OTT Movie : ఓటిటి ప్లాట్ ఫామ్ ఎంటర్టైన్మెంట్ కి వేదికగా మారింది. భాషతో ప్రమేయం లేకుండా కంటెంట్ బాగుంటే, వాటిని వదిలిపెట్టకుండా చూస్తున్నారు మూవీ లవర్స్. వీటిలో మలయాళం నుంచి వచ్చే సినిమాలను మిస్ కాకుండా చూస్తున్నారు. మంచి కంటెంట్ తో వస్తున్న ఈ సినిమాలు ప్రేక్షకులను బాగా అలరిస్తున్నాయి. అలా వచ్చిన ఒక కామెడీ ఎంటర్టైనర్ మూవీ, ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
రెండు ఓటిటిలలో
ఈ మలయాళం కామెడీ ఎంటర్టైనర్ మూవీ పేరు ‘తానర‘ (Thaanara). ఈ మూవీకి హరిదాస్ దర్శకత్వం వహించాడు. మాజీ హోం మంత్రి కుమార్తె అంజలి, ప్రతిపక్ష ఎమ్మెల్యే ఆదర్శ్‌ను వివాహం చేసుకుంటుంది. అయితే తన భర్తపై అపనమ్మకంతో, జేమ్స్ అనే పోలీసు అధికారి సహాయంతో అతని కార్యకలాపాలను అంజలి రహస్యంగా పర్యవేక్షిస్తుంది. ఈ మూవీ మనోరమ మ్యాక్స్ (Manorama Max), అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లలో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
ఆదర్శ్ ఒక ఎమ్మెల్యే గా ఉంటూ తన భార్య అంజలికి ఢిల్లీకి వెళ్తున్నానని చెప్పి బయలుదేరుతాడు. అయితే జేమ్స్ అనే పోలీస్ ఆఫీసర్ ని ఆదర్శ్ ను ఫాలో చేయమని అంజలి చెబుతుంది. ఆదర్శ్ కూడా ఏర్పోర్ట్ వరకు అనుమానం రాకుండా వెళ్తాడు. ఎయిర్ పోర్ట్ కి ఆదర్శ్ వెళ్ళాడని అంజలికి జేమ్స్ చెప్తాడు. ఈ క్రమంలో ఆదర్శ్ తిరిగి తన గెస్ట్ హౌస్ కి వెళ్లిపోతాడు. భార్యకి ఢిల్లీకి వెళ్తున్నానని అబద్ధం చెప్పి, సినీ యాక్టర్ అయిన శ్రద్ధ అనే అమ్మాయిని గెస్ట్ హౌస్ కి తెచ్చుకుంటాడు. ఇంతలోనే ఆ గెస్ట్ హౌస్ లోకి దొంగతనం చేయడానికి ఒక దొంగ వస్తాడు. తన భార్యకి ఆపరేషన్ కోసం ఈ పని చేయడానికి వస్తాడు. ఆదర్శ్, శ్రద్ధ అక్కడికి రావడంతో ఆ దొంగ బాగా భయపడతాడు. ఇంట్లో ఎవరో ఉన్నారని ఆదర్ష్ గుర్తిస్తాడు. ఆ దొంగని పట్టుకొని వార్నింగ్ ఇస్తాడు. ఎమ్మెల్యే ఇంటికి దొంగతనానికి వస్తావా అంటూ, బెదిరించడంతో అతడు దొంగలించిన 80 వేల రూపాయలను తిరిగి ఇచ్చేస్తాడు. లక్షలు డబ్బు ఉంటే కొంచమే తీసుకున్నావు ఎందుకని అడుగుతాడు ఆదర్శ్. తాను దొంగతనానికి కొత్తఅని, భార్య ఆపరేషన్ మాత్రమే తీసుకున్నానని చెప్తాడు.
ఇంతలోనే ఆదర్శ భార్య గెస్ట్ హౌస్ కి వస్తుంది. అక్కడ అమ్మాయి ఉండటంతో ఆదర్శ్ ను గట్టిగా అడుగుతుంది. ఆదర్శ్ తెలివిగా, వాళ్ళిద్దరు భార్యాభర్తలు అంటూ సమాధానం చెబుతాడు. బిజినెస్ గురించి మాట్లాడుకోవడానికి, ఢిల్లీ వెళ్లకుండా ఇటు వచ్చానని కవర్ చేస్తాడు. నిజానికి భర్త ఢిల్లీకి వెళ్లిపోయాడు అనుకొని, అంజలి గెస్ట్ హౌస్ కి వస్తుంది. జేమ్స్ తో అంజలికి రిలేషన్ ఉంటుంది. వాళ్ళిద్దరూ భర్త లేడని గెస్ట్ హౌస్ లో సరదాగా గడపలనుకుంటారు. వాళ్లంతా డ్రింక్ చేసిన తర్వాత జేమ్స్ అంజలి కోసం అక్కడికి వస్తాడు. ఈ గజిబిజి గందరగోళంలో స్టోరీ కామెడీగా సాగిపోతుంది. చివరికి ఆదర్శ్ గురించి అంజలికి తెలిసిపోతుందా? అంజలి ఎఫైర్ ఆదర్శ్ కి తెలుస్తుందా? అక్కడికి వచ్చిన శ్రద్ధ పరిస్థితి ఏమిటి? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ‘తానర’ (Thaanara) కామెడీ మూవీని మిస్ కాకుండా చూడండి.