OTT Movie : మలయాళం సినిమాలలో అసిఫ్ అలీ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంటున్నాడు. రీసెంట్ గా ఈ హీరో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. అయితే ఇతను నటించిన ఒక లవ్ స్టోరీ మూవీకి ఓటీటీలో కూడా మంచి వ్యూస్ వచ్చాయి. ఒక లవ్ స్టోరీని కామెడీ ఎంటర్టైనటర్ లో తెరకెక్కించారు. ఫ్యామిలీతో కలసి చూసే విధంగా ఈ సినిమా ఉంటుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
స్టోరీలోకి వెళితే
కుంజెల్దో అనే యువకుడు (అసిఫ్ అలీ) ఒక కాలేజ్ లో బి.ఎ. మలయాళం చదువుతూ ఉంటాడు. అతను తన క్లాస్ మేట్ నివేదిత (గోపిక ఉదయన్)ని మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. నివేదిత కూడా అతని పట్ల ఇష్టంగానే ఉంటుంది. ఇలా వారి మధ్య ప్రేమ మొదలౌతుంది. కాలేజ్ జీవితంలో సరదాగా గడుపుతూ, చిన్నపాటి గోడవలతో ఈ జంట బాగా దగ్గర అవుతారు. అయితే ఒక ఫేర్వెల్ ఫంక్షన్ సమయంలో వారి సంబంధం మరింత బలపడుతుంది. కాలేజ్ ఫేర్వెల్ ఫంక్షన్ సమయంలో ఈ జంట శారీరకంగా ఒక్కటవుతారు. దీని వల్ల నివేదిత గర్భవతి కూడా అవుతుంది. ఇది వారి జీవితంలో ఊహించని మలుపుకి దారి తీస్తుంది.
దీని కారణంగా వీళ్ళు తమ కుటుంబాల నుండి తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంటారు. దీంతో వాళ్ళు ఇంటిని విడిచి బయటికి వెళ్లాల్సి వస్తుంది. ఇక బయట జీవనోపాధి కోసం వీళ్ళు పోరాడుతూ ఉన్నప్పుడు, ఒక ప్రొఫెసర్ వీళ్ళకు ఆశ్రయం ఇస్తాడు. ఈ కష్ట సమయంలో వారు తమ ప్రేమను కాపాడుకోవడానికి, కుటుంబాల మద్దతును పొందడానికి ప్రయత్నిస్తారు. చివరికి ఈ జంట జీవితంలో సక్సెస్ అవుతారా ? పెద్దవాళ్ళ మద్దతును పొందుతారా ? వీళ్ళు ఎటువంటి సమస్యలను ఎదుర్కుంటారు ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ మలయాళ కామెడీ ఎంటర్టైనర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.
జీ 5 (zee 5) లో
ఈ మలయాళ కామెడీ ఎంటర్టైనర్ మూవీ పేరు ‘కుంజెల్దో’ (Kunjeldho). 2021 లో వచ్చిన ఈ మూవీకి మధుక్కుట్టి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అసిఫ్ అలీ, గోపిక ఉదయన్, వినీత్ శ్రీనివాసన్, సిద్ధిక్, రేఖ ప్రధాన పాత్రల్లో నటించారు. షాన్ రహమాన్ ఈ మూవీకి సంగీతం అందించారు. ఈ స్టోరీ ఒక కాలేజ్ ప్రేమ జంట చుట్టూ తిరుగుతుంది. ఇందులో క్యాంపస్ సరదాలు, గొడవలు, ఊహించని మలుపులు ఉంటాయి. జీ 5 (Zee 5) ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.