Thaman On Anirudh: సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో అనిరుద్ ఒకరు. అనిరుద్ సంగీతం గురించి ఎంత చెప్పినా ఎంతో కొంత మిగిలే ఉంటుంది. చాలా చిన్న ఏజ్ లోనే, కొలవెరి అనే పాటతో ఒక సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ధనుష్ పాడిన ఈ పాట త్రి అనే సినిమా మీద అంచనాలను అమాంతం పెంచేసింది. అయితే ఈ సినిమా ఊహించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. కానీ సంగీత దర్శకుడుగా అనిరుద్ మాత్రం మంచి సక్సెస్ అయిపోయాడు. ఇప్పటికి చాలామంది అనిరుద్ మ్యూజిక్ కు బీభత్సమైన ఎలివేషన్ ఇస్తారు. చాలామంది ఎడిట్ చేసి వీడియోలకు అనిరుద్ మ్యూజిక్ ను వాడుతారు. కొన్ని సీన్స్ కు అనిరుద్ ఇచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వలనే ఆ ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన మాస్టర్, విక్రం, లియో సినిమాల మ్యూజిక్ ఏ రేంజ్ లో ఉంటుందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.
వాటన్నిటికీ సమాధానం ఓజి
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ లో తమన్ ఒకరు. తమన్ అందించే మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ముఖ్యంగా బాలకృష్ణ సినిమాలకు తమన్ ఇచ్చే మ్యూజిక్, చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అందుకే కొంతమంది బాలకృష్ణ అభిమానులు తమన్ ను నందమూరి తమన్ అని పిలుస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ప్రతి సినిమాకి తమన్ సంగీతం అందించాడు. ఇక ప్రస్తుతం ఓ జి అనే సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఓజి సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది అని తెలిపాడు. అంతేకాకుండా జైలర్, లియో, విక్రమ్ వంటి సినిమాలకు ఈ ఒక్క సినిమా సమాధానం చెబుతుంది అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఈ విషయాన్ని నేను మీసం మెలేసి మరీ చెబుతున్నాను అంటూ ఆ ఇంటర్వ్యూలో తెలిపాడు. ప్రస్తుతం ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
షూటింగ్ పూర్తయింది రిలీజ్ కు సిద్ధం
ఓజి సినిమా గురించి పవన్ కళ్యాణ్ అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారు తెలిసిన విషయమే. ఎప్పుడో విడుదల కావలసిన ఈ సినిమా కొన్ని కారణాల వలన వాయిదా పడుతూ వచ్చింది. స్వతహాగా సుజిత్ పవన్ కళ్యాణ్ అభిమాని కావడంతో ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్లు అధికారికంగా ప్రకటించారు చిత్ర యూనిట్. సెప్టెంబర్ 25న ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది.
Also Read : Allu Arjun: భాయ్ కి ఏమైంది, ఇలా అయిపోయారేంటి