Odela 2 Story reveal:శ్రీమతి లక్ష్మీ రాధా మోహన్ సమర్పణలో.. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై కేకే రాధామోహన్ నిర్మించిన చిత్రం ఓదెల రైల్వే స్టేషన్ (Odela Railway station). సంపత్ నంది (Sampath Nandi) కథ , మాటలు, స్క్రీన్ ప్లే అందించగా అశోక్ తేజ (Ashok Teja) ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. 2022లో భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. వశిష్ట ఎన్ సింహ (Vasistha N Simha), హెబ్బా పటేల్ (Hebba Patel), సాయి రోనక్ (Sai Ronak) , పూజిత పొన్నాడ (Poojitha Ponnada), నాగ మహేష్ (Naga Mahesh) తదితరులు కీలక పాత్ర పోషించారు. ఇక ఈ చిత్రానికి కొనసాగింపుగా ఓదెలా 2 (Odela 2) చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే. ఇందులో తమన్నా (Tamannaah ) కీలక పాత్ర పోషిస్తోంది. సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమాలో తమన్నా భాటియా, హెబ్బా పటేల్ , వశిష్ట ఎన్ సింహ ప్రధాన పాత్రలో నటిస్తూ ఉండగా.. నాగ మహేష్, గగన్ విహారి, సురేందర్ రెడ్డి, యువ, పాల్, పూజా రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక సంపత్ నంది టీం వర్క్స్ పతాకంపై వస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఓదెల 2 స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం..
ఓదెల 2 స్టోరీ ఇదే..
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..ఓదెల 2 స్టోరీ ఇదే అంటూ ఒక స్టోరీ వైరల్ గా మారింది. ఈ సినిమాలో తమన్నా ఒక లేడీ సాధువు పాత్ర పోషిస్తోంది. ఇందులో తమన్నా పాత్ర పేరు శివశక్తి అట. ఆమె దెయ్యాలను వదిలించే పాత్రలో నటిస్తోంది. అంటే అఖండ (Akhanda) సినిమాలో బాలయ్య(Balayya ) పాత్రను తమన్నా పోషిస్తున్న పాత్ర పోలి ఉంటుందని సమాచారం. ఇందులో హెబ్బా పటేల్ తమన్నాకు చెల్లి అవుతుందట. హెబ్బా పటేల్ ఈ సినిమాలో రాధ అనే పాత్రలో నటిస్తోంది. ఓదెల మొదటి భాగం చివరిలో వశిష్ట ఎన్ సింహ తల నరికి చంపేస్తుంది కదా ఇప్పుడు ఓదెలా 2 లో హెబ్బా పటేల్ చేతిలో చంపబడిన వశిష్ట ఎన్ సింహ దయ్యంలా కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ వశిష్ట ఎన్ సింహ ఆత్మను అంతం చేసే పాత్రలో తమన్నా నటిస్తున్నట్లు తెలిసింది. ఇక ఈ పార్ట్ 2 లో హెబ్బా పటేల్ చనిపోతుందని సమాచారం. మొత్తానికి అయితే ఇప్పుడు ఓదెలా 2 స్టోరీ వైరల్ గా మారడంతో ఇందులో కొత్తగా ఏముంది అని నెటిజెన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. చాలా సాధారణంగానే కథను తెరకెక్కిస్తున్నారు మరి విజువల్స్ తోనైనా ఆకట్టుకుంటారా? అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
డిమాండ్ చేస్తున్న సంపత్ నంది..
ఇకపోతే సంపత్ నంది రెండు తెలుగు రాష్ట్రాలలో థియేట్రికల్ హక్కులను కొనుగోలు చేసే డిస్ట్రిబ్యూటర్లకు భారీ డిమాండ్ చేశారట. దాంతో డిస్ట్రిబ్యూటర్లు కూడా కాస్త వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం. ఇటు స్టోరీ చూస్తే చాలా నార్మల్ గా ఉంది. పైగా సంపత్ నంది ఎక్కువ ధర డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ సినిమాను కొనడానికి డిస్ట్రిబ్యూటర్లు వస్తారా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇక ఈ సినిమా స్టోరీ ప్రేక్షకులను మెప్పిస్తుందా లేదా అని తెలియాలి అంటే సినిమా వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే.