BigTV English

Indrani Mukerjea : ఓటీటీ ఫ్లాట్‌ఫాంలో దూసుకెళ్తున్న క్రైమ్ సిరీస్, 18 దేశాల్లో ట్రెండింగ్

Indrani Mukerjea : ఓటీటీ ఫ్లాట్‌ఫాంలో దూసుకెళ్తున్న క్రైమ్ సిరీస్, 18 దేశాల్లో ట్రెండింగ్

ott the indrani mukerjea story buried truth documentary webseries


The Indrani Mukerjea Story on OTT (Entertainment news today ) : ఇటీవలి కాలంలో టాలీవుడ్ నుండి హాలీవుడ్‌ దాకా ఓటీటీల్లో డాక్యు సిరీస్‌ల హవానే నడుస్తోంది. ఎక్కడ చూసిన వీటి క్రేజ్ అంతకంతకు పెరిగిపోతోంది. మెయిన్‌గా సంచలన కేసుల ఆధారంగా రూపొందిన క్రైమ్ సిరీస్‌లపై ఆడియెన్స్ ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఈ క్రమంలో ది ఇంద్రాణి ముఖర్జియా బరీడ్ ట్రూత్ అనే డాక్యు సిరీస్‌కి భారీగా డిమాండ్ పెరిగింది. అంతేకాదు ఈ సిరీస్‌కి భారీగా వ్యూస్ పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా సంచలనమైన షీనా బోరా హత్య కేసుపై ఈ సిరీస్‌ని రూపొందించారు. అందులోనూ ఈ సిరీస్ ఆద్యంత ఉత్కంఠ రేపుతూ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో దూసుకెళుతోంది.

ఇక ఈ మూవీపై మొదటి నుంచే ఆడియెన్స్‌కి ఆసక్తి నెలకొంది. కోర్టులో కేసుల వల్ల ఆలస్యమైన ఎట్టకేలకు ఈ సిరీస్ ఫిబ్రవరి 29 న నెట్‌ఫ్లిక్స్ ఓటీటీల్లో స్ట్రీమింగ్‌కు ఎంట్రీ ఇచ్చింది. స్టార్టింగ్ నుండి మంచి ఆదరణ రావడంతో ఓటీటీల ప్లాట్‌ఫాంల వద్ద జెట్‌ స్పీడ్‌లో దూసుకెళ్తోంది.


Read More: ఐటమ్ సాంగ్స్‌కి నో చెప్పిన శ్రీలీల, రీజన్ అదేనట

ది ఇంద్రాణి ముఖర్జియా డాక్యు సిరీస్‌కి నానాటికి క్రేజ్ పెరుగుతోంది. భారత్‌తో పాటు కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో సుమారు 18 దేశాల్లో ఈ సిరీస్ ట్రెండ్ అవుతోంది. నెట్‌ప్లిక్స్‌ గ్లోబల్ ట్రెండింగ్‌లో టాప్ – 7లో ఈ సిరీస్ నిలిచింది. వారంలోనే ఈ డాక్యు సిరీస్‌కి 202 మిలియన్లపైగా వ్యూస్ వచ్చాయి. 6.9 మిలియన్ వాచ్ హవర్స్ దక్కించుకుంది.

షీనా బోరా మర్డర్‌ కేసు దేశాన్ని కుదిపేసింది. 2012 ఏప్రిల్‌లో షీనా హత్యకు గురయ్యారు. అయితే.. మూడేళ్ల తరువాత 2015 లో ఈ హత్య ఉదంతం బయటకి వచ్చింది. వేరే కేసులో పట్టుబడిన ఇంద్రాణి ముఖర్జియా డ్రైవర్ ఈ హత్య గురించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో షీనా హత్య వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో షీనా బోరా తల్లి ఇంద్రాణి ముఖర్జియాను 2015లో అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది.

Read More: ఓటీటీలో 96వ ఆస్కార్ అవార్డ్స్ వేడుక.. లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే

షీనా బోరా కేసును సీబీఐ విచారిస్తోంది. ఈ కేసులో ఇంద్రాణితో పాటు ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ సహా మరికొందరు అరెస్ట్ అయ్యారు. ఈ కేసు విచారణ సాగిన కొద్ది షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. దీంతో దేశం దృష్టిని ఈ కేసు ఆకర్షించింది. ఇంద్రాణి ముఖర్జియా ఏడేళ్ల పాటు జైలులో ఉన్నారు. 2022లో ఆమెకు బెయిల్ వచ్చింది. ఇక ఈ కేసు విచారణను సీబీఐ ఇంకా కొనసాగిస్తోంది.

 

 

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×