Kubera Movie: కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటుడు ధనుష్(Danush) ఒకరు. అయితే ఒకప్పుడు ధనుష్ తమిళంలో నటించిన సినిమాలను తెలుగులో డబ్ చేసి విడుదల చేసేవారు. తెలుగులో కూడా ధనుష్ కు ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నేపథ్యంలో ఈయనకు నేరుగా తెలుగు సినిమాలు చేసే అవకాశాలు కూడా లభించాయి. ఇటీవల ధనుష్ సార్ అనే పూర్తిస్థాయి తెలుగు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నారు. ఇప్పుడు మరొక టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల(Sekhar Kammula) దర్శకత్వంలో ఈయన కుబేర సినిమా(Kubera Movie) ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.
సెన్సార్ కార్యక్రమాలు పూర్తి…
ఎన్నో అద్భుతమైన ఫీల్ గుడ్ చిత్రాలను అందించిన డైరెక్టర్ శేఖర్ కమ్ముల ధనుష్, రష్మిక మందన్న(Rashmika Mandanna) హీరో హీరోయిన్లుగా కుబేర సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక ఈ సినిమాలో అక్కినేని నాగార్జున(Nagarjuna) కూడా కీలకపాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్పీ అమిగోస్ క్రియేషన్ బ్యానర్ పై సునీల్ నారంగ్,పుస్కూర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషలలో జూన్ 20వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది.
గుండెను హత్తుకునేలా…
ఇక ఈ సినిమా విడుదలకు తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు అన్నింటిని కూడా పూర్తి చేసుకుందని తెలుస్తుంది. అదే విధంగా ఈ సినిమా నేడు సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమా చూసిన సెన్సార్ సభ్యులు సినిమాకు పాజిటివ్ రివ్యూ ఇచ్చారని తెలుస్తోంది. ఈ సినిమాకు సెన్సార్ సభ్యులు U/A సర్టిఫికెట్ జారీ చేశారు. ఇక ఈ సినిమా గురించి సెన్సార్ సభ్యులు రివ్యూ ఇస్తూ… శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చే సినిమాల మాదిరి కాకుండా ఈ సినిమా చాలా డిఫరెంట్ గా ఉందని, ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు గుండెను హత్తుకునేలా ఉన్నాయని తెలిపారు.
ఈ సినిమాలో హీరో ధనుష్ పాత్ర చాలా అద్భుతంగా ఉంటుందని ఆయన పాత్ర గురించి మళ్ళీ మళ్ళీ మాట్లాడుకునేలా డైరెక్టర్ తీర్చిదిద్దినట్టు తెలుస్తోంది. ఇక నాగార్జునకు కూడా సరైన పాత్ర లభించింది. రష్మిక నటన కూడా ఈ సినిమాకు హైలెట్ గా నిలుస్తుందని సెన్సార్ సభ్యులు రివ్యూ తెలిపారు. ఇక క్లైమాక్స్ కూడా అద్భుతంగా ఉంటుందని కానీ సినిమాలో కాస్త ల్యాగ్ ఉంటుందని తెలుస్తోంది. ఏది ఏమైనా శేఖర్ కమ్ముల ఓకే తరహా సినిమాల మాదిరి కాకుండా చాలా విభిన్నంగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక శేఖర్ కమ్ముల చివరిసారిగా లవ్ స్టోరీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమా తర్వాత కుబేర ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న డైరెక్టర్ ఎలాంటి సక్సెస్ అందుకుంటారో తెలియాల్సి ఉంది.