Pawan Kalyan OG : పవన్ కళ్యాణ్‌కు ఓ తలనొప్పి కమిట్మెంట్ ఇచ్చిన సినిమాలను పూర్తి చేయడం. ఎంతో కష్టపడి… హరి హర వీరమల్లు అయితే కంప్లీట్ చేశాడు. అది జస్ట్ రెండు రోజుల షూటింగ్. కాబట్టి పెద్దగా ఇబ్బందేం పడలేదు. సింపుల్‌గా పూర్తి చేసి పక్కన పెట్టేశాడు. ఇప్పుడు ఓజీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఓజీ మూవీకి ఉన్న పరిస్థితి వేరు. హరి హర వీరమల్లుకు ఉన్న పరిస్థితి వేరు. ఇక్కడ ఏదో రెండు రోజులు వచ్చి మమా అని అంటే సరిపోదు. మరి ఓజీ పవన్ కళ్యాణ్ ఎన్ని రోజులు ఇవ్వాలి..? ప్రస్తుతం పవన్ పరిస్థితి ఏంటి..? ఓజీ పరిస్థితి ఏంటి అనేది ? ఇప్పుడు చూద్దాం…
దాదాపు 5 ఏళ్ల పాటు చేసిన హరి హర వీరమల్లు షూట్ మొత్తానికి పూర్తి చేశాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఆయన ఫోకస్ ఓజీపైన ఉంది. ఎలాగైనా వీరమల్లు, ఓజీ సినిమాలను ఈ 2025లోనే రిలీజ్ చేయాలని పవన్ కాస్త గట్టిగానే అనుకున్నాడు. అందుకే చాలా రోజుల తర్వాత పవన్ కెమెరా ముందుకు వచ్చాడు.
ఓజీకి ఎన్ని రోజులు…
హరి హర వీరమల్లు అయితే 2 రోజుల్లో పూర్తి అయింది. అయితే ఓజీ మూవీకి అలాంటి పరిస్థితి లేదు. పవన్ పూర్తి చేయాల్సిన పార్ట్ ఇంకా చాలా ఉంది. ఇంచు మించుగా… పవన్ రెగ్యూలర్ గా 30 రోజుల వరకు కాల్ షీట్స్ ఇస్తే… ఓజీ పూర్తి అవుతుందట. కానీ, పవన్ ఇప్పుడు సాధారణమైన వ్యక్తి కాదు. ఓ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి. అలాగే పలు కీలక మంత్రి పదవులు ఆయన దగ్గర ఉన్నాయి.
అలాంటి హోదాలో ఉండి.. 30 రోజుల పాటు ఓ సినిమాకు కేటాయించడం అనేది రాష్ట్ర రాజకీయాల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే పవన్ ఏం చేసినా… ప్రతిపక్ష పార్టీ నుంచి కౌంటర్స్, నెటిజన్ల నుంచి ట్రోల్స్ వస్తున్నాయి.
ఇప్పటికే లోకేషన్స్ మార్చారు…
ఓజీ మూవీ అనేది చాలా పెద్ద స్టోరీ. మంచి స్కోప్ ఉన్న కథ. గ్యాంగ్ స్టార్ నేపథ్యంలో ఉన్న మూవీ. హిట్ అవ్వడానికి, భారీ కలెక్షన్లు రావడానికి డైరెక్టర్ కు మంచి పేరు రావడానికి… కావాల్సిన అన్నీ ఉన్న మూవీ.
కానీ, పవన్ కళ్యాణ్ వల్ల ఆ మూవీ షేప్ మారిపోతుంది అనే మాటలు ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. నిజానికి మూవీలో చాలా వరకు విదేశాల్లో షూట్ చేయాల్సి ఉంటుందట. ముఖ్యంగా… థాయ్‌లాండ్ లో పవన్ తో కొన్ని సీన్స్ చేయాల్సి ఉందట. కానీ, డిప్యూటీ సీఎం కు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వల్ల థాయ్‌లాండ్ కి వెళ్లడం అయ్యే పని కాదు.
కాబట్టి.. థాయ్ లాండ్ సెట్ ను ఆంధ్ర ప్రదేశ్‌ల్ లోని తాడేపల్లిగూడెంలో వేశారట. అక్కడ అయితే.. ఇటు రాష్ట్ర ప్రభుత్వ పనులు చేయొచ్చు. ఖాళీ టైంలో షూటింగ్ లో పాల్గొనవచ్చు అని అనుకున్నారట.
ఇలా… పవన్ కళ్యాణ్ వల్ల ఓజీ సినిమాలో చాలా మార్పులు జరుగుతున్నాయి. మరి ఈ 30 రోజులు అయినా.. సరిగ్గా టైం కేటాయించి మూవీని పూర్తి చేస్తారా..? లేక అందులోనూ… కట్స్ చెప్పి మార్పులు చేస్తారా..? అనే డౌట్స్ చాలా మందికి ఉన్నాయి.