BigTV English

Tamil Nadu Actor Vijay: ప్రముఖ హీరో కీలక ప్రకటన.. పార్టీ జెండా ఆవిష్కరణ

Tamil Nadu Actor Vijay: ప్రముఖ హీరో కీలక ప్రకటన.. పార్టీ జెండా ఆవిష్కరణ

TVK chief Vijay released the party’s flag(Today’s news in telugu): తమిళ్ స్టార్ హీరో విజయ్ కీలక ప్రకటన చేశారు. రాజకీయ అరంగేట్రం చేసిన విజయ్.. తన పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ జెండా, గుర్తును రిలీజ్ చేశారు. చెన్నైలోని పనయూర్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో  ‘తమిళగ వెట్రి కళగం’ పార్టీ జెండాను ఆవిష్కరించారు. కాగా, ఇటీవల విజయ్.. ‘తమిళగ వెట్రి కళగం’ పార్టీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి విజయ్ తల్లిదండ్రులతోపాటు మద్దతుదారులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


పనయూర్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఉదయం 9 గంటలకు పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. పార్టీ జెండాను పరిశీలిస్తే..ఎరుపు, పసుపు రంగు, రెండు ఏనుగులతో జెండా ఉంది. అనంతరం పార్టీ సిద్ధాంతాలను ప్రకటించారు. కులం, మతం, ప్రాంతం, లింగ భేదాలు లేకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించడం తమ పార్టీ లక్ష్యమని విజయ్ తెలిపారు.

2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ చేసిన విజయ్..ఈ మేరకు వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి 300 మంది పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. అయితే 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ఆయన సిద్ధమవుతున్నారు.


Also Read: జార్ఖండ్‌లో కొత్త పార్టీ.. మాజీ సీఎం చంపయీ సోరెన్.. ఎవరికి అడ్వాంటేజ్

ఇదిలా ఉండగా, విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గోట్(ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) వస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ సెప్టెంబర్ 5న విడుదల కానుంది. ఈ సినిమాలో విజయ్..తండ్రీకొడుకులుగా డబుల్ యాక్షన్ చేసినట్లు సమాచారం. ఇందులో మీనాక్షీ చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా.. స్నేహ, లైలా, ప్రశాంత్, ప్రభుదేవా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఏజీఎస్ ఎంటర్‌టైన్ మెంట్ పతాకంపై నిర్మించిన ఈ మూవీ..తెలుగు, తమిళం, హిందీతోపాటు పలు భారతీయ భాషల్లో విడుదల కానుంది.

Related News

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

Big Stories

×