Pushpa2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప ది రూల్’ డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. దేశ వ్యాప్తంగా ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో ఈ మూవీ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ పైన ఫ్యాన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. మేకర్స్ ఈ మూవీని జనాలకు కనెక్ట్ అయ్యే రేంజులో ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. అల్లు అర్జున్ కూడా అన్ని ప్రమోషన్స్ లో పాల్గొంటూ ఈ సినిమాని స్ట్రాంగ్ గా జనాల్లోకి తీసుకెళ్లే పనిలో ఉన్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ ట్రైలర్ తోనే సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ఈ మూవీకి మెగా హీరోలు ఫ్యాన్స్ దూరంగా ఉన్నారన్న సంగతి తెలిసిందే. కానీ ఏపీలో వైసీపీ సపోర్ట్ మాత్రం కాస్త ఎక్కువగానే ఉందని తెలిసిందే.. తాజాగా ఈ మూవీకి సపోర్ట్ చేస్తూ శిల్పా రవి చేసిన ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది.
ఈ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ అయ్యాక సినిమా క్రేజ్ పదింతలు అయ్యిందని తెలిసిందే. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో సెలెబ్రేటిలతో పాటుగా రాజకీయ నేతలు కూడా సోషల్ మీడియా ద్వారా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. తాజాగా ఈ మూవీకి వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవి సపోర్ట్ చేస్తూ పోస్ట్ చేశారు. దానికి బన్నీ రీట్వీట్ చెయ్యడం సంచలనంగా మారింది. పుష్పరాజ్ ఇమేజ్ ఉన్న లేస్, అగరబత్తి, అలాగే బిస్కెట్ ప్యాకెట్ ఫోటోల వీడియోని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసి బన్నీకి అభినందనలు తెలియజేశాడు. అలాగే వైల్డ్ ఫైర్ ని స్క్రీన్ మీద చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అంటూ పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇకపోతే వైసీపీ సపోర్టర్స్ ఈ పోస్ట్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. 2024 ఎన్నికల టైమ్ లో శిల్పా రవికి అల్లు అర్జున్ సపోర్ట్ చేసిన విషయం తెలిసిందే.. దాంతోనే మెగా ఫ్యామిలీలో చీలికలు మొదలయ్యాయని, వివాదాలు వచ్చాయని తెలిసిందే.
అప్పటిలో జనసేన ఫాలోవర్స్, ఇటు మెగా ఫ్యాన్స్, అటు టీడీపీ శ్రేణులు నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. అప్పటి నుంచి ఓ వర్గం వారు పుష్ప 2ని మేము చూడబోము అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అయితే ఇప్పుడు అంతా మర్చిపోయారని తెలుస్తుంది. ఇప్పుడు అదంతా అందరూ మర్చిపోయిన తరుణంలో బన్నీ ఫ్రెండ్ శిల్పా రవి ‘పుష్ప 2’ కి విషెస్ చెబుతూ పోస్ట్ పెట్టాడు. మళ్లీ మెగా vs అల్లు ఫ్యాన్స్ కోపానికి కారణం అయ్యాడు. దానికి అస్సలు ఆలోచించకుండా బన్నీ రిప్లై ఇవ్వడంతో పవన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇప్పుడిప్పుడే గొడవలు తగ్గాయి. శిల్పా రవి పెట్టిన పోస్టుకు మళ్లీ బన్నీ రిప్లై ఇవ్వడంతో గొడవలు మళ్లీ మొదటి వచ్చేలా కనిపిస్తున్నాయి. పవన్ ఫ్యాన్స్ దీన్ని సహించలేక ట్రోల్స్ చేస్తున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం ఇది మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. దీనిపై బన్నీ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి..
Thank you brotherrr 🖤 . Thank you for your love ❤️🔥
— Allu Arjun (@alluarjun) November 21, 2024