Keerthi Suresh: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్. తమిళ, తెలుగు, హిందీ చిత్రాలలో నటిస్తున్నారు. ఈమె తండ్రి జి సురేష్ కుమార్ మలయాళ చిత్ర నిర్మాతగా, తల్లి మేనక నటిగా, అందరికీ పరిచయమే, 2000 సంవత్సరంలో కీర్తి తండ్రి నిర్మించిన పైలెట్ చిత్రంలో బాలనటిగా కీర్తి ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. 2016 లో వచ్చిన నేను శైలజ అనే చిత్రంలో రామ్ సరసన నటించి తెలుగులో గుర్తింపు తెచ్చుకున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కీర్తి సురేష్ తాజాగా ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఈమె ఓ గేమ్ లో ఓడిపోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వివరాలు చూద్దాం..
పాపం కీర్తి సురేష్ ఓడిపోతే.. చూడటానికి బాధగా ఉంది..
కీర్తి సురేష్ బాలనటిగా ఎన్నో చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత టాలీవుడ్ లో నేను శైలజ అనే మూవీ తో గుర్తింపు తెచ్చుకున్నారు. మహానటి సినిమాతో జాతీయ ఉత్తమ నటిగా గుర్తింపు పొందారు. ఆ తర్వాత ఎన్నో సినిమాలలో కొత్త కొత్త పాత్రలో కనిపిస్తూ మెప్పించారు. గ్లామర్ పాత్రలకు మాత్రమే కాక నటనకు ప్రాధాన్యం ఉండే చిత్రాలను కీర్తి సురేష్ చేయడం విశేషం. నేను లోకల్, సర్కార్, దసరా, వంటి చిత్రాలతో పాపులర్ అయ్యారు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే కీర్తి సురేష్ తాజాగా వీడియోను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఈ వీడియోలో క్యాచ్ ది బాటిల్ ఛాలెంజ్ గేమ్ ఆడుతూ ఆమె ఒక్క బాటిల్ ని కూడా పట్టుకోలేక ఓడిపోయారు. చివరి వరకు ఎంతో ప్రయత్నించి ఆటలో ఓడిపోయారు. ఈ వీడియోలో ఆమె బాటిల్స్ ని పట్టుకోలేక నందుకు నిరాశతో, అప్సెట్ అయినట్టు మనకి వీడియోలో కనిపిస్తుంది. ఈ వీడియో చూసిన వారంతా కీర్తి ఆటలో ఓడిపోవడం ఎంతో బాధగా ఉంది అంటూ కామెంట్ చేస్తున్నారు బెటర్ లక్ నెక్స్ట్ టైం అంటూ మరికొందరు ఎంకరేజ్ చేస్తున్నారు.
బాలీవుడ్ లో ఎంట్రీ ..మరోసారి కొత్తగా రానున్న కీర్తి ..
కీర్తి సురేష్ తన కెరీర్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలను పోషించారు. సర్కారు వారి పాట చిత్రంలో మహేష్ బాబుతో కలిసి నటించారు. ఆ తర్వాత తెలుగులో కల్కి మూవీలో ప్రభాస్ వాహనంకు వాయిస్ ఇచ్చారు. బాలీవుడ్ లో బేబీ జాన్ చిత్రంతో అడుగు పెట్టారు. ఆశించినంత స్థాయిలో ఈ సినిమా విజయాన్ని సాధించలేదు. అయితే ఈ సినిమా తర్వాత ఆమెకు బాలీవుడ్ లో అవకాశాలు వచ్చాయి కానీ, ఇప్పటివరకు ఏ మూవీని ఒప్పుకోలేదు. నెట్ ఫిక్స్ లో ఓ వెబ్ సిరీస్ లో నటించబోతున్నట్లు సమాచారం. తెలుగులోనూ విజయ్ దేవరకొండ చిత్రంలో, ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఇక పాత పద్ధతిలో నటనకు ఫోకస్ ఉండే పాత్రలు చేస్తే ఇక వర్కౌట్ అవ్వదని గ్రహించిన ఈ అమ్మడు రూటు మార్చి కొత్త పాత్రలతో రాబోతున్నట్లు తెలుస్తోంది.
?igsh=b2Nqa3A4dGhycnds