Pavala Shyamala: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న వారిలో సీనియర్ నటి పావలా శ్యామల(Pavala Shyamala) ఒకరు. ఈమె ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఎన్నో వేదికలపై నాటకాలు వేస్తూ గుర్తింపు పొందిన శ్యామల పరిస్థితి ఎంతో దీనంగా ఉందని చెప్పాలి. ప్రస్తుతం వయసు పై పడటంతో ఎవరు అండగా లేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న శ్యామల ఒక అనాధాశ్రమంలో జీవనం గడుపుతున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తన ఆర్థిక ఇబ్బందుల గురించి ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఈ సందర్భంగా శ్యామల మాట్లాడుతూ నేను నాటకాలు వేసే సమయం నుంచి నా సినీ కెరియర్ ముగిసే వరకు ఎప్పుడు కూడా ఒక మేనేజర్ ని కూడా పెట్టుకోలేదు. నాకు సంబంధించిన అన్ని విషయాలను నేనే చూసుకునే దాన్ని. నేను ఇండస్ట్రీలో కొనసాగే సమయంలో ఒకరితో కూడా ఒక మాట పడకుండా చాలా గౌరవంగా బ్రతికాను. అయితే నటిగా కొనసాగుతున్న సమయంలో వచ్చిన డబ్బు మొత్తం తన కుమార్తె అనారోగ్య సమస్యలకు చికిత్స చేయించడానికి ఖర్చు చేశాను. ప్రస్తుతం వయసు పైబడింది నేను సినిమాలలో నటించే పరిస్థితి కూడా లేదు. సంపాదించిన డబ్బు మొత్తం వైద్యం కోసమే ఖర్చు చేశాము.
ప్రస్తుతం నేను నా కూతురు ఒక అనాధల లాగా ఇక్కడ బ్రతుకుతున్నామని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక నా ఈ పరిస్థితి చూసి చాలామంది హీరోలు సహాయం చేశారు. చిరంజీవి కూడా నాకు లక్షల్లో సహాయం చేసి ఆదుకున్నారు. ఇక దిల్ రాజు గారు రాజమండ్రిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు నటుడు రాజా రవీంద్ర నా పరిస్థితి గురించి వివరించడంతో ఆయన నాకు స్వయంగా ఫోన్ చేసి మీరేమీ బాధపడకండి ప్రతినెలా మీకు నేను 15000 పంపిస్తాము మా మేనేజర్ మీతో మాట్లాడతారని చెప్పారు. ఇప్పటివరకు దిల్ రాజు గారి నుంచి నాకు ఎలాంటి సహాయం అందలేదని తెలిపారు.
ఇక కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నాకు పదివేల రూపాయల పెన్షన్ వస్తుందని ఇప్పుడు ఆ పెన్షన్ తోనే బ్రతుకుతున్నామని తెలిపారు. సహాయం కోసం తాను ప్రభాస్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలను కలవడం కోసం వెళితే వారి ఇంటి ముందు వాచ్ మెన్ లు నన్ను ఆ దరిదాపులలోకి కూడా రానివ్వకుండా తరిమేసేవారు. ఇక నాకు సహాయం చేయని వారు కూడా సహాయం చేశామంటూ బయటకు చెబుతున్నారు. ఇక నటి కరాటే కళ్యాణి గతంలో నాకు హెల్ప్ చేశారు అయితే ఆమె నాకు కొన్ని పెద్ద పెద్ద వస్తువులను తీసుకువచ్చి ఇచ్చారు. నాకు అవి ఎలా వాడాలో కూడా తెలియదు. నాకు ఈ వస్తువులు అవసరం లేదని చెబితే ఆమె తప్పుగా అర్థం చేసుకుని నా గురించి చెడుగా ప్రచారాలు మొదలుపెట్టింది. నాకు ఏదైనా అయితే నా కూతురు ఒంటరిగా మిగిలిపోతుందని, ఇలాంటి బాధలు పడే కంటే నేను నా కూతురు చనిపోతే బాగుండు అంటూ ఎమోషనల్ అయ్యారు.