BigTV English

Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత రోల్ ఇదే.. అసలేం జరిగిందంటే..?

Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత రోల్ ఇదే.. అసలేం జరిగిందంటే..?

Kavitha: త్వరలోనే కవిత అరెస్ట్.. ఆమె తీహార్ జైలుకు వెళ్లడం ఖాయం.. బీజేపీ నేతలు పదే పదే కవ్విస్తున్నారు. కవితకు వ్యతిరేకంగా సాక్షాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇంతకీ ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత ఎదుర్కొంటున్న ఆరోపణలు ఏంటి? ఆ స్కాంలో ఆమె పాత్ర ఎంత? తదితర అంశాలపై చర్చ జరుగుతోంది. ఈడీ సమర్పించిన మొదటి చార్జిషీట్‌లో కవితకు ఈ స్కామ్‌లో ఉన్న సంబంధం గురించి ప్రస్తావించింది. ఆ చార్జిషీట్‌లో ఏముందంటే…..


“ఎక్సయిజ్ పాలసీ రూపకల్పన జరిగే సమయంలోనే సమీర్ మహేంద్రుతో అరుణ్ రామచంద్రన్ పిళ్లై ద్వారా కవిత ఫోన్‌లో మాట్లాడారు. కవిత తరఫున పిళ్లై, బోయిన్‌‌పల్లి అభిషేక్, ఆడిటర్ బుచ్చిబాబు ప్రతినిధులుగా ఉన్నారు. ఇండో స్పిరిట్స్ కంపెనీలో భాగస్వాములుగా చేరడానికి ఆసక్తిగా ఉన్నట్టు పిళ్లై ద్వారా సమీర్ మహేంద్రుకు కవిత చెప్పారు. సమీర్ మహేంద్రు హైదరాబాద్ వచ్చి కవిత నివాసంలో చర్చలు జరిపారు. ఆ సమయంలో ఆమె భర్త అనిల్, గోరంట్ల బుచ్చిబాబు, శరత్‌చంద్రారెడ్డి, పిళ్ళై, బోయిన్‌పల్లి అభిషేక్ తదితరులు ఉన్నారు.

ఢిల్లీలోని ఒబెరాయ్ మెయిడెన్ హోటల్‌లో జరిగిన మీటింగులోనూ కవితతో చర్చించి 65% మేర వాటాలకు సమీర్ అంగీకరించారు. కవితకు సన్నిహితుడైన వెన్నమనేని శ్రీనివాసరావు ఆమె ఆదేశం మేరకు పిళ్ళై నుంచి కోటి రూపాయలను ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు అప్పజెప్పారు. దాదాపు 100 కోట్ల అడ్వాన్స్.. కిక్‌బ్యాక్ రూపంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు ముట్టచెప్పినందున రీటెయిల్ దుకాణాల్లో ఎల్-1గా నిలిచిన ఇండో స్పిరిట్స్‌లో కవితకు వాటా లభించింది. ఇండో స్పిరిట్స్ కంపెనీల్లో ఎక్కడా కాగితాల మీద అధికారికంగా కవిత పేరు ఉండదు. ఆమె తరఫున పిళ్ళై ఉన్నారు.” అంటూ ఈడీ తన చార్జిషీట్‌లో తెలిపింది.


Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×