతున్న సరికొత్త లవ్ స్టోరీ … సత్యదేవ్ వన్ మ్యాన్ షో … ఇందులో అంతగా ఏముందంటే ?

OTT Movie : ఈయన అలాంటి ఇలాంటి డాక్టర్ కాదులే … చేయిపడితే బెడ్ మీద గుర్రం సకిలించాల్సిందే …

OTT Movie : ‘జంబలకడి పంబ’ ను గుర్తు చేసే వెబ్ సిరీస్ … పొట్టచెక్కలయ్యే కామెడీ … ఫ్రీగానే చూడొచ్చు

OTT Movie : బాస్ తో హద్దులు మీరే యవ్వారం … పెళ్లి బట్టలతో కూడా వదలకుండా … ఒంటరిగా చూడాల్సిన సినిమా

OTT Movie : 70 ఏళ్ల వృద్ధుడికి థాయ్ మసాజ్ … రష్యన్ అమ్మాయితో రంగీలా డాన్స్ …

OTT Movie : ఫ్యామిలీ కోసం అడల్ట్ సైట్‌లోకి ఎంట్రీ … CA టాపర్ కూడా అలాంటి పనులు … ఈ సిరీస్ ను ఒక్కసారి చూడటం స్టార్ట్ చేస్తే

Big Stories

×