HariHaraVeeraMallu Business details: ..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నుంచి ఎంతో ఎదురు చూస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం :హరిహర వీరమల్లు'(Harihara Veeramallu). పవన్ కళ్యాణ్ సినిమాలను వదిలి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత అభిమానులను నేరుగా ఎంటర్టైన్ చేయడానికి ఒక ప్రయత్నం కూడా చేయలేదని వార్తలు ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటాయి. అందులో భాగంగానే తన అభిమానులను ఆకట్టుకోవడానికి ఒకవైపు ఏపీ డిప్యూటీ సీఎం గా పని చేస్తూనే.. మరొకవైపు హీరోగా సినిమాలు చేయడానికి సిద్ధమయ్యారు. అందులో భాగంగానే ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘హరిహర వీరమల్లు’ , ‘OG’ సినిమాలు లైన్లో ఉన్నాయి. ఇకపోతే ఇప్పుడు అంచనాలన్నీ ‘హరిహర వీరమల్లు’ సినిమా పైనే ఉన్నాయని చెప్పవచ్చు.
హరిహర వీరమల్లు బిజినెస్ లెక్కలు..
ఇప్పటికే 12సార్లు వాయిదా పడ్డ ఈ సినిమా మే తొమ్మిదవ తేదీన కచ్చితంగా విడుదలవుతుందని మేకర్స్ అనౌన్స్మెంట్ తో సహా ప్రకటించారు. కానీ ఈసారి కూడా ఈ సినిమా వాయిదా పడేటట్టు కనిపిస్తోంది. ఇక అందులో భాగంగానే మే నెల ఆఖరివారంలో విడుదల చేసేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా బిజినెస్ లెక్కలు వైరల్ గా మారుతున్నాయి. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ చేస్తున్న మొదటి సినిమా కావడంతో.. ఇప్పుడు సినిమాపై భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి. అందులో భాగంగానే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగా జరిగిందని తెలుస్తోంది. పెద్దగా అంచనాలు లేకపోయినా ఈ సినిమాకి ఆంధ్ర , తెలంగాణలో కలిపి రూ.140 కోట్ల మేరా జరిగినట్లు సమాచారం. అయితే ఒక్క ఆంధ్రాలో మాత్రమే ఈ సినిమాకు రూ.100 కోట్ల మేరా బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పుడు రూ.137 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగుతున్న ఈ సినిమాపై ఏమాత్రం అంచనాలు లేవు. అటు పవన్ కళ్యాణ్ అభిమానులు సినిమా చూసినా ఈ రేంజ్ లో ఓపెనింగ్స్ వస్తాయన్న నమ్మకం లేకుండా పోయింది. మరి రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న ఈ సినిమా అసలు హిట్ అవుతుందా..? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మే 9 అన్నారు.. ఆ డేట్ న కూడా విడుదల కావడం లేదు. కాబట్టి మరి మే 30వ తేదీన ఈ సినిమా విడుదలవుతుందా..? విడుదల అయితే సక్సెస్ అందుకుంటుందా అనే విషయం తెలియాల్సి ఉంది.
హరిహర వీరమల్లు నటీనటులు..
ఇక పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ హరిహర వీరమల్లు సినిమా విషయానికి వస్తే.. మొదట క్రిష్ జాగర్లమూడి ఈ సినిమాకు దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. కానీ మధ్యలో కాస్త విభేదాలు రావడంతో ఆయన సినిమా నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు ఈ సినిమాకు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇంకా ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. జాక్వెలిన్ ఫెర్నాండేజ్ స్పెషల్ సాంగ్ చేస్తున్నట్లు సమాచారం. మరి వీరందరూ కలిసి సినిమాకు ఎలాంటి విజయాన్ని అందిస్తారో చూడాలి