BigTV English

Pathaan : ‘బాహుబలి 2’ని దాటేసిన ‘పఠాన్’

Pathaan : ‘బాహుబలి 2’ని దాటేసిన ‘పఠాన్’

Pathaan : ఎట్ట‌కేల‌కు బాలీవుడ్ జ‌నాలు హ‌మ్మ‌య్య అని ఊపిరి పీల్చుకున్నారు. అందుకు కార‌ణం.. ఈ మ‌ధ్య సౌత్ సినిమాలు హోరు, జోరు బాలీవుడ్‌లో ఎక్కువ‌య్యాయి. అందుకు త‌గ్గ‌ట్లు అక్క‌డి హీరోల సినిమాలు కూడా ఆక‌ట్టుకోవ‌టం లేదు. దీంతో బాలీవుడ్ హీరోలు సైలెంట్‌గా మారిపోయారు. మన ద‌క్షిణాది హీరోల‌దే హ‌వా పెరిగిపోయింది. అయితే ఇప్పుడు ఈ ఏడాది బాలీవుడ్‌కి కాస్త ఆశాజ‌న‌క‌మైన ప్రారంభం ల‌భించింద‌నే చెప్పాలి. ఎందుకంటే.. ఈ ఏడాది జ‌న‌వరి 25న విడుద‌లైన ప‌ఠాన్ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా రూ.1000 కోట్ల‌కుపైగానే వ‌సూళ్ల‌ను రాబ‌ట్ట‌కుంది.


ప‌ఠాన్ సినిమాకు అదిరిపోయే క‌లెక్ష‌న్స్ రావ‌టం ఒకటైతే.. తాజాగా ఆ సినిమా బాహుబ‌లి 2 హిందీ వెర్ష‌న్ క‌లెక్ష‌న్స్‌ను దాటేయ‌టం కొస‌మెరుపు. బాహుబ‌లి 2 మూవీ ఫుల్ ర‌న్‌లో రూ.510.99 కోట్లు వ‌సూళ్ల‌ను రాబ‌ట్టుకుంది. అప్ప‌టి వ‌ర‌కు ద‌క్షిణాది సినిమాను పెద్ద‌గా ప‌ట్టించుకోని బాలీవుడ్ వ‌ర్గాలు షాక‌య్యాయి. అక్క‌డి నుంచి సౌత్ సినిమాల‌కు ఫ్రీ పాస్ దొరికిన‌ట్ల‌య్యింది. కె.జి.య‌ఫ్‌, కాంతార చిత్రాల‌న్నీ బాలీవుడ్‌లో దుమ్ము రేపాయి. అయితే ఏవీ బాహుబ‌లి 2ను దాటలేక‌పోయాయి.

ఈ నేప‌థ్యంలో షారూఖ్ ఖాన్ హీరోగా న‌టించిన ప‌ఠాన్ మూవీ 37వ రోజుల‌కు రూ.511 గ్రాస్ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టుకుంది. దీంతో హిందీలో అత్య‌ధిక వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన మూవీగా ప‌ఠాన్ నెంబ‌ర్ వ‌న్ స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో బాహుబ‌లి 2, మూడో స్థానంలో కె.జి.య‌ఫ్ 2 చిత్రాలు నిలిచాయి. నాలుగో స్థానాన్ని దంగ‌ల్ ద‌క్కించుకుంది.


షారూఖ్ ఖాన్ హీరోగా న‌టించిన ప‌ఠాన్ సినిమాలో దీపికా ప‌దుకొనె హీరోయిన్‌. జాన్ అబ్ర‌హం విల‌న్‌గా న‌టించారు. సిద్ధార్థ్ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో య‌ష్ రాజ్ ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మించింది. స‌ల్మాన్ ఖాన్ ఇందులో గెస్ట్ అప్పియ‌రెన్స్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×