BigTV English

Pawan Kalyan: అన్నయ్యకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ బర్త్‌డే విసెష్‌

Pawan Kalyan: అన్నయ్యకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ బర్త్‌డే విసెష్‌

Pawan Kalyan Birthday Wishes to Chiranjeevi: తెలుగు సినీ ఇండస్ట్రీకి కొత్త నడక నేర్పిన ఎవరు అన్న ప్రశ్న తలెత్తుతే ఎవరైనా ఏమాత్రం తడుముకుకోకుండా చెప్పే పేరు మెగాస్టార్. ఆయన డైలాగ్ డెలివరీ ట్రెండ్ సెట్ చేసిన డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్.. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే చిరంజీవి ఇంట్రాడ్యూస్ చేసిన స్టెప్స్ తెలుగు ఇండస్ట్రీలో నూతన అధ్యాయనాన్ని లిఖించాయి. ఆరు పదుల వయసులోను కుర్రకారుకు సైతం జోష్ తెప్పించే ఎనర్జీ లెవల్స్ ఉన్న అరుదైన స్టార్ ఆయన. నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్బంగా చిరు ఫాన్స్ అందరూ మెగా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఆయన అభిమానులు, ప్రముఖులు పలువురు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఇక చిరు ఫాన్స్ అయితే తెలుగు రాష్ట్రాల్లో పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.


తన దృష్టిలో ఆపద్బాంధవుడంటే చిరంజీవే అని.. ఆపత్కాలంలో ఉన్న ఎందరికో ఆయన సహాయం చేయడం తెలుసన్నారు. అనారోగ్యం బారినపడినవారికి ప్రాణదానం చేసిన సందర్భాలు అనేకమున్నాయన్నారు. కొందరికి చేసిన సాయం మీడియా ద్వారా బాహ్య ప్రపంచానికి తెలిస్తే.. మరెన్నో సహాయాలు గుప్తంగా మిగిలిపోయాయని అన్నారు. కావలసిన వారి కోసం ఆయన ఎంతకైనా తగ్గుతారు, అభ్యర్థిస్తారని.. ఆ గుణమే సుగుణ సంపన్నునిగా చేసిందన్నారు. అటువంటి గొప్ప దాతను అన్నగా ఇచ్చినందుకు ఆ భగవంతునికి సదా కృతజ్ఞుడినని అన్నారు. తల్లి లాంటి వదినమ్మతో ఆయన చిరాయుష్షుతో ఆరోగ్యవంతంగా జీవించాలని ఆ దేవదేవుణ్ని మనసారా కోరుకుంటున్నట్లు పవన్‌ ఆకాంక్షించారు.

ఇక మెగాస్టార్‌ చిరంజీవి బర్త్‌డే అంటే.. ఫ్యాన్స్‌కు పండగే. ఆయన్నొ ఆరాధ్య దైవంగా చూసేవాళ్లు చాలా మందే ఉన్నారు. ఈ బిగ్‌బాస్‌ చూడని రివార్డులు, అవార్డులు, స్టార్‌ ఇమేజ్‌.. మరొకరికి లేవంటే అతిశయోక్తి కాదేమో. ఆయన సినిమా రిలీజ్‌ అంటే.. థియేటర్లు ఫుల్‌ అవ్వాల్సిందే. నిర్మాతలకు కలెక్షన్ల వర్షమే. ఇక నేడు చిరంజీవి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ నిన్నటినుంచే మొదలైపోయాయి. ఇక అన్నయ్య బర్త్‌డే సందర్భంగా ఇంద్ర మూవీ రిరీలిజ్‌ చేశారు. రిరీలిజ్‌కు కూడా అదే క్రేజ్‌ కనిపిస్తోంది. ఫ్యాన్స్‌ అయితే మరోసారి చొక్కాలు చింపేసుకోవడానికి రెడీ అయిపోయారు. థియేటర్లు సైతం ఫుల్‌ అయిపోయాయి. మార్నింగ్‌ షో నుంచే థియేటర్లు కళకళలాడిపోతున్నాయి. ఆయన సినిమా రిరిలీజ్‌తో హంగామా మామూలుగా లేదు. డప్పుచప్పుళ్లు, బాణాసంచా, పెద్దపెద్దపోస్టర్లతో.. హల్‌చల్‌ చేస్తున్నారు.


Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×