BigTV English

OG Movie OTT: రిలీజ్ అవ్వకముందే పవన్ కల్యాణ్ ఓజీ ఓటీటీ ఫిక్స్.. ఎక్కడంటే?

OG Movie OTT: రిలీజ్ అవ్వకముందే పవన్ కల్యాణ్ ఓజీ ఓటీటీ ఫిక్స్.. ఎక్కడంటే?

OG Movie OTT: ఈ ఏడాది సమ్మర్ లో ఎన్నో సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అందులో స్టార్ హీరోల ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలు కూడా ఉన్నాయి. అలా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్న మూవీ ‘ఓజీ’.. ఈ కోసం ఫ్యాన్స్ అంచనాలను పెంచేసుకున్నారు. కొన్నిరోజులు షూటింగ్‌లో పాల్గొన్న తర్వాత పవన్ రాజకీయాల్లో బిజీ అయిపోయారు. అప్పుడే ఏపీలో ఎన్నికలు రావడంతో ప్రచారంలో ఫుల్ బిజీగా తిరగడంతో ఈ మూవీలో పవన్ లేకుండానే షూటింగ్ పూర్తి చేశారు. చివరికి మూవీ దాదాపు షూటింగ్ పూర్తి చేసుకొని సమ్మర్ కు రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతుంది.. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్ భారీ హైఫ్ ను క్రియేట్ చేశాయి. ఇక సినిమాను థియేటర్లలో ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ మూవీని ప్రముఖ ఓటీటి ప్లాట్ ఫామ్ భారీ ధరకు డీల్ ఫిక్స్ చేసుకుందని టాక్..


పవన్ కళ్యాణ్ సినిమాలు.. 

ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు వరస సినిమాలను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.. ఎన్నికల నగర మోగేంతవరకు ఆయన సినిమాల్లో బిజీగా ఉన్నారు. ఏపీ ఎన్నికల్లో విజయం సాధించిన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరించారు. అప్పటికే హరి హర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు ఉన్నాయి.. ఇందులో ముందుగా ఓజీ మూవీని థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం.. యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహించిన ఓజీ (ఒరిజనల్ గ్యాంగ్‌స్టర్) సినిమాలో పవన్ కల్యాణ్ ఓ పాట కూడా పాడనున్నారని టాక్ వచ్చింది. ఇది పవన్ ఫ్యాన్స్‌కు పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అయితే, తాజాగా పవన్ కల్యాణ్ అభిమానులకే కాకుండా, ప్రేక్షకులకు కూడా గుడ్ న్యూస్ చెప్పింది ఓ ఓటీటీ ప్లాట్‌ఫామ్. పవన్ కల్యాణ్ ఓజీ మూవీ థియేట్రికల్ రిలీజ్‌కు ముందే ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఫిక్స్ అయింది..


ఓజీ ఓటీటి ప్లాట్ ఫామ్.. 

పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటి ప్లాట్ ఫామ్ ఫిక్స్ చేసుకుందని సమాచారం. నెట్‌ఫ్లిక్స్‌లో ఓజీ ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. నెట్‌ఫ్లిక్స్ ఇండియా పేరుతో ఉన్న అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో ఓజీ ఓటీటీ స్ట్రీమింగ్‌కు సంబంధించి పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ పోస్ట్‌లో పవన్ కల్యాణ్‌తో ఉన్న ఓజీ ఫస్ట్ లుక్ పోస్టర్ షేర్ చేసింది. అలాగే, అందులో నెట్‌ఫ్లిక్స్ పండగ అనే హ్యాష్‌ట్యాగ్ కూడా ఉంది. ఈ పోస్ట్ షేర్ చేస్తూ “ఓజీ ఈజ్ బ్యాక్. ప్రతి ఒక్కరు ఆ హీట్‌ను ఫీల్ అవుతారు. థియేట్రికల్ రిలీజ్ తర్వాత తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఓజీ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి రానుంది. ఓజీ ఓటీటీ ప్లాట్‌ఫామ్ పక్కాగా ఫిక్స్ అయినట్లే అని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఓజీ ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సుమారుగా రూ. 92 కోట్లకు కొనుగోలు చేసినట్లు ఓ వార్త సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది. ఇక ఓజీ సినిమాలో పవన్ కల్యాణ్‌కు పవర్‌ఫుల్ విలన్‌గా బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మి నటిస్తున్నాడు. ఓజీలో హీరోయిన్‌గా ప్రియాంక అరుల్ మోహన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇంకా ఈ సినిమాలో అర్జున్ దాస్, శ్రీయా రెడ్డి, హరీష్ ఉత్తమన్, ప్రకాష్ రాజ్, అభిమన్యు సింగ్, షాన్ కక్కర్, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు…

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×