Singer Pravasthi Aradhya: సింగర్ ప్రవస్తి (Singer Pravasthi).. గత రెండు రోజులుగా ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా.. ఏ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఓపెన్ చేసినా ఈమె గురించే ప్రస్తావన.. గత 25 సంవత్సరాలుగా ఈ ప్రముఖ ఛానల్లో ప్రసారమవుతున్న ‘పాడుతా తీయగా’ కార్యక్రమం ఎంత సక్సెస్ఫుల్ గా దూసుకుపోతోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు ఈమె కూడా చైల్డ్ సింగర్ గా ఇందులో పాటిస్పేట్ చేసి ఎస్ జానకి (S.Janaki ), ఎస్పీ బాలసుబ్రమణ్యం(SP . Balasubramanyam) వంటి దిగ్గజ గాయకుల మన్ననలను పొందింది. అలాంటి ప్రవస్తి ఇప్పుడు సడన్గా ఇదే షో నుండి ఎలిమినేట్ అవ్వడం ఒక ఎత్తైతే, తనను చులకనగా చూశారని, పక్షపాతం చూపించారని, తన తల్లిని అవమానపరిచారని, అసభ్యకరంగా తనను చూపించారు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇక అంతేకాదు పలు యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూ ఇస్తూ అసహనం వ్యక్తం చేసింది . ఈ నేపథ్యంలోనే ఈ ప్రవస్తి ఎవరు..? నాలుగేళ్లకే ఛాంపియన్ అయిన ఈమెకు ఇప్పుడు జరిగిన అన్యాయం ఏంటి? అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి.
ఎవరీ ప్రవస్తి..?
ఈమె పేరు ప్రవస్తి ఆరాధ్య.. 2006 డిసెంబర్ 9న జన్మించిన ఈమె ప్రస్తుత వయసు 19 సంవత్సరాలు. తెలుగు , తమిళ్ సంగీత రియాలిటీ షోలలో పాల్గొని తన ప్రతిభను చాటుకుంది. ‘రైనో’ అనే మరో పేరుతో పిలవబడే ప్రవస్తి చిన్న వయసులోనే తన సంగీత ప్రయాణాన్ని ప్రారంభించింది. 2011లో కేవలం నాలుగు సంవత్సరాల వయసులోనే ప్రముఖ ఛానల్లో ప్రసారమైన ‘సరిగమప లిటిల్ చాంప్స్’ టైటిల్ గెల్చుకుంది. 2014లో ‘ఎయిర్టెల్ సూపర్ సింగర్ జూనియర్ 4’ (తమిళ్) లో పాల్గొని ఫైనల్స్ వరకు చేరుకుంది. ఇక 2024లో స్టార్ మా నిర్వహించిన ‘సూపర్ సింగర్’ టైటిల్ ని కూడా గెలుచుకుంది. అలా ప్రతిభావంతులైన యువ గాయకురాలిగా తన పేరును పదిలం చేసుకున్న ప్రవస్తి గీతాంజలి ఒలంపియాడ్ స్కూల్లో విద్యాభ్యాసం పూర్తి చేసింది. పేదలకు సేవ చేయడానికి ఐపీఎస్ అధికారి కావాలనే తన కోరికను వ్యక్తం చేసిన ఈమె.. ఎస్ జానకి, ఎస్పీ బాలసుబ్రమణ్యం ప్రోత్సాహంతో సంగీత రంగంలో రాణించాలని అనుకుంది.
పాడుతా తీయగా షోలో చేదు అనుభవం..
1996లో ప్రముఖ బుల్లితెర ఛానల్లో ప్రారంభమైన ఈ పాడుతా తీయగా షో.. దాదాపు 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దివంగత లెజెండ్రీ గాయకులు ఎస్పీ బాలసుబ్రమణ్యం ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు ఆయన తనయుడు ఎస్పీ చరణ్ (SP Charan) కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సింగర్ సునీత (Singer Sunitha), ఆస్కార్ గ్రహీత ఎం ఎం కీరవాణి.(MM Keeravani)తో పాటు లిరిసిస్ట్ చంద్రబోస్ (Chandrabose ) జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం సిల్వర్ జూబ్లీ సీరీస్ 2025 కొనసాగుతూ ఉండగా ఈ సీజన్లో ప్రవస్తి పాల్గొనింది. ఎస్పీ బాలసుబ్రమణ్యం హోస్ట్ గా ఉన్నప్పుడు గతంలో ఈ షోలో కనిపించిన ఈమె.. ఆ సమయంలో పరిస్థితులు తనకు సానుకూలంగా ఉన్నట్లు తెలిపింది. అయితే అదే ఈమె తనకు 19 సంవత్సరాలు వచ్చినప్పుడు ఇదే షోలో పాల్గొనగా తనకు చేదు అనుభవం ఎదురైందని, అన్యాయం జరిగిందని సోషల్ మీడియాలో ప్రకటించింది.
వేధింపులు – పక్షపాతమే మిగిలింది..
పాడుతా తీయగా జడ్జెస్ సునీత, ఎం ఎం కీరవాణి, చంద్రబోస్ తనపై పక్షపాతం చూపించారని ఆరోపించింది. సునీత తనను మానసికంగా వేధించిందని, పగ పెంచుకుందని, అందుకే తన ఎలిమినేషన్ కి కారణమైంది అంటూ ఆరోపించింది. శ్రావ్యమైన పాటలు పాడే పోటీదారుల పట్ల పక్షపాతం చూపించారు.. నేను పాట పాడినప్పుడు మాత్రమే నాకు నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగా ఇచ్చారు . ఇక వివాహాలలో ప్రదర్శన ఇచ్చినందుకు నన్ను కించపరిచారు. అలాంటి గాయకులను తాను ద్వేషిస్తానని చెప్పారు అంటూ కూడా ఆమె ఆరోపణలు చేసింది. చంద్రబోస్ కూడా పోటీ దారులు పాటలు పాడినప్పుడు వారి తప్పులు పట్టించుకోలేదు. కానీ తాను మాత్రమే పాట పాడినప్పుడు పక్షపాతం ప్రదర్శిస్తున్నారని కూడా ముగ్గురు జడ్జెస్ పై ఆరోపణలు చేసింది ప్రవస్తి.
బాడీ షేమింగ్ తో నలిగిపోయాను..
ప్రొడక్షన్ టీం నన్ను బాడీ షేవింగ్ చేసింది. బొడ్డు కనిపించేలా కిందికి చీరలు కట్టుకోమని విసిగించేవారు. ముఖ్యంగా నేను బరువు ఎక్కువగా…
ALSO READ:Mahesh Babu – Sitara: కూతురుతో కలిసి మహేష్ కొత్త యాడ్.. ఎంత అందంగా ఉందో కదా..?