Pawan Kalyan -Vijay Devarakonda: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)చాలా సంవత్సరాల తర్వాత బిగ్ స్క్రీన్ పై కనిపించబోతున్నారని అభిమానులు ఎంతో సంబరపడ్డారు. అయితే తమ అభిమాన నటుడు సినిమా విడుదల కాబోతోందని సంతోషపడేలోపే ఈ సినిమా వాయిదా అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త పెద్ద ఎత్తున చక్కెర్లు కొడుతుంది. ఇలా ఈ సినిమా ముందుగా అనుకున్న విధంగా జూన్ 12వ తేదీ విడుదల కావడం లేదని, ఎడిటింగ్ పనులు సిజిఐ పనులు పూర్తి కాకపోవడంతో ఈ సినిమాని మరొకసారి వాయిదా వేయడానికే నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారంటూ వార్తలు వినపడుతున్నాయి. ఇకపోతే ఈ సినిమా వాయిదా అంటూ అధికారకా ప్రకటన మాత్రం ఇంకా వెలబడలేదు.
విజయ్ దేవరకొండ సినిమాపై ఎఫెక్ట్…
ఒకవేళ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు (Harihara Veeramallu)సినిమా కనుక వాయిదా పడితే మరొక నటుడు విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) సినిమా సమస్యల్లో చిక్కుకుంటుందని చెప్పాలి. జూన్ 12వ తేదీ విడుదల కావాల్సిన పవన్ సినిమా వాయిదా పడితే తిరిగి జూలై నెలలోనే విడుదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. జూన్ నెలలో నాగార్జున, ధనుష్ నటించిన కుబేర సినిమా 20వ తేదీ విడుదల కాబోతుంది. అలాగే మంచు విష్ణు కన్నప్ప సినిమా కూడా జూన్ 27వ తేదీ విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే వాయిదా పడిన హరిహర వీరమల్లు జూన్ లో కాకుండా జూలైలోనే విడుదలకు అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే జూలై నెలలో విడుదల అయ్యే విజయ్ దేవరకొండ కింగ్ డమ్ (Kingdom)సినిమాకు సమస్యగా మారింది.
కింగ్ డమ్ తప్పుకోవాల్సిందేనా…
విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం జులై 4వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు గత కొద్ది రోజుల క్రితమే అధికారకంగా వెల్లడించారు. ఇలా జూలై నాలుగో తేదీ విడుదల కావాల్సిన ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ సినిమా సమస్యగా మారబోతోందా అంటూ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమా నిర్మాత సూర్యదేవర నాగ వంశీ మాత్రం పవన్ కళ్యాణ్ సినిమాకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చూసుకుంటారు అనే విషయం మనకు తెలిసిందే.
గతంలో కూడా నాగ వంశీ సినిమాల విడుదల గురించి మాట్లాడుతూ… పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తే ఆ సమయంలో మా సినిమా అడ్డంకిగా ఉంటే మేము మా చిత్రాన్ని వాయిదా వేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
ఇక జూన్ నెలలో వీరమల్లు సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఈ చిత్ర నిర్మాతలను సంప్రదించిన అనంతరం నాగ వంశీ జూలై 4న తన సినిమాని విడుదల చేయటానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. మరి ఇప్పుడు వీరమల్లు వాయిదా పడటంతో విజయ్ దేవరకొండ కింగ్ డమ్ కూడా వాయిదా పడుతుందా? లేదంటే పవన్ కళ్యాణ్ మరింత ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు వస్తారా? అనేది తెలియాల్సి ఉంది. ఇక పవన్ కళ్యాణ్ సినిమా వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో రావడంతో ఒక్కసారిగా అభిమానులు షాక్ అవుతున్నారు. నిజంగానే ఈ సినిమా వాయిదా పడిందా లేకపోతే కొందరు ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి తప్పుడు వార్తలను సృష్టిస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది.