BigTV English

Hari Hara Veeramallu : థియేటర్లు బంద్ అవ్వలేదు… కానీ మూవీ వాయిదా పడుతుంది

Hari Hara Veeramallu : థియేటర్లు బంద్ అవ్వలేదు… కానీ మూవీ వాయిదా పడుతుంది

Hari Hara Veeramallu : “థియేటర్లు బంద్” కొద్ది రోజుల క్రితం ఇది సంచలన విషయం. ఇండస్ట్రీ పరంగానే కాదు.. రాజకీయంగా కూడా ఈ టాపిక్ అగ్గి రాజేసింది. పర్సంటేజ్, షేరింగ్ అంటూ ఎగ్జిబ్యూటర్లు స్టార్ట్ చేసిన వివాదం.. చిలికి చిలికి గాలి వానలా తయారైంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆఫీసే రిస్పెండ్ అయ్యేంత వరకు చేరింది.


ఏపీ సినిమాటోగ్రఫి మంత్రి కందుల దుర్గేష్ ప్రెస్‌మీట్ పెట్టేంత వరకు చేరింది. దీంతో టాలీవుడ్ నిర్మాతలు అందరూ బెంబేలెత్తిపోయి.. ప్రెస్ మీట్లు పెట్టి వివరణ ఇచ్చు కోవాల్సి వచ్చింది. అల్లు అరవింద్, దిల్ రాజు ప్రెస్‌ మీట్ పెట్టి చేసిన కామెంట్స్ అందరూ విన్నారు.

ఏం జరిగిందో తెలీదు కానీ, హరి హర వీరమల్లు మూవీని అడ్డుకునే కుట్ర జరుగుతుంది అంటూ ప్రచారం సాగింది. అందుకే వాతావరణం అంత వేడెక్కింది. డిప్యూటీ సీఎం ఆఫీస్ రెస్పాండ్ కావాల్సి వచ్చింది.


నిజంగానే అలాంటి కుట్ర జరిగిందో లేదో అనేది ఇప్పటి వరకు బయటికి ఎవరికీ తెలియలేదు. కానీ, అప్పుడు ఆ చర్చ అయితే బానే జరిగింది. తన సినిమా అడ్డుకుంటారా..? అని పవన్ కళ్యాణ్ ఊగిపోయాడు.

అవును, ఒక స్టార్ హీరో, అందులోనూ ఓ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం. ఆయన సినిమానే ఆపాలనే కుట్ర జరుగుతే, ఆయన అలా రెస్పాండ్ అవ్వడంలో అస్సలు తప్పేలేదు.

తర్వాత.. థియేటర్స్ బంద్ కాలేదు. ఆయన సినిమాను ఆపాలని కుట్ర ఎవరు చేశారు అనే ప్రశ్నకు ఆన్సర్ రాలేదు. మొత్తంగా పనవ్ కళ్యాణ్ హరి హర వీరమల్లు మూవీ రిలీజ్‌ కు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇంకా చెప్పాలంటే… ఈ సినిమా వస్తుందని కొన్ని సినిమాలు తమ రిలీజ్ డేట్ కూడా మార్చుకున్నాయి.

వీరమల్లు వాయిదా..?

థియేటర్స్ బంద్ అవ్వడం లేదు. మూవీ ఆపే కుట్ర కూడా లేదు. ఇండస్ట్రీ మొత్తం ఈ సినిమా కోసం తమ వంతు సాయం చేస్తున్నాయి. అన్నింటికీ మించి పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. కానీ, ఈ సినిమానే రిలీజ్ కు రెడీగా లేదు.

జూన్ 12న వరల్డ్ వైడ్ గా ఈ మూవీని రిలీజ్ చేద్దామని అనుకున్నారు. డేట్ కూడా ఇచ్చారు. కానీ, ఆ డేట్ కు హరి హర వీరమల్లు మూవీ రిలీజ్ అవ్వడం లేదని ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ అవుతంది.

CG వర్క్ పెండింగ్.?

ఈ మూవీకి గ్రాఫిక్స్ వర్క్ ఇంకా పూర్తి కాలేదట. సీజీ వర్క్ పూర్తి అయితేనే సినిమా ఎడిటింగ్ పూర్తి అవుతుంది. అది పూర్తి అయితేనే ట్రైలర్ కట్ అవుతుంది. ట్రైలర్ రిలీజ్ అయితేనే… సినిమాకు బజ్ క్రియేట్ అవుతుంది. ఇప్పటి వరకు హరి హర వీరమల్లు మూవీకి ఎలాంటి బజ్ లేదు. పవన్ కళ్యాణ్ మూవీ అనే తప్పా… సినిమాలో ఉన్న కంటెంట్ పై ఉన్న బజ్ జీరో అనే చెప్పాలి.

ఇలాంటి సినిమాను కొనుగోలు చేయడానికి బయ్యర్లు కూడా ముందుకు రావడం లేదట. దీంతో సీజీ వర్క్ కంప్లీట్ అయ్యాకా.. ట్రైలర్ కట్ చేసి.. బజ్ పెరిగిన తర్వాత బిజినెస్ కంప్లీట్ చేసి రిలీజ్ చేయాలని చూస్తున్నారట నిర్మాతలు.

ఆ హడావుడి ఎందుకు..?

మొత్తానికి సినిమా అయితే రిలీజ్ అవ్వడం లేదు. దీంతో హరి హర వీరమల్లు సినిమాపై పవన్ పై ట్రోల్స్ అవుతున్నాయి. సినిమానే రిలీజ్ చేయడం లేదు. అప్పుడు అంత హాడావుడి చేయడం ఎందుకు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×