Pattudala Movie Twitter Review : కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ సినిమాల గురించి అందరికీ తెలుసు. విభిన్న కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ భారీ విజయాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. ఇక ప్రస్తుతం అయినా రెండు మూడు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు అందులో ఒకటి పట్టుదల సినిమా ఈరోజు థియేటర్లలో విడుదలైంది.. థ్రిల్లర్ గా వచ్చిన ఈ మూవీ పారి రెస్పాన్స్ మొదటి షో తోనే మంచి రెస్పాన్స్ అందుకుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. అజిత్, త్రిష కాంబినేషన్ లో లైకాప్రొడక్షన్స్ బ్యానర్ పై మగీజ్ తిరుమేని డైరెక్ట్ చేసిన సినిమా విడాముయార్చి. దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో.. భారి యాక్షన్ థ్రిల్లర్ మూవీగా ఈసినిమా తెరెక్కింది. హాలీవుడ్ రైటర్ జోనాథన్ మోస్టో బ్రేక్ డౌన్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో అజిత్ , త్రిషతో పాటుగా అర్జున్ సర్జా, రెజీనా కసండ్రా, ఆరవ్, రమ్య తదితరులు నటించారు. యాక్షన్ థ్రిల్లర్ మూవీకి మగిళ్ తిరుమేని దర్శకత్వం వహించారు. ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తుంది.. ఇక సోషల్ మీడియాలో ఫాన్స్ ఎలా రెస్పాండ్ అయ్యారో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..
గ్యాంబ్లర్ సినిమాలో అజిత్, అర్జున్ కలిసి నటించారు. ఆ ఫిల్మ్ సూపర్ హిట్. ఆ కాంబినేషన్ మళ్ళీ ఈ సినిమాలో రిపీట్ అయింది. వాళ్ళిద్దరి మధ్య ఇందులో ఒక ఫైట్ సీక్వెన్స్ థియేటర్లలో గూస్ బంప్స్ తెప్పించేలా ఉందని నెటిజనులు అంటున్నారు.. వీరిద్దరి మధ్య వచ్చే ట్రైన్ ఎపిసోడ్ సీన్స్ సినిమాకు హైలెట్గా నిలిచాయని నెటిజెన్లు అంటున్నారు. మొత్తానికి సినిమాకు యాక్షన్ ప్లస్ గా ఉందని హీరో అజిత్ పర్ఫామెన్స్ ఓ రేంజ్ లో ఉందని ట్విట్టర్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి.
#VidaaMuyarchi Movie Review ✨
2nd half Super 👍🏼 Ajith vs Ajrun Train Fight Scene Vera Level👌🏼💥 #MagizhThirumeni Direction Super 👌🏼 Intha Padathula Innoru Surprise Irukku Antha Scene lam Theatre la Blast’uh than 🤯🔥 Climax Scene Ok than 👍🏼
My Ratings 3/5#Ajith #GoodBadUgly pic.twitter.com/IjCHpgrCdH
— 🫶🏼😍 ֆǟɦɛɛʄ 모하메드 🇰🇷 (@mhdsaheef22) February 5, 2025
ఈ సినిమాలో లవ్ స్టోరీ చాలా బాగుంది అజిత్ ఇలాంటి యాంగిల్ లో నటించడం చాలా బాగుంది అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ఇంటర్వెల్ వరకు ఒకలా ఉంటే ఆ తరువాత మరోలా ఉంటుందని తమిళనాడు ఆడియన్ ఒకరు పేర్కొన్నారు.. యాక్షన్ సీక్వెల్ గా వచ్చిన ఈ మూవీ అజిత్ ఆడియన్స్ తో పాటు యావత్ సినీ ప్రేక్షకులను అలరిస్తుందని కామెంట్స్ చేస్తున్నారు..
Insider #VidaaMuyarchi Review Buzz
First Half – Semma Love 💕 💕 💕
Second Half – Theri Action 🔥🔥🔥Massy AK Meets Classy AK 🎺🤞
Treat for Universal Crowds Not just AK fans.#VidaamuyarchiFDFS #VidaaMuyarchiReview pic.twitter.com/wTWhYbLeW7
— Star Talkies (@startalkies_ofl) February 5, 2025
ఈ మూవీకి హీరో హీరోయిన్ల కన్నా అనిరుద్ మ్యూజిక్ హైలెట్ అయిందని తన ప్రాణం పెట్టి చేశారని కామెంట్ చేశారు. ప్రతి సన్నివేశానికి థియేటర్లలో ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చేలాగా రీ రికార్డింగ్ చేశారని చెబుతున్నారు. ఇదొక సరికొత్త సినిమా అని అంటున్నారు. తమిళనాడులో సినిమాకు బ్లాక్ బస్టర్ ఓపెనింగ్ లభిస్తోంది. సినిమాలో చాలా డైలాగులు రష్యన్, అజర్ బైజానీ భాషలో ఉండడంతో తమిళనాడులోని థియేటర్లలోనూ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ వేస్తున్నారని ఒక నెటిజన్ కామెంట్ చేస్తున్నాడు. మొత్తానికి అయితే మంచి రెస్పాన్స్ వచ్చిందని తెలుస్తుంది.
#Vidaamuyarchi will be playing with English subtitles in most screens; as many dialogues in the film are in the Azerbaijani/Russian language.💥🍿 pic.twitter.com/ESlVFsUI2D
— Christopher Kanagaraj (@Chrissuccess) February 5, 2025
ప్రస్తుతానికి అయితే పాజిటివ్ టాక్ వినిపిస్తుంది ఇక కలెక్షన్స్ ఏ మాత్రం వసూలు చేస్తుందో తెలియాలంటే ఈరోజు సాయంత్రం వరకు వెయిట్ చేయాల్సిందే…