BigTV English

Kevvu Kartheek Mother Died: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట తీవ్ర విషాదం.. క్యాన్సర్ తో తల్లి మృతి!

Kevvu Kartheek Mother Died: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట తీవ్ర విషాదం.. క్యాన్సర్ తో తల్లి మృతి!

Jabardasth Show Comedian Kevvu Kartheek Mother Died: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కార్తీక్ తల్లి క్యాన్సర్ తో పోరాడుతూ మృతి చెందారు. ఈ విషయాన్నీ కార్తీక్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకొని ఎమోషనల్ అయ్యాడు.


“అమ్మ గత 5సంవత్సరాల 2 నెలలు గా కాన్సర్ ఏ భయపడే విధం గా క్యాన్సర్ పై అలుపెరుగనిపోరాటం చేసావ్.. నీ జీవితమంతా యుద్ధమే.. మమ్మల్ని కన్నావు నాన్నకి తోడుగా కుటుంబాన్ని కష్టపరిస్థితుల్లో కూడా కంటికి రెప్పలా కాపాడావు.. అమ్మ ఈ 5 సంవత్సరాలనుండి ఎలా ఒంటరిగా పోరాడాలి అని నేర్పావు నీ ఆత్మస్తైర్యం నాలో ధైర్యాన్ని నింపింది.. అన్ని నేర్పావు కానీ నువ్వు లేకుండా ఎలా బ్రతకాలో నేర్పలేదు ఎందుకు అమ్మ.. మా అమ్మ కోసం ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు.. మా అమ్మ కి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్స్ అందరికి నా పాదాభివందనం” అంటూ అమ్మ ఫోటోను షేర్ చేశాడు.


ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక కార్తీక్ తన అమ్మ కోసం ఎంత కష్టపడ్డాడో వారి దగ్గర సన్నిహితులు కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు. కార్తీక్ వాళ్ళ అమ్మ కోసం చాలా కష్టపడ్డాడు, ట్రీట్ మెంట్ కోసం చాల ఖర్చు పెట్టాడు అమ్మ మీద ఎనలేని ప్రేమ చూపేవాడు.. అని కార్తీక్ ఫ్రెండ్స్ చెప్పుకొచ్చారు. అమ్మ ట్రీట్మెంట్‌కు చాలా ఖర్చు చేశాడని లేదంటే అందరిలా కార్తీక్ ఆస్తులు కూడబెట్టుకునేవాడని అంటున్నారు సన్నిహితులు.

Also Read: Pooja Hegde joins Surya film: హిట్ కోసం బుట్ట‌బొమ్మ, ఈసారైనా కలిసొచ్చేనా?

నీ పెళ్ళి చూసింది, నీ సక్సెస్ నీ చూసింది అమ్మ.. ఉన్నన్ని రోజులు నీ ప్రేమను చూసి మురిసిపోయింది, నువ్వు ధైర్యంగా ఉండు కార్తీక్ డార్లింగ్ అమ్మ మళ్ళీ పుడుతుంది, నీ ఇంట్లోనే.. నిన్ను ఆనందపరచటానికి, అమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని అని కోరుకుంటున్నాం” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. జబర్దస్త్ ద్వారా కమెడియన్‌గా పరిచయమైన కెవ్వు కార్తీక్ ప్రస్తుతం సినిమాల్లో కూడా నటిస్తూ బిజీగా మారాడు. కార్తీక్ తల్లి మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Related News

The Big Folk Night 2025 : ఎల్బీ స్టేడియంలో జానపదాల ఝల్లు.. ‘బిగ్ టీవీ’ ఆధ్వర్యంలో లైవ్ ఫోక్ మ్యూజికల్ నైట్ నేడే!

Social Look: నీటి చినుకుల్లో తడిచి ముద్దయిన దీప్తి.. రాయల్ లుక్‌లో కావ్య.. బికినీలో ప్రగ్యా!

Jr NTR controversy: జూనియర్ ఎన్టీఆర్‌పై టీడీపీ ఎమ్మెల్యే కామెంట్స్.. నారా రోహిత్ స్పందన ఇదే!

Venuswamy: గుడి నుంచి తరిమేశారు… వేణు స్వామికి ఘోర అవమానం.. ఎక్కడంటే ?

Sitara Ghattamaneni : అది నేను కాదు… దయచేసి నమ్మి మోసపోకండి

Alekhya Chitti Sisters: దెబ్బకు ఆపరేషన్‌ చేసుకుని జెండర్ మార్చేసిన అలేఖ్య.. ట్రోల్స్‌పై సుమ రియాక్షన్!

Big Stories

×