BigTV English

Attack on Slovakia PM: స్లోవేకియా ప్రధానిపై కాల్పులు.. రాబర్ట్ ఫికో పొట్టలోకి దుసుకేల్లిన 4 తూటాలు!

Attack on Slovakia PM: స్లోవేకియా ప్రధానిపై కాల్పులు.. రాబర్ట్ ఫికో పొట్టలోకి దుసుకేల్లిన 4 తూటాలు!

Attack on Slovakia Prime Minister: స్లోవేకియా ప్రధాని రాబర్ట్ ఫికోపై బుధవారం మధ్యాహ్నం కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో గాయపడిన ఫికోను ఆసుపత్రికి తరలించారు. స్లోవేకియా రాజధానికి ఈశాన్యంగా 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న హ్యాండ్‌లోవా పట్టణంలోని హౌస్ ఆఫ్ కల్చర్ వెలుపల కాల్పులు జరపడంతో ఫికో పొట్టలోకి నాలుగు తూటాలు దూసెకెళ్లాయని స్లోవేకియన్ టీవీ స్టేషన్ TA3లో నివేదికలు తెలిపాయి.


ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలాన్ని సీల్ చేశారు.

పార్లమెంటు సెషన్‌లో డిప్యూటీ స్పీకర్ లుబోస్ బ్లాహా ఈ సంఘటనను ధృవీకరించారు. దీంతో అతను పార్లమెంట్‌ నిరవధికంగా వాయిదా వేశారని స్లోవాక్ TASR వార్తా సంస్థ తెలిపింది.


అటు ఈ ఘటనపై స్లోవేకియా అధ్యక్షుడు జుజానా కాపుటోవా ఖండించారు. ప్రధానిపై జరిగిన దాడిని క్రూరమైన దాడిగా అభివర్ణించారు. ఈ ఘటన గురించి తెలియగానే తాను షాక్‌కు గురైయ్యానని తెలిపారు. ఈ క్లిష్టమైన సమయంలో రాబర్ట్ ఫికోకు చాలా బలం అవసరమని ఈ దాడి నుంచి త్వరగా కోలుకోవాలని కాపుటోవా ప్రా ర్ధించారు.

Also Read: Imran khan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు బెయిల్

స్లోవేకియా ప్రధాన ప్రతిపక్ష పార్టీలు, ప్రోగ్రెసివ్ స్లోవేకియా, ఫ్రీడమ్ అండ్ సాలిడారిటీ ఈ దాడిని ఖండించారు. ఈ దాడికంటే ముందు ప్రతిపక్ష పార్టీలు ఒక నిరసనకు పిలుపునిచ్చారు. ఈ సంఘటన గురించి తెలియగానే వారు తమ నిరసనను రద్దు చేశారు.

Related News

Nepal: నేపాల్‌లో ఇది పరిస్థితి.. ఆర్థిక మంత్రిని నడిరోడ్డుపై వెంబడించి.. కొడుతూ, తన్నుతూ.. వీడియో వైరల్

Gen Z Movement: దారుణం.. నేపాల్ మాజీ ప్రధాని భార్యను తగలబెట్టేసిన నిరసనకారులు

US-Pak: పాకిస్తాన్ లో అమెరికా ఖనిజాన్వేషణ.. భారత్ కి చెక్ పెట్టేందుకేనా?

Nepal Revolt: నేపాల్‌ అధ్యక్షుడు, పీఎం ఇళ్లకు నిప్పు, హెలికాఫ్టర్ల ద్వారా నేతల తరలింపు.. ప్రధాని రాజీనామా

Nepal: సోషల్ మీడియాపై బ్యాన్ ఎత్తేసిన నేపాల్ ప్రభుత్వం.. కానీ, పోయిన ప్రాణాలు తిరిగొస్తాయా?

Sudan Gurung: నేపాల్ నిప్పుకణిక సుడాన్.. వీడు పిలుపిస్తే ప్రభుత్వానికి వణుకు, ఇంతకీ ఎవరతను?

×