Pahalgam Terror Attack: మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాద దాడి ఎంత క్రూరమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మినీ స్విట్జర్ల్యాండ్ గా పేరుపొందిన ఈ ప్రాంతానికి పర్యటకులు నిత్యం వెళుతూ ఉంటారు.. పైగా ఇప్పుడు సమ్మర్ కావడంతో చాలామంది ఈ సెలవులలో సరదాగా గడపడానికి ఇక్కడికి వెళ్లారు. అయితే సడెన్ గా కొంతమంది ఉగ్రవాదులు సైనికుల రూపంలో వచ్చి అమాయకపు ప్రజలపై దాడి చేయడం అమానవీయం అనే చెప్పాలి. అభం శుభం తెలియని టూరిస్టులను టార్గెట్ గా చేసుకొని వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి అత్యంత క్రూరంగా వారిని హతమార్చారు. ప్రస్తుతం ఈ విషయం ఒక్కసారిగా భారతదేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. అటు ప్రపంచ దేశాలు కూడా ఈ సంఘటనపై విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఇంతటి దాడి నుండి అమాయకులు కొంతమంది ప్రాణాలు కోల్పోతే, మరికొంతమంది అదే ప్రాణాలను చేతిలో పెట్టుకొని బయటపడ్డారు. ఈ క్రమంలోనే ఈ ఉగ్రవాద దాడి నుంచి తృటిలో తప్పించుకొని తమ ఆయుష్యుని పెంచుకుంది ఒక బాలీవుడ్ జంట.
ఉగ్రవాద దాడి నుండి తప్పించుకున్న సెలబ్రిటీ జంట..
వారెవరో కాదు ప్రముఖ నటి దీపికా కాకర్ (Deepika kaakar) ఆమె భర్త షోయబ్ ఇబ్రహీం (Shoaib Ibrahim).. ఇటీవలే వీరిద్దరూ కాశ్మీర్ కి వెళ్ళిన విషయం తెలిసిందే. ఈ విహారయాత్రకు సంబంధించిన ఫోటోలను ఆదివారం కూడా తమ ఇన్స్టాలో పంచుకున్నారు. కాశ్మీర్ లోని అందమైన ప్రదేశాలను వీడియో తీసి ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు కూడా. ఇకపోతే ఈ ఘటన జరిగిన తర్వాత వీరు అక్కడే ఉన్నారేమో అని అభిమానులు ఆందోళన పడుతున్న నేపథ్యంలో తాజాగా దీపిక అలాగే ఆమె భర్త షోయబ్ ఇబ్రహీం ఢిల్లీకి చేరుకున్నట్లు తెలుపుతూ ఒక పోస్ట్ పంచుకున్నారు. “ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మేము క్షేమంగా ఉన్నాము. మంగళవారం ఉదయమే కాశ్మీర్ నుంచి బయలుదేరాము. సురక్షితంగా తిరిగి ఢిల్లీ కి చేరుకున్నాము” అంటూ తన ఇన్స్టా లో తెలిపారు.
షోయబ్ పై నెటిజన్స్ ఫైర్..
అయితే ఇదంతా బాగానే ఉన్నా షోయబ్ పెట్టిన పోస్ట్ పై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే.. తాము క్షేమంగా ఉన్నామని తెలుపుతూ దీపిక భర్త , నటుడు షోయబ్ పెట్టిన పోస్ట్ విమర్శలకు దారి తీసింది. వారు ఢిల్లీ చేరుకున్నట్టు తెలిపిన ఇతడు ఈ పర్యటనపై వ్లాగ్ చేసామని, త్వరలోనే విడుదల చేస్తామని తెలిపారు. ఒకవైపు పెను విషాదం దేశాన్ని బాధపెడుతుంటే.. ఇప్పుడు వ్లాగ్ ప్రచారం చేసుకుంటున్నారా? అంటూ కొంతమంది నెటిజన్లు వీరిపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఏదిఏమైనా పుల్వామా దాడి తర్వాత జరిగిన ఈ దాడి అత్యంత క్రూరత్వం అని చెప్పవచ్చు. ఇకపోతే ఈ పహాల్గామ్ సమీపంలోని బైసరన్ లో కొండల మధ్య పర్యాటకులపై అత్యంత పాశవీకంగా ఉగ్రవాదులు దాడి చేసి, 28 మందిని పొట్టన పెట్టుకున్నారు. మరో 20 మంది ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. మంచు కొండలలో పక్షుల కిలకిల రావాలతో ప్రకృతి వాతావరణాన్ని ఆస్వాదించిన పర్యాటకుల రక్తంతో ఇప్పుడు అక్కడి ప్రదేశం నిండిపోయింది.
also read:Singer Pravasthi Aradhya: ప్రవస్తి ఎవరు? నాలుగేళ్లకే ఛాంపియన్.. ఇప్పుడు ఆమెకు జరిగిన అన్యాయం ఇదేనా?