OTT Movie : కొంతకాలం క్రితం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అయ్యింది. అందులో ఓ అమ్మాయిపై తల్లిదండ్రులే స్వయంగా కిరోసిన్ పోసి నిప్పు అంటిస్తారు. అప్పట్లో ఈ సీన్ ను రియల్ అనుకున్నారు చాలా మంది. కాదు అని తెలిశాక సినిమా పేరు ఏంటా? అని తెగ వెతికారు. ఈరోజు మన మూవీ సజెషన్ అదే. మరి ఆ అమ్మాయిని పేరెంట్సే ఎందుకు అలా కాల్చి చంపాలి అనుకుంటారు? సినిమా పేరేంటి? అనే వివరాల్లోకి వెళ్తే..
దర్శకుడు మనోడే
ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మూవీ పేరు “12 ఓ’ క్లాక్” (12 o Clock). 2021లో రిలీజ్ అయిన ఈ మూవీ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన హిందీ హారర్-సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం. ఈ సినిమా కథ గౌరీ అనే యువతి చుట్టూ తిరుగుతుంది. ఆమె భయంకరమైన పీడకలలు, నిద్రలో నడవడం వంటి వింత సంఘటనలతో బాధపడుతుంది. ఇక హారర్ సినిమాలలో రామ్ గోపాల్ వర్మ శైలి ఎంత థ్రిల్లింగ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (amazon prime video)లో స్ట్రీమింగ్ అవుతోంది.
కథలోకి వెళ్తే…
ముంబైలో వరుస హత్యలు జరుగుతుంటాయి. వీటి వెనుక ఒక సీరియల్ కిల్లర్ ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తారు. ఇదే సమయంలో గౌరీ (కృష్ణ గౌతమ్) అనే కాలేజీ అమ్మాయి ప్రవర్తనలో ఆకస్మిక మార్పులు చోటు చేసుకుంటాయి. ఒంటరిగా ఉండడానికే ఇష్టపడుతుంది. అలాగే చాలా సైలెంట్ గా ఉంటుంది. రాత్రిపూట ఆమెకు భయంకరమైన పీడకలలు వస్తాయి. నిద్రలో నడుస్తుంది. ఆమె వింత ప్రవర్తనను చూసి తండ్రి రావు, తల్లి, సోదరుడు, అమ్మమ్మ గమనిస్తారు. కానీ మొదట్లో ఆమె పరీక్షల ఒత్తిడి వల్ల ఇలా చేస్తోందేమోనని భావిస్తారు.
రానురానూ గౌరీ పరిస్థితి మరింత దిగజారుతుంది. ఆమెకు ఏవేవో కన్పించడం మొదలవుతుంది. ఒక మగ గొంతుతో మాట్లాడుతుంది. దీంతో గౌరీని తల్లిదండ్రులు డాక్టర్ వద్దకు తీసుకెళతారు. కానీ వైద్యం పని చేయదు. ఆ తర్వాత ఒక తాంత్రికుడు (ఆశిష్ విద్యార్థి) గౌరీ శరీరాన్ని ఒక దుష్టాత్మ ఆవహించినట్లు చెబుతాడు. ఈ ఆత్మ ఒక సైకోపాత్ కిల్లర్‌ది, అతన్ని పోలీసులు కాల్చి చంపారని తెలుసుకుంటారు. చచ్చినప్పటికే అతని ఆత్మ గౌరీ శరీరంలోకి ప్రవేశించి హత్యలు చేస్తోందన్న మాట.
Read Also : వీడెవడ్రా బాబూ… పరమానందయ్య శిష్యుడికి బాబులా ఉన్నాడు… కడుపుబ్బా నవ్వించే ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్
గౌరీ తండ్రి (మకరంద్ దేశ్‌పాండే) ఆమెను రక్షించడానికి సైకియాట్రిస్ట్ డాక్టర్ దేబాషిష్ (మిథున్ చక్రవర్తి) సహాయం తీసుకుంటాడు. డాక్టర్ గౌరీకి డిస్సోసియేటివ్ పర్సనాలిటీ డిసార్డర్ ఉందని, కానీ సమస్య అతీతమైనదని తెలుస్తుంది. గౌరీ శరీరంలోని దుష్టాత్మ ముంబైలో జరుగుతున్న హత్యలకు కారణమని వెల్లడవుతుంది. ఈ ఆత్మను ఆపడానికి ఏకైక మార్గం గౌరీని చంపడం అని తెలుస్తుంది. మరి అనుకున్నట్టుగానే గౌరీని ఆమె ఫ్యామిలీ చంపేసిందా? అసలు ఆ ఆత్మ గౌరీని ఎలా పట్టుకుంది? ఆ సైకో కిల్లర్ ఎవరు? అనే విషయాలకు సమాధానం తెలియాలంటే ఈ మూవీని చూడాల్సిందే.