BigTV English

Bangladesh Iskcon: బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ పై అతివాద ముద్ర.. నిషేధం విధించాలని డిమాండ్

Bangladesh Iskcon: బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ పై అతివాద ముద్ర.. నిషేధం విధించాలని డిమాండ్

Bangladesh Iskcon| బంగ్లాదేశ్ లో ప్రధాన మంత్రి షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయినా అక్కడ హింస కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా హిందువులు, క్రిస్టియను, ఇతర మైనారిటీలతో పాటు షేక్ హసీనా పార్టీ నాయకులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ దాడులు చేస్తున్న విద్యార్థి సంఘం ఇప్పుడు హిందూ మత ప్రచార సంస్థ ఇస్కాన్ ని Iskcon (International Society for Krishna Consciousness) టార్గెట్ చేస్తోంది. బంగ్లాదేశ్ ఒక అతివాద సంస్థ అని ముద్ర వేసి దేశంలోని ఈ సంస్థపై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తోంది.


ఇటీవలే దేశవ్యాప్తంగా హిందువలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా నిరసనలు చేసిన ఇస్కాన్ గురువు చిన్మోయి కృష్ట దాస్ బ్రహ్మచారిని అరెస్ట్ చేశారు. దీంతో పాటు ఇస్కాన్ సంస్థపై దేశవ్యాప్తంగా బ్యాన్ విధించాలని కోరుతూ బంగ్లాదేశ్ హై కోర్టులో ప్రభుత్వం రిట్ పిటీషన్ దాఖలు చేసింది. ఇస్కాన్ తరపున కేసు వాదించే లాయర్ హత్యకు గురయ్యాడు. లాయర్ హత్య కేసులో 10 లాయర్లకు, హోం మంత్రిత్వ శాఖకు, పోలీస్ విభాగానికి కోర్టు నోటీసులు అందాయి.

Also Read: ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ.. మూడు కారణాలు చెప్పిన నెతన్యాహు


‘ఇస్కాన్ పై నిషేధం విధించాల్సిందే’
స్థానిక మీడియా రిపోర్ట్ ప్రకారం.. నిరసనలు చేస్తున్న విద్యార్థుల సంఘం నాయకుడు హసనత్ అబ్దుల్లా మాట్లాడుతూ.. “ఇస్కాన్ ఒక ఉగ్రవాద, ఒక అతివాద సంస్థ. దీనిపై బ్యాన్ విధించాలని మా డిమాండ్. మా దేశంలో అన్ని మతాల ప్రజలు ఐకమత్యంగా నివసిస్తున్నారు. అందరి హక్కులు కాపాడడానికి మేము పోరాటం చేస్తున్నాం. కానీ మతం పేరుతో అతివాద కార్యాలు చేపడితే అలాంటి వారికి బంగ్లాదేశ్ లో ఒక ఇంచు భూమి కూడా లభించదు. లాయర్ సైఫుల్లాని దారుణంగా హత్య చేశారు. ఇది ఇస్కాన్ పనే. ఈ ఉగ్రవాద సంస్థను బ్యాన్ చేయాల్సిందే.

బంగ్లాదేశ్ లో ఉద్రిక్త పరిస్థితులు
ఇస్కాన్ దేవాలయానికి చెందిన మత గురువు చిన్మోయ్ కృష్ణ దాస్‌ని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపిన తరువాత చట్ గావ్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఇస్కాన్ తరపున వాదించే లాయర్ సైఫుల్లా ఇస్లామ్ హత్య చేయబడ్డాడు. చిన్మోయ్ కృష్ణ దాస్‌ని జైలులో పెట్టడంపై భారత దేశంలో రాజకీయ నాయకులు విమర్శిస్తున్నారు.

దేవాలయానికి తాళాలు
బంగ్లాదేశ్ లోని షిబ్చర్ ప్రాంతంలో ఉన్న ఇస్కాన్ కేంద్రాన్ని బలవంతంగా తాళాలు వేశారు. మత గురువు చిన్మోయ్ కృష్ణ దాస్‌ అరెస్ట తరువతనే ఈ ఘటన జరగడం గమనార్హం. ఇస్కాన్ కార్యకర్తలను సైనికులు ఒక వ్యానులో తీసుకొని వెళ్లారని కోల్ కతా ఇస్కాన్ వైస్ ప్రెసిడెంట్, ప్రతినిధి రాధారమన్ దాస్ తెలిపారు.

ఇస్కాన్ పై నిషేధం కుదరదు: హై కోర్టు
ఇస్కాన్ సంస్థపై నిషేధం విధించాలని దాఖలైన పిటీషన్ ని బంగ్లాదేశ్ హైకోర్టు తిరస్కరించింది. ప్రస్తుతం దేశంలో ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని.. ఇస్కాన్ దేవాలయ ఆస్తులు, భక్తుల ప్రాణాలు కాపాడే బాధ్యత ప్రభుత్వంపై ఉందని సూచించింది.

Related News

Britain – China: అమెరికా వెళ్లాలంటే లక్ష డాలర్లు.. బ్రిటన్, చైనా కి మాత్రం ఫ్రీ ఫ్రీ ఫ్రీ

Pakistan Military: సొంత ప్రజలపైనే బాంబుల వర్షం కురిపించిన పాక్ జెట్స్.. 30 మందికి పైగా దుర్మరణం

US on H 1B Visa: హెచ్‌-1బీ వీసా రుసుంపై వైట్‌హౌస్‌ క్లారిటీ.. వారికి మాత్రమే, ఇక భయం లేదు

H-1B Visas: హెచ్-1బీ వీసాల ఫీజు పెంపు.. భారత టెక్ కంపెనీల పరిస్థితి ఏమిటి? ఆ సమస్య తప్పదా?

Cyber ​​Attack: యూరప్ ఎయిర్‌పోర్టులపై సైబర్ అటాక్.. వేలాది మంది ప్రయాణికులపై ఎఫెక్ట్

US Flights Cancelled: అమెరికాలో నిలిచిపోయిన వందలాది విమానాలు.. కారణం ఇదే!

H-1B Visa: రూ. 88 లక్షలు చెల్లిస్తేనే H-1B వీసా.. ట్రంప్ నుంచి మరో షాకింగ్ నిర్ణయం

Trump H-1B Visa Policy: ట్రంప్ సంచలన నిర్ణయం.. H1B వీసాలకు లక్ష డాలర్ల ఫీజు.. ఇండియ‌న్స్‌కి జాబ్స్ క‌ష్ట‌మే!!

Big Stories

×