BigTV English

Extra Ordinary Man Movie : మాస్ పూనకాలు తెప్పిస్తున్న ఓలే ఓలే పాపాయి ..

Extra Ordinary Man Movie : మాస్ పూనకాలు తెప్పిస్తున్న ఓలే ఓలే పాపాయి ..
Extra Ordinary Man Movie

Extra Ordinary Man Movie : నితిన్, శ్రీలీల కాంబోలో వస్తున్న సరికొత్త ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్. డిసెంబర్ ఎనిమిదవ తేదీన వరల్డ్ వైడ్ గ్రాండ్ విడుదలకు సిద్ధంగా ఉంది ఈ చిత్రం. ఇప్పటికే విడుదల చేసిన ఈ మూవీ టీజర్, ట్రైలర్ సినిమాపై పాజిటివ్ వైబ్రేషన్స్ పెంచాయి. ట్రైలర్ లో బ్యాక్ టు బ్యాక్ కామెడీ డైలాగ్స్, నితిన్ కామెడీ టైమింగ్, రాజశేఖర్ ఫన్నీ రోల్ చిత్రం పై మంచి బజ్ నెలకొల్పాయి. ఇక ఈ చిత్రానికి సంబంధించిన పాటలు కూడా మూవీపై హైప్ ను బాగా పెంచే విధంగానే ఉన్నాయి. మూవీ విడుదల టైం దగ్గర పడడంతో..హరీష్ జయరాజ్ సంగీతం అందించిన మరొక సంచలమైన పాట ఈ చిత్రం నుంచి విడుదల చేశారు.


నితిన్ వేసే మాస్ డాన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో అందరికీ తెలుసు.. ఇక శ్రీ లీల మాస్ స్టెప్స్ కి స్టేజి ఉగాల్సిందే. ఇలాంటి ఊర మాస్ కాంబినేషన్లో వస్తున్న మాస్ సాంగ్ ఎలా ఉంటుందో ఊహించండి. ఎక్స్ట్రా మాస్ రచ్చ గా అందరి ముందుకి వచ్చిన ఓలే ఓలే పాపాయి సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. ఇక ఈ పాటలో నితిన్ ,శ్రీ లీల డ్రెస్సింగ్ స్టైల్.. స్టెప్పులు వేసే విధానం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

ఒకపక్క తీన్ మార్ బ్యాండ్ మోత మోగుతుంటే.. ఇంకోపక్క శ్రీ లీల కిర్రాక్ మాస్ స్టెప్స్ తో అదరగొడుతుంటే.. థియేటర్లో ఫాన్స్ కి పూనకాలు లోడింగే.. అనడంలో ఎటువంటి డౌట్ లేదు. థియేటర్లో ఈ పాట ప్లే చేసినప్పుడు విజిల్స్ మోగేలా ఉంది. ఈ పాట మూవీ పై అంచనాలను భారీగా పెంచేసింది. తన వయసులో సగం ఉండే హీరోయిన్ తో నితిన్ తగ్గేదే లేదు అన్నట్లుగా..అదే స్పీడ్ తో స్టెప్పులు కలపడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.


ఇక ఆ విషయం పక్కన పెడితే ఈ చిత్రానికి డైరెక్టర్ వక్కంతం వంశీ.. ఇంతకుముందు ఇతను అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య సినిమా డైరెక్టర్ చేశాడు. దానికంటే ముందు కిక్, రేసుగుర్రం, టెంపర్ లాంటి ఎన్నో సినిమాలకు కథలను అందించాడు. ఈ సినిమాతో తనని తాను ప్రూవ్ చేసుకోవాలని వంశీ గట్టిగా ప్రయత్నిస్తున్నాడు.. మరోపక్క నితిన్ కి కూడా ఈ మూవీ చాలా ఇంపార్టెంట్. ఎలాగైనా ఈ మూవీతో సక్సెస్ అందుకొని కెరీర్ ని ట్రాక్ పైకి తేవాలని నితిన్ భావిస్తున్నాడు. ఈ చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన రాజశేఖర్ కూడా సాలిడ్ గా తిరిగి ఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాడు.మరి 8 న వచ్చే ఈ చిత్రం ఎంతవరకు వీరి ఆశలను నెరవేరుస్తుందో చూడాలి.

Related News

Alekhya Chitti pickles: పిక్‌నిక్‌కి వెళ్లి పికిల్స్ తినడం ఏంట్రా… మీ ప్రమోషన్స్ పాడుగాను!

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

Big Stories

×