BigTV English

Pawan Kalyan: విజయ్ పొలిటికల్ జర్నీ.. పవన్ కీలక వ్యాఖ్యలు

Pawan Kalyan: విజయ్ పొలిటికల్ జర్నీ.. పవన్ కీలక వ్యాఖ్యలు

Pawan Kalyan: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో డైరెక్ట్ గా  సినిమాలు చేయకపోయినా కూడా డబ్బింగ్ సినిమాలతో విజయ్ తెలుగువారికి కూడా సుపరిచితుడుగా మారాడు. ఆయన నటించిన ప్రతి సినిమా తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది. ఈ ఏడాది గోట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయాడు.


ఇక గతేడాది నుంచే విజయ్..పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. ఇక ఈ ఏడాది  ఆయనే స్వయంగా రాజకీయ రంగప్రవేశం చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. తమిళగ వెట్రి కళగం అనే పేరుతో పార్టీని స్థాపించాడు. నిన్ననే ఈ పార్టీ తొలి మహానాడు ను నిర్వహించారు. ఈ వేదికపై  విజయ్ మాట్లాడిన తీరు అటు తమిళ తంబీలనే కాదు.. తెలుగువారిని కూడా ఆశ్చర్యపోయారు.

Bigg Boss 8 Day 57 Promo 2: విష్ణు ప్రేమే అందరికీ అడ్డంకి.. నామినేషన్స్ లో అసలైన గొడవ.!


” నా సినిమా కెరియర్ పీక్ లో ఉంది. అలానే నా రెమ్యూనరేషన్ కూడా అంతే స్థాయిలో ఉంది. వాటన్నిటిని వదులుకొని మిమ్మల్ని నమ్ముకొని మీకోసమే, మీ విజయ్ గా వచ్చాను. ముఖానికి రంగులు వేసుకొనేవాళ్ళు రాజకీయాల్లో ఏం చేస్తారు అని అంటున్నారు. అటు ఆంధ్రప్రదేశ్ లో.. ఇటు తమిళనాడులో ఎన్టీఆర్, ఎంజీఆర్ రాజకీయాల్లో తమ సత్తా చూపించలేదా.. ? వారు తన సినిమా కెరీర్ పీక్ లో ఉండగానే.. రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. రాజకీయం కోసం.. సినిమాలు వదిలేసి.. ప్రజలకు సేవ చేశారు. ద్రవిడ, తమిళ జాతీయవాద  సిద్ధాంతాలను నేను అనుసరిస్తాను. తమిళనాడుకు ఇవి రెండు కళ్లు లాంటివి. వాటిని మేము పాటిస్తాం” అని చెప్పుకొచ్చాడు.

మొదటి మహానాడులోనే విజయ్ మాట్లాడిన తీరు అందరిని ఆకట్టుకుంటుంది. విజయ్ మాట్లాడిన మాటతీరుకు ఫ్యాన్స్ మాత్రమే కాదు రాజకీయ నేతలు కూడా ఆశ్చర్యానికి గురి అవుతున్నారు. ఇక తాజగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. విజయ్ రాజకీయ ఎంట్రీపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. విజయ్ పొలిటికల్ ఎంట్రీపై ఆయన అభినందనలు తెలుపుతూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ”   ఎంతోమంది సాధువులు, సిద్దులు కొలువై  ఉన్న  తమిళనాడులో మీ రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన నటుడు విజయ్  కు నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను” అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం  ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

Sai Pallavi: సాయి పల్లవిని వెలివేస్తున్న ప్రేక్షకులు, ట్విటర్‌లో ట్రెండింగ్.. ఇంతకీ ఏం జరిగిందంటే?

ఇక మొదటి నుంచి పవన్ ను విజయ్ అనుసరిస్తున్నాడని వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. పవన్ కూడా కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే ప్రజలకు సేవ చేయాలనీ సినిమాలను, కుటుంబాన్ని వదిలేసి రాజకీయాల్లోకి వచ్చారు. పదేళ్లు ఎన్నో కష్టాలు, అవమానాలు భరించి ఎట్టకేలకు ఈ ఏడాది  ఎన్నికల్లో గెలిచి ఏపీ డిప్యూటీ సీఎంగా మారారు. ఇప్పుడు విజయ్ కూడా అదే పని చేస్తున్నాడు. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే  సినిమాలకు స్వస్తి చెప్పి,  ఒక రాజకీయ పార్టీని స్థాపించి.. తమిళనాడులో పోటీకి దిగడానికి రెడీ అవుతున్నాడు. మరి పవన్ లా విజయ్ ఎన్నేళ్లకు తమిళనాడుకు ముఖ్యమంత్రిగా మారతాడో చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×