OG Movie Release Date: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం OG. ప్రస్తుతం పవన్ తన సినిమాలపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. తను అనుకున్న సినిమాలన్నీ వరుసగా పూర్తి చేసే పనిలో ఉన్నారు. అందులో భాగంగా ఇటీవల హరిహర వీరమల్లు సినిమాకు కొన్ని రోజులు షూటింగ్ కి డేట్స్ ఇచ్చి ఆ సినిమాని పూర్తి చేశాడు. ఇటీవల ఓజి సినిమా స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే, పవన్ కళ్యాణ్ ఓజి సినిమా షూటింగ్ శెరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు ఎప్పుడు అని ఎదురుచూసే ఫ్యాన్స్ కు మూవీ టీం పండగ లాంటి అప్డేట్ ను ఇచ్చింది ఆ వివరాలు చూద్దాం..
పవన్ ఓజీ రిలీజ్ డేట్ వచ్చేసింది మామ..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అటు రాజకీయంగా, కుంకి ఏనుగులు తెచ్చేందుకు కర్ణాటక కు వెళ్లారు ఆ తరువాత క్యాబినెట్ మీటింగ్ లోను కనిపించారు. ఇక ఇప్పుడు ఓజి స్టేట్స్ లో బిజీ గా గడుపుతున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ షూటింగ్ లో పాల్గొన్న విషయం తెలిసిందే, అయితే తాజాగా మూవీ టీం ఈ సినిమా రిలీజ్ డేట్ ను సోషల్ మీడియా వేదిక అనౌన్స్ చేశారు. ఎప్పుడు ఎప్పుడు మూవీ చూస్తామని ఎదురు చూసే పవన్ ఫ్యాన్స్ కు పండగ లాంటి అప్డేట్ ఇచ్చారు. OG సినిమా వరల్డ్ వైస్ గా సెప్టెంబర్ 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది. అఫీషియల్ గా మూవీ టీం సోషల్ మీడియా వేదిక అనౌన్స్ చేశారు. 2025 సెప్టెంబర్ 25న OG థియేటర్లో సందడి చేయనుంది. ఈ వార్త తెలిసిన పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి లో ఉన్నారు.
పాన్ ఇండియా మూవీ గా ..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓజీపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మూడు విభిన్న పాత్రలలో కనిపించనున్నట్లు సమాచారం. మాస్, యాక్షన్ సన్నివేశాలతో అధ్యంతం అభిమానులను అలరిస్తుందని టాక్. పవన్ నుంచి మాస్ మూవీ వచ్చి చాలా రోజులైంది. ఇప్పుడు సుజిత్ మాస్ యాక్షన్ మూవీ గా ఓజి ని తెరకెక్కించడంతో ఈ సినిమా కోసం ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా జూన్ 12న రిలీజ్ కానుంది. ఈ మూవీ క్రిష్ ,జ్యోతి కృష్ణ దర్శకత్వంలో రూపొందింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ పాటలు అభిమానులు అంచనాలను పెంచేశాయి. ఇక పవన్ నుండి వరుస సినిమాలు రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి లో ఉన్నారు.ఈ శనివారం నుంచి పవన్ కళ్యాణ్ షూటింగ్ మొదలు పెట్టారు. ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్ గ్యాంగ్స్టర్ మూవీ గా ప్రేక్షకుల ముందుకు రారు ఉంది. డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంపాన్ ఇండియా మూవీగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సెప్టెంబర్ 25 న విడుదల కానుంది. ఇక మీదట తరచూ ఓ జి అప్డేట్లను ఇవ్వాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు.