Maharashtra Fire Accident:మహారాష్ట్రలోని భండారా జిల్లాలో శుక్రవారం పెను ప్రమాదం జరిగింది. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలోని ఆర్కే బ్రాంచ్ సెక్షన్‌లో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఐదుగురు ఉద్యోగులు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు ఉద్యోగులు గాయపడ్డారు. పేలుడు ధాటికి ఫ్యాక్టరీ లోపల గందరగోళం నెలకొంది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఫ్యాక్టరీ లోపల ఉన్న ఇతర ఉద్యోగులను సురక్షితంగా తరలించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ప్రమాదం జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు వేగంగా జరుగుతున్నాయి. ప్రాణాలతో బయటపడిన వారి కోసం రెస్క్యూ , వైద్య బృందాలను రంగంలోకి దింపినట్లు రక్షణ శాఖ ప్రతినిధి తెలిపారు. ఉదయం 10.30 గంటల ప్రాంతంలో కాంప్లెక్స్ లోపల పేలుడు సంభవించిందని జిల్లా కలెక్టర్ సంజయ్ కోల్టే తెలిపారు. ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
ఫ్యాక్టరీలో భద్రతకు సంబంధించి తలెత్తిన ప్రశ్నలు:
ఈ సంఘటన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో భద్రతా ప్రమాణాలకు సంబంధించి తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పని చేస్తున్నారు. పేలుడు శబ్దం చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా వినిపించింది. ఈ విషయమై పోలీసులు, ఫ్యాక్టరీ యాజమాన్యం దర్యాప్తు ముమ్మరం చేశారు.
Maharashtra | There has been an accident of blast at Ordnance factory, Bhandara today morning. The rescue & medical teams are deployed for survivors and rescue is underway. Details will follow.: PRO Defence Nagpur
— ANI (@ANI) January 24, 2025