Pawan Kalyan: విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో యుఫోరియా మ్యూజికల్ నైట్ కు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ హాజరయ్యారు. తలసేమియా బాధితుల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ ఈ మ్యూజికల్ నైట్ ను ఏర్పాటు చేసింది. థమన్ ఈ ఈవెంట్ ను ఎంతో అద్భుతంగా నిర్వహించాడు. దీనికోసం ఎవ్వరూ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు.
సీఎం చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి నేతృత్వంలో జరిగిన ఈ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్.. గొప్ప మనసు చాటుకున్నారు. తలసేమియా బాధితుల కోసం రూ. 50 లక్షలు విరాళంగా అందించారు. నారా భువనేశ్వరి గారు అంటే నాకు చాలా గౌరవం. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఆమె చెక్కు చెదరకుండా బలమైన సంకల్పంతో ఉన్న ఆమెను నేను దగ్గరనుంచి చూశాను. అలాంటి వ్యక్తి తలసేమియా బాధితుల కోసం లాంటి ఈవెంట్ ను నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది.
ఇక ఈ వేడుకలో పవన్.. బాలయ్య గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఎప్పుడు బాలయ్య అనే పిలవమంటారు కానీ, తనకెప్పుడు సార్ అనే పిలవాలనిపిస్తుందని తెలిపారు. ఎవరిని లెక్కచేయని వ్యక్తిత్వం బాలయ్యది అని, ఒకటి కాదు, రెండు కాదు, మూడు జనరేషన్స్ నుంచి ఆయన నటనతో ప్రేక్షకులను అల్లరిస్తున్నారు, అది ఎంతో అనందకరమని అన్నారు.
ఇక సినిమాల్లోనే కాదు సేవల్లో కూడా బాలయ్య ఎప్పుడు ముందుంటారు. ఇవన్నీ గుర్తించే కేంద్రప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్ తో గుర్తించింది అని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఎలాంటి హంగామా లేకుండా దూసుకువెళ్తుంది. ఎన్టీఆర్ మనమధ్య లేకపోయినా.. ఈ ట్రస్ట్ ద్వారా ఎప్పుడు మన గుండెల్లోనే ఉంటారు. ఒక మంచి పనిని మొదలుపెట్టడం వరకు ఓకే కానీ.. దానిని కొనసాగించడం చాలా కష్టం. 28 ఏళ్లుగా ఎన్టీఆర్ ట్రస్ట్ కొనసాగించడం అంటే మాములు విషయం కాదు. అందులోనూ తలసేమియా బాధితుల కోసం ఇలాంటి ఒక ఈవెంట్ ను నిర్వహించడం గొప్ప విషయం.
Brahmanandam: ఆ విషయంలో హాస్యబ్రహ్మను చూసి చాలామంది స్టార్స్ నేర్చుకోవాలేమో..
ఎవరైనా ట్రస్ట్ మొదలుపెడితే ఎప్పుడెప్పుడు తీసెయ్యాలా అని చూస్తారు. కానీ, ఎన్టీఆర్ ట్రస్ట్ కోసం చంద్రబాబు చాలా కష్టపడుతున్నారు. దాన్ని ఆయనే కాపాడుకుంటూ వస్తున్నారు. ఎప్పుడు పని అనే కాదు.. అప్పుడప్పుడు సేవ, వినోదం ఉండాలి. ఈ కార్యక్రమానికి సంగీతం అందించిన థమన్ కు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను. నేను కూడా నా తరుపున తలసేమియా బాధితుల కోసం రూ. 50 లక్షలు అందిస్తున్నా.. ఈ ఈవెంట్ కు ఒక టికెట్ కొనమంటే మా వాళ్లు కొనలేదు. నారా భువనేశ్వరి గారు.. మీరు టికెట్ కొనక్కర్లేదు.. కార్యక్రమానికి రండి అన్నారు. మీరంతా టికెట్ కొనుక్కొని వచ్చారు. నేను ఉట్టిగా వచ్చాను. అలా రావడం తప్పు అనిపిస్తుంది. అందుకే రూ. 50 లక్షలు అందిస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ స్పీచ్ నెట్టింట వైరల్ గా మారింది.
ఇక ఒకే స్టేజిపై ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణను చూసేసరికి ఫ్యాన్స్ ఆనందం పత్తాలేకుండా ఉన్నారు. చాలా రోజుల తరువాత వీరు ముగ్గురు ఒకే ఫ్రేమ్ లో కనిపించడంతో సోషల్ మీడియా మొత్తం వీరి ఫొటోలతోనే నిండిపోయాయి. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.