OG Shooting Update: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం OG. ప్రస్తుతం పవన్ తన సినిమాలపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. తను అనుకున్న సినిమాలన్నీ వరుసగా పూర్తి చేసే పనిలో ఉన్నారు. అందులో భాగంగా ఇటీవల హరిహర వీరమల్లు సినిమాకు కొన్ని రోజులు షూటింగ్ కి డేట్స్ ఇచ్చి ఆ సినిమా పూర్తి చేశారు. ఇక తాజాగా OG కి పూర్తిగా తన డేట్ లను ఇవ్వనున్నాడు. ఆ వివరాలు చూద్దాం..
సెట్స్‌లోకి ఓజాస్ గంభీర ఆగమనం..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అటు రాజకీయంగా, కుంకి ఏనుగులు తెచ్చేందుకు కర్ణాటక కు వెళ్లారు. ఆ తరువాత క్యాబినెట్ మీటింగ్ లోను కనిపించారు. మధ్యలో కీరవాణి తో కొంత టైం స్పెండ్ చేశారు. ఇక ఇప్పుడు ఓ జి సెట్స్ పైకి వెళ్ళనున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ తన తదుపరిచిత్రం OG షూటింగ్లో పాల్గొననున్నారు. రేపటినుండి ఈ మూవీ షూటింగ్ ముంబైలో ప్రారంభమవుతుంది. శనివారం నుంచి పవన్ కళ్యాణ్ చిత్రీకరణలో పాల్గొనున్నారు. ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్ గ్యాంగ్స్టర్ మూవీ గా ప్రేక్షకుల ముందుకు రారు ఉంది. సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా తెలుగు తమిళం కన్నడ మలయాళం హిందీ భాషల్లో సెప్టెంబర్ 26న విడుదల కానుంది. ఇక మీదట తరచూ ఓ జి అప్డేట్లను ఇవ్వాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు.
OG కి సీక్వెల్ ప్లాన్ చేస్తున్న సుజిత్ ..
పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబినేషన్లో వస్తున్నOG సెప్టెంబర్ 26 కి విడుదల చేసే ప్లాన్ లో చిత్ర యూనిట్ ఉంది. అయితే ఈ మూవీ తర్వాత OG 2 కూడ ఉండబోతుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. క్లైమాక్స్ లో OG 2 పై హింట్ ఇస్తారని కూడ తెలుస్తోంది. అయితే ఇందులో పవన్ ఓ అతిథి పాత్రలో పరిమితమయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఓజీని కూడా ఓ ఫ్రాంచైజీ గా మార్చే ఆలోచనలో సుజిత్ ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ఏం జరిగింది అనే పాయింట్ తో సీక్వెల్ కంటిన్యూ చేయాలని ఆలోచనలో మూవీ టీం ఉన్నట్లు తెలుస్తోంది. కాకపోతే పవన్ కోసమే ఈ కథను సిద్ధం చేయాలి అని అనుకున్న, పవన్ కమిట్మెంట్ వల్ల ఆయన్ని సినిమాలో ఓ అతిథి పాత్రలో తీసుకురానున్నట్లు సమాచారం. ఇక సుజిత్ ఓజీ తర్వాత నానితో మూవీ చేస్తున్నారు. ఆ తర్వాత రామ్ చరణ్, సుజిత్ కాంబోలో ఓ సినిమా రానున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు ప్రాజెక్టుల తర్వాతOG 2 పై సుజిత్ క్లారిటీ ఇవ్వనున్నారు.