Akkineni Nagarjuna: అక్కినేని నాగార్జున కుటుంబంపై మంత్ర కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలు గురించి అందరికి తెల్సిందే. అక్కినేని నాగచైతన్య, సమంతలు విడిపోవడానికి కారణం కేటీఆర్. N కన్వెన్షన్ ను కూల్చకుండా ఉండాలంటే సమంతను నా దగ్గరకు పంపాలని నాగార్జున, కేటీఆర్ ను అడిగాడు. నాగార్జున దానికి ఒప్పుకొని సమంతను, కేటీఆర్ దగ్గరకు వెళ్లమని అడగ్గా.. ఆమె నో చెప్పింది. తాము చెప్పినట్లు చేయాలి, లేదంటే విడాకులు ఇవ్వాలని సమంతకు ఒత్తిడి తేవడంతో.. ఆమె విడాకులు తీసుకుందని మీడియా ముందు ఆమె ఆరోపించారు.
ఇక ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో పెను సంచలనాన్ని సృష్టించిన విషయం తెల్సిందే. ఇక దీనికి సమాధానంగా నాగ్ కూడా తన అభిప్రాయాన్ని తెలిపాడు. “గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, మీ ప్రత్యర్ధులని విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండి.
RAPO22: జంట బావుంది.. హిట్ కూడా పడితే బావుంటుంది మరీ..
బాధ్యత గలిగిన పదవి లో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవలిసిందిగా కోరుతున్నాను” అని ఎక్స్ ద్వారా రాసుకొచ్చాడు. అంతేకాదు.. తమ కుటుంబ పరువును రోడ్డుకు లాగినందుకు నాగ్.. మంత్రి కొండా సురేఖపై కేసు కూడా వేశాడు. వెంటనే ఆమె.. నాగ్ కుటుంబానికి ఎక్స్ వేదికగా క్షమాపణలు కోరారు.
“నా వ్యాఖ్యల పట్ల మీరు కానీ, మీ అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లయితే బేషరతుగా నా మాటలను వెనక్కి తీసుకుంటాను” అని తెలిపారు. అయితే అందరి ముందు ఇష్టమొచ్చినట్లు మాట్లాడి.. ఇప్పుడు. ఇలా ఎక్స్ వేదికగా క్షమాపణలు చెప్తే సరిపోదని.. నాగ్ తరుపున న్యాయవాది కోర్టులో తెలిపారు. తాజాగా ఈ కేసు నాంపల్లి కోర్టులో వాదనలు జరిగాయి.
Tollywood Industry : టాలీవుడ్ లోకి కొత్త హీరోయిన్ ఎంట్రీ.. బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా..?
నాగ్ తరుపు న్యాయవాది అశోక్ రెడ్డి తన వాదనను వినిపించారు. మంత్రి కొండా సురేఖ ఎక్స్ లో పెట్టిన పోస్ట్ ను చదివి వినిపించారు. ఒక బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్న ఆమె.. ఒక కుటుంబంపై అలాంటి ఆరోపణలు చేయడం సరైనది కాదని, కచ్చితంగా కొండా సురేఖ క్రిమినల్ చర్యలకు అర్హురాలని ఆయన వాదించారు. ఆమె చేసిన వ్యాఖ్యలు.. నాగార్జున కుటుంబాన్ని మొత్తం కించపరిచేలా ఉన్నాయని తెలిపారు. కచ్చితంగా ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరి కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వనుందో తెలియాల్సి ఉంది.