BigTV English

IT Rides On Tollywood : దిల్ రాజు ఇంట్లో ఐటీ రైడ్స్‌లో ట్విస్ట్… కీలక డాక్యుమెంట్స్ స్వాధీనం…?

IT Rides On Tollywood : దిల్ రాజు ఇంట్లో ఐటీ రైడ్స్‌లో ట్విస్ట్… కీలక డాక్యుమెంట్స్ స్వాధీనం…?

IT Rides On Tollywood: గత మూడు రోజులుగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఐటి అధికారుల దాడి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ముఖ్యంగా బడా నిర్మాత దిల్ రాజు (Dilraju) ఇంట్లో దాదాపు మూడు రోజులపాటు నిర్విరామంగా ఐటీ సోదాలు నిర్వహించారు. అందులో భాగంగానే గురువారం అర్ధరాత్రి సోదాలు ముగిసాయి. అయితే ఈ సోదాలలో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చినట్లు సమాచారం. ముఖ్యంగా దిల్ రాజు ఇంట్లో కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్న ఈడి అధికారులు, దిల్ రాజు నిర్మాణ సంస్థ అయిన “శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్” ఆఫీస్ కి వెళ్లి మరీ అక్కడ సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇకపోతే వచ్చిన లాభాలకు జీఎస్టీ చెల్లింపులు చేయలేదని అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే దిల్ రాజును ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లి, ఆ తర్వాత మళ్లీ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఆఫీస్ కి వచ్చినట్లు సమాచారం. ఇక ప్రస్తుతం సోదాలు ముగిసినప్పటికీ జీఎస్టీ చెల్లింపులపై ఐటి అధికారులు పూర్తి సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది.


దిల్ రాజు సోదరుడి నివాసంలో కూడా ఐటీ సోదాలు..

ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ అధినేత దిల్ రాజుతో పాటు శిరీష్ (Sirish) అలాగే దిల్ రాజు కుమార్తె హన్సిత రెడ్డి (Hanshitha reddy) నివాసాలలో ఐటి అధికారులు సోదాలు నిర్వహించారు. అంతేకాదు వీరికి సంబంధించిన ఆఫీసులతో పాటు అత్యంత సన్నిహితులు, బంధువుల నివాసాలలో కూడా సోదాలు నిర్వహించినట్లు సమాచారం. ముఖ్యంగా దిల్ రాజు నిర్మాణ సంస్థ అయిన “శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్” నిర్మాణ సంస్థ ఆర్థిక లావాదేవీలను పరిశీలించిన ఐటీ అధికారులు , దిల్ రాజు సోదరుడు విజయసింహారెడ్డి (Vijaya Simha Reddy) నివాసంలో కూడా సోదాలు నిర్వహించారు. విజయ్ సింహ రెడ్డి ఆటోమొబైల్ ఫీల్డ్ లో పనిచేస్తున్నారు. అయితే విజయ్ సింహ రెడ్డి, దిల్ రాజు మధ్య లావాదేవీలకు సంబంధించి ఏదైనా సమాచారం లభిస్తుందేమో అనే కోణంలో కూడా ఐటీ అధికారులు పరిశీలించినట్లు సమాచారం.


బడా నిర్మాతలే టార్గెట్..

ఇకపోతే పుష్ప2 సినిమాతో ఏకంగా రూ.1850 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసిన మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ ఎర్నేని (Naveen. Yerneni), వై.రవిశంకర్ (Y. Ravi shankar) నివాసాలలో కూడా సోదాలు నిర్వహించారు. అంతేకాదు పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్(Sukumar) ఇంట్లో కూడా రెండు రోజులపాటు సోదాలు నిర్వహించారు. ఇకపోతే దిల్ రాజు ఇంట్లో నిన్న అర్ధరాత్రి తో సోదాలు ముగియగా.. నిన్న సుకుమార్ ఇంట్లో కూడా సోదాలు పూర్తి చేశారు. అయితే ఇప్పుడు మరి కొంతమందిని టార్గెట్ చేసినట్లు సమాచారం. ముఖ్యంగా బ్లాక్ మనీని బయటకు తీయడమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు చాలామంది నిర్మాతలు జీఎస్టీ కట్టకుండా ఎగ్గొట్టారు అనే నేపథ్యంలో కూడా సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.ఇకపోతే దిల్ రాజు ఇంట్లో జరిగిన ఐటి దాడులపై స్పందించిన హీరో వెంకటేష్ (Venkatesh) తనకు ఈ దాడుల గురించి తెలియదని, తాను మొత్తం వైట్లోనే తీసుకుంటానని తెలియజేశారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×