Ind vs Eng 1st ODI: టీమిండియా ( Team India ) వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య… ఇవాల్టి నుంచి మొదటి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఐదు టి20 సిరీస్ ను టీమిండియా కైవసం చేసుకొని.. ఇప్పుడు.. వన్డే సిరీస్ కోసం రంగం సిద్ధం చేసుకుంది. టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య 3 వన్డేలు జరగనున్నాయి. ఇందులో భాగంగానే ఇవాళ నాగపూర్ పట్టణంలోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో… టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మొదటి వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కు అన్ని ఏర్పాట్లు ఇప్పటికే జరిగాయి. ఈ మ్యాచ్… ఇవాళ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఇక ఈ మ్యాచ్ కు సంబంధించిన టాస్ ప్రక్రియ… మధ్యాహ్నం ఒకటి గంటలకు ఉండనుంది. మొదటి టాస్ నెగ్గిన జట్టు బ్యాటింగ్ తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఇక ఇప్పటి వరకు వన్డేల్లో భారత్ వర్సెస్ ఇంగ్లండ్ హోరాహోరీగా తలపడ్డాయి. ఇప్పటి వరకు ఈ రెండు జట్ల మధ్య జరిగిన వన్డేలలో… భారత్ గెలిచింది 58 కాగా.. ఇంగ్లండ్ గెలిచింది 44గా ఉంది. ఫలితం రానివి 3 మ్యాచ్‌లు కాగా…డ్రాగా 2 మ్యాచ్ లు ముగిసాయి. అయితే ఇవాళ జరిగే వన్డే మ్యాచ్ లో వికెట్ కీపర్ గా ఎవరు బరిలోకి దిగుతారనేది… ఆసక్తిగా మారింది. ఎందుకంటే కెఎల్ రాహుల్, రిషబ్ పంత్.. ఇద్దరు కూడా టీమ్ ఇండియా స్క్వార్డులో ఉన్నారు. ఇద్దరిలో తుది జట్టులో ఎవరికి ఛాన్స్ వస్తుందో అనే ఉత్కంఠత అందరిలోనూ నెలకొంది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. కె ఎల్ రాహుల్ ను ఈ మ్యాచ్ కు పక్కకు పెట్టి… రిషబ్ పంత్ ను ఆడించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఇవాళ్టి మ్యాచ్ లో మహమ్మద్ షమీ కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
Also Read: Abhishek Sharma: హే హే కొట్టు..టీమిండియాలో మరో సెహ్వాగ్.. ఇక టెస్టుల్లోకి ఎంట్రీ ?
LIVE మ్యాచ్ లు ఎక్కడ చూడాలి…!
మన భారతదేశంలో IND vs ENG 1వ ODI మ్యాచ్ ను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. స్టార్ స్పోర్ట్స్ 1 హెచ్‌డి/ఎస్‌డి ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ మ్యాచ్‌ని ఇంగ్లీష్ కామెంటరీతో ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. అయితే స్టార్ స్పోర్ట్స్ 1 హిందీ హెచ్‌డి/ఎస్‌డి హిందీ కామెంట్రీలో ఉంటుంది. అలాగే…భారత్ vs ఇంగ్లాండ్ 1వ ODI మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో కూడా రానుంది. అలాగే… వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది.
IND VS ENG 1వ ODI – అంచనా జట్లు
భారత్ అంచనా వేసిన XI: రోహిత్ శర్మ (సి), శుభ్‌మన్ గిల్ (విసి), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్/రిషబ్ పంత్ (వికెట్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ.
ఇంగ్లండ్ ప్లేయింగ్ XI: బెన్ డకెట్, ఫిలిప్ సాల్ట్ (WK), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (c), లియామ్ లివింగ్‌స్టోన్, జాకబ్ బెథెల్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్.