BigTV English
Advertisement

Karthi: హిట్ 4లో వీరప్పన్.. గాసిప్స్ అన్నిటినీ నిజం చేస్తూ అప్డేట్

Karthi: హిట్ 4లో వీరప్పన్.. గాసిప్స్ అన్నిటినీ నిజం చేస్తూ అప్డేట్

Karthi: నాచురల్ స్టార్ నాని తన కెరీర్ లో ఫస్ట్ టైం బ్లడ్ బాత్ మూవీ చేశాడు అదే హిట్ 3. అవుట్ అండ్ అవుట్ వైలెన్స్ మూవీ గా ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు వచ్చి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. విడుదలైన కొన్ని రోజుల్లోనే 100 కోట్ల క్లబ్లో చేరిపోయింది. ఇక హిట్ 2 మూవీ చివర్లో హిట్ 3 లో అర్జున్ సర్కార్ పాత్రలో నానిని చూపించారు.అలాగే హిట్ 3 లోను చివరిలో కార్తీ ని హిట్ 4 హీరో అంటూ క్లారిటీ ఇచ్చారు.హిట్ 3 లో కార్తీ వీరప్పన్ పాత్రలో నటించాడు.ఇక హిట్ 4 లోను అదే పాత్రను కంటిన్యూ చేస్తూ హిట్ 4 ను ను శైలేష్ తెరకెక్కించనున్నారు ఆ వివరాలు చూద్దాం..


హిట్ 4లో వీరప్పన్..

హిట్ సిరీస్ లో నెక్స్ట్ హీరో అఫీషియల్ గా రివీల్ అయింది. హిట్ 3 ఎండింగ్లో కార్తీ ఎంట్రీ ఇచ్చారు. ఏసిపి  పాత్రలో ఆయన చార్జి తీసుకున్నారు త్వరలో సిల్వర్ స్క్రీన్ పై ఆయన వీరప్పన్ పాత్రలో నటించబోతున్నారు అన్నట్లు అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. మరో ఇంటరెస్టింగ్ టాపిక్ ఈ మూవీలో CSK vs SRH మ్యాచ్ చూస్తూ చెన్నై అభిమానిగా కార్తీ మెరిసారు. ఆయనను శైలేష్ కొలను డిఫరెంట్ లుక్స్ లో చూపించబోతున్నట్లు సమాచారం. ఏది ఏమైనా హిట్ పరంపరలో కార్తీ నటించడం తో అభిమానులు ఆత్రుతగా సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ నుంచి ఎటువంటి అప్డేట్స్ వచ్చిన నిమిషాల్లో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే కార్తీ పోలీస్ ఆఫీసర్ గా చేసిన సినిమాలన్నీ సూపర్ సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు మరోసారి ఆయన హిట్ సిరీస్ లో నాలుగవ భాగంలో పోలీస్ ఆఫీసర్ వీరప్పన్ గా నటించండడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.


ఇద్దరు హీరోలు వున్నారా..

హిట్ 4 లో ఇద్దరు హీరోలు ఉన్నారంటూ ఇటీవల రూమర్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. హిట్ 3 సినిమా లాస్ట్ లో కార్తీక్ తో పాటు అడవి శేషుని కూడా చూపించారు. అంటే హిట్ ఫోర్ లోకార్తీ, అడవి శేషు నటిస్తారా లేదంటే,కార్తీ, విశ్వక్సేన్ నటిస్తారా అనే ఊహాగానాలు మొదలయ్యాయి .హిట్ 1లో విశ్వక్సేన్ నటించి గుర్తింపు తెచ్చుకున్నారు హిట్ 2 లో అడవి శేషు నటించిన సంగతి తెలిసిందే. ఇక హిట్ 3 లో అర్జున్ సర్కార్ గా నాని విశ్వరూపం చూపించాడు.ఇక హిట్4 లో కార్తి పోలీస్ ఆఫీసర్ గా ఎలాంటి విధ్వంసాన్ని సృష్టిస్తాడో చూడాలి.

ఇక హిట్ 4 లో కార్తీక్ నటిస్తున్నట్లు, ఆయన ఓ డిఫరెంట్ పాత్ర పోషిస్తారని అప్పట్లో వచ్చిన గాసిప్స్ నిజం చేస్తూ హిట్ క్లైమాక్స్లో కార్తీ ని ఎసిపి వీరప్పన్ గా పరిచయం చేశారు. ఈ సీన్లో కార్తీక్ ఇంటెలిజెన్స్ పోలీస్ అధికారిగా కనిపిస్తారు. అంతేకాక ఆయన క్రికెట్ వీరాభిమానిగా ఈ చిత్రంలో కనిపించబోతున్నారు. ఇక ప్రస్తుతం కార్తి సర్దార్ 2 షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఆ సినిమా తరువాత ఆయన హిట్ 4 లో నటించనున్నారు.ఏసీపీ పాత్రలో హిట్ 4 కార్తీతో హిట్ ఫ్రాంచైజ్ కు కొత్త కళ వచ్చింది. ఇప్పటివరకు వచ్చిన గాసిప్స్ నిజం చేస్తూ హిట్ 3 క్లైమాక్స్ లో కార్తి ఎంట్రీ అభిమానులు కేరింతలు కొట్టారు. పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. శైలేష్ కొలను హిట్ సిరీస్ కు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ కొత్త చాప్టర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×