Hyderabad News: గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మికి ఫోన్ బెదిరింపులు మొదలయ్యాయి. అర్ధరాత్రి కాల్స్ చేసిన ఓ వ్యక్తి, ఆమె వార్నింగ్ ఇచ్చినట్టు తెలస్తోంది. మేయర్‌తోపాటు ఆమె తండ్రి కేశవరావు అంతు చూస్తానంటూ వాయిస్ మెసేజ్ పెట్టాడు.మేయర్ పీఆర్వో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు బంజారాహిల్స్ పోలీసులు.
గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ మేయర్ గద్వాల విజయలక్ష్మికి ఫోన్లో బెదిరింపులు తీవ్ర కలకలం రేపాయి. అర్ధరాత్రి మేయర్‌కు ఫోన్లు చేశాడు ఓ వ్యక్తి. విజయలక్ష్మీతో పాటు ఆమె తండ్రి కేశవరావు అంతు చూస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఫోన్ కాల్స్‌తో పాటు వాయిస్ మెసేజ్ పంపి బెదిరింపులకు పాల్పడినట్టు తెలుస్తోంది.
ఇంతకీ ఫోన్ చేసిన వ్యక్తి ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది. ఇటీవల బోరబండలో చనిపోయిన సర్దార్కి సంబంధించిన వ్యక్తిగా చెప్పుకొచ్చాడు ఆ వ్యక్తి. అసభ్యకరమైన పదజాలంతో బెదిరింపులకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఇటీవల బోరబండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు ఆ ప్రాంతానికి చెందిన సర్ధార్ ఆత్మహత్య చేసుకున్నాడు.
సర్దార్ మృతిపై రాజకీయ రంగు పులుముకుంది. బోరబండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్, ఆయన ఫ్యామిలీ ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుందని ఆరోపించారు బీఆర్ఎస్ నేతలు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినందుకే కార్పొరేటర్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తోందని కౌంటర్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ.
ALSO READ: ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కన్నుమూత
సర్దార్ మరణాన్ని బీఆర్ఎస్ రాజకీయాల కోసం వాడుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి సమయంలో సర్దార్ కి చెందిన వ్యక్తినంటూ నేరుగా మేయర్‌కు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడటం కలకలం రేపింది. పోలీసుల విచారణలో ఇంకెన్ని విషయాలు బయటకు వస్తాయో చూడాలి.