BigTV English

Oscar -2025: ఆస్కార్ అర్హత కోల్పోయిన స్టార్ కంపోజర్.. ఆ ఆరోపణలే కారణమా..?

Oscar -2025: ఆస్కార్ అర్హత కోల్పోయిన స్టార్ కంపోజర్.. ఆ ఆరోపణలే కారణమా..?

Oscar -2025 : ఆస్కార్ (Oscar).. ఈ అవార్డును సొంతం చేసుకోవడం ప్రతి ఒక్కరి కల. అందుకే ఆస్కార్ దక్కించుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా తమ శక్తికి మించి కష్టపడతారు. అయితే అన్నీ చేసిన తర్వాత చేతుల వరకు వచ్చి జారిపోతే మాత్రం ఆ బాధ ఎలా ఉంటుందో వర్ణనాతీతం. సరిగా ఇప్పుడు అలాగే ఒక కంపోజర్ విషయంలో జరగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వచ్చినట్టే వచ్చి, ఆయనకు ఆస్కార్ చేజారిపోవడం ఆశ్చర్యంగా మారింది. మరి ఆయన ఎవరు..? అసలు ఏం జరిగింది..? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.


ఆస్కార్ కు అర్హత కోల్పోయిన ప్రముఖ జర్మన్ కంపోజర్..

తిమోతి చలామెట్ నటించిన డూన్ -2 సినిమాతో ప్రశంసలు అందుకున్న ప్రముఖ జర్మన్ కంపోజర్ హన్స్ జిమ్మెర్ (Hans Zimmer) స్కోర్ అకాడమీ నియమం ప్రకారం.. ఆస్కార్ 2025 రేస్ కు అనర్హులుగా ప్రకటించడం జరిగింది. ఆస్కార్ అకాడమీ రూల్స్ ప్రకారం.. డూన్ -2 స్కోర్ సంగీతం యొక్క పరిమితిని మించిపోవడం తో ఆస్కార్ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అకాడమీ నియమం ప్రకారం ఏదైనా మీడియా నుండి సీక్వెల్ లేదా ఫ్రాంచైజీల నుండి సంగీతం కాపీ చేసినట్లయితే.. ఆస్కార్ బరి లోకి నిలిచినప్పుడు స్కోర్ ముందుగా ఉన్న థీమ్ లేదా ఫ్రాంచైజీ లో మునుపటి స్కోర్ ల నుండి అరువు తెచ్చుకున్న సంగీతంలో 20 శాతానికి మించి ఉపయోగించకూడదు. అంటే ఏదైనా ఒక సినిమాలోని సంగీతాన్ని 20 శాతానికి మించి కాపీ చేయకూడదు. కానీ ఇక్కడ జిమ్మెర్ డూన్ -2 సినిమా కోసం 20 శాతం కంటే ఎక్కువ కాపీ చేసినందుకే ఇతర నామినీలతో పోటీ పడడానికి అర్హత సాధించలేదు. దీంతో ఈయనకు ఈ విషయం షాక్ కి గురిచేసింటుందని అందరూ అనుకున్నారు.


ఆస్కార్ అవసరం లేదంటూ షాకింగ్ కామెంట్స్..

అందులో భాగంగానే జర్మన్ కంపోజర్ అయిన ఈయన ఈ వార్తలు చూసి ఏమాత్రం ఆశ్చర్యపోకపోవడం గమనార్హం. ఎందుకంటే ఆయన అవార్డుల కోసమే సంగీతం చేయలేదని మీడియాతో చెప్పుకొచ్చారు. ఆయన మాట్లాడుతూ.. వాస్తవానికి నేను ఈ సినిమాకి సంగీతాన్ని ఎక్కడా కాపీ చేయలేదు. కానీ ఏఐ ను మాత్రమే ఉపయోగించాను. ఇప్పుడు ఆస్కార్ 2025 కి అర్హత లభించక పోయినా నాకు ఎటువంటి బాధ లేదు. ఎందుకంటే డెనిస్ విల్లెనెయువ్ వంటి స్టార్ సెలబ్రిటీలతో కలిసి పని చేయడం మేము గర్వంగా భావిస్తున్నాము. వారి సహకారం మాకు ఎంతో స్ఫూర్తిని ఇచ్చింది. సినిమా అనుభవాన్ని ఇచ్చింది. సో ఈ అనుభవం ముందు మాకు అవార్డు రాకపోయినా పర్వాలేదు అంటూ ధైర్యంగా ఆయన చెప్పడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

డూన్ -2 సినిమా తారాగణం..

డూన్ -2 సినిమా విషయానికి వస్తే.. ఈ సంవత్సర ప్రారంభంలో విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. అంతే కాదు కమర్షియల్ సినిమాగా రికార్డు సృష్టించింది. రచయిత ఫ్రాంక్ హెర్బర్ట్ పుస్తకాల ఆధారంగానే ఈ సినిమా రూపొందించారు ఇందులో తిమోతి చలామెట్ , రెబెక్కా ఫెర్గూసన్ , ఆస్టన్ బట్లర్, ఫ్లోరెన్స్ పగ్, జేవియర్ బార్డెమ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×