Big Stories

Pawan Kalyan on Akira & Adya: అకీరా, ఆద్యలకు నేను ఇచ్చిన ఆస్తి అదే: ఓపెన్ అయిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan Got Emotional on Akira Nandan and Aadhya: జనసేనాని పవన్ కళ్యాణ్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు హీరోగా ఎంత ఫేమస్ అయ్యాడో.. ఇప్పుడు జనసేనానిగా అంతే పేరు తెచ్చుకున్నాడు. గెలిచాడా ఓడిపోయాడా.. ? అన్నది పక్కన పెడితే అభిమానుల దృష్టిలో పవన్ ఎప్పుడు ప్రత్యేకమే. ఇక ఒక హీరోగా ఇప్పటివరకు ఎన్నో ఇంటర్వ్యూలు ఇవ్వడం చూశాం. ఇప్పుడు ఒక పొలిటీషియన్ గా ఇంటర్వ్యూలు ఇస్తూ అనేక విషయాలను పంచుకుంటున్నాడు. మొదటి నుంచి కూడా అభిమానుల్లో ఉన్న అనుమానానికి పవన్ ఎట్టకేలకు సమాధానం చెప్పాడు.

- Advertisement -

పవన్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఆయనకు నలుగురు సంతానం. రేణు దేశాయ్ కు ఇద్దరు పిల్లలు.. అకీరా, ఆద్య. అకీరానే పవన్ కు నట వారసుడు. ఇప్పుడు తల్లి దగ్గర పెరుగుతున్న ఈ చిన్నారులకు పవన్ ఎంత ఆస్తి ఇచ్చాడు.. ? సినిమాల్లో వచ్చిన డబ్బులు తీసుకెళ్లి రాజకీయాల్లో పెడుతుంటే పెద్ద కొడుకుగా అకీరా ఏం అనలేదా.. ? అన్న ప్రశ్న అభిమానుల్లో ఎప్పటినుంచో మెదులుతుంది. ఇప్పుడు అదే ప్రశ్న పవన్ కు ఎదురైంది.

- Advertisement -

ఇక ఈ ప్రశ్నకు పవన్ సమాధానమిస్తూ.. ” పిల్లలకు అంత లేదు. వాళ్ళను ఒక సాధారణ ఉద్యోగి పిల్లలను ఎలా పెంచుతారో మేము అలానే పెంచాము. వాళ్లకు ఎక్స్ట్రాలు ఏం ఇవ్వలేదు కానీ ఇంకా భయపెడతాను. నేను మీకు చదువును మాత్రమే ఇవ్వగలను.. ఇంకా వీలయితే సినిమాల ద్వారా వచ్చిన డబ్బుతో ఏదైనా ప్రాపర్టీ కొని ఇవ్వగలను అని చెప్తాను. ఎప్పుడు మా మధ్య ఇలాంటి డిస్కషన్ రాదు. వాళ్లు వెళ్లిపోయే 24 గంటల ముందు నేను ఏం చేయగలనో అది చేశాను. నా భార్యకు, పిల్లలకు నా ఇల్లు రాసి ఇచ్చాను. అకీరాకు, ఆద్యకు వాళ్ళ పేరు మీద FD లు ఉంటే చదువు కోసం ఇచ్చేసాను.

Also Read: Kevvu Kartheek: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట తీవ్ర విషాదం..

ఏ తండ్రి అయినా ఏం చేయగలడు.. ఎంత ఆస్తి ఇచ్చాం అన్నది కాదు కానీ, ఎంత నిలబెట్టుకుంటున్నాం అనేది ముఖ్యం. మా నాన్న నాకేం ఇవ్వలేదు. మా అన్నను, నన్ను కూర్చోపెట్టి ఇది నీకు.. ఇది నీకు అని ఇవ్వలేదు. ఆయన నాకు ధైర్యాన్ని ఇచ్చాడు. మా అన్న నాకు స్కిల్ సెట్ నేర్పించాడు. నేను నా పిల్లలకు ధైర్యాన్ని ఇచ్చాను.. స్కిల్ సెట్ నేర్పించాను. అన్నింటికి మించి వాళ్ల కాళ్ల మీద వాళ్ళు నిలబడేలా చదువుకు పెట్టాను. ఇంకేం కావాలి” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News