Ipl 2025 Captains: వేసవిలో వినోదం పంచేందుకు మరికొద్ది రోజులలోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} పండుగ రాబోతోంది. 10 జట్ల నడుమ పోటాపోటీ క్రికెట్ క్రీడాభిమానులకు కావలసినంత మజాను అందించబోతోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} అంటే.. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుకు కాసులు కురిపించే లీగ్. ఇది కేవలం బీసీసీఐకి మాత్రమే కాకుండా ఫ్రాంచైజీలు, స్పాన్సర్లు, ఆటగాళ్లు కూడా భారీగా అర్జిస్తుంటారు.
Also Read: MS Dhoni: ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న ధోని.. ఫోటోలు వైరల్ !
ఇప్పటివరకు 17 సీజన్లు పూర్తి చేసుకున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్.. మరికొద్ది రోజులలోనే 18వ సీజన్ ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న పది జట్ల కెప్టెన్లలో.. అత్యధిక జీతం అందుకుంటున్న ఆటగాళ్ల {Ipl 2025 Captains} జాబితాపై చర్చ జరుగుతోంది. ఐపీఎల్ 2025 సీజన్ లో అతి తక్కువ, ఎక్కువ జీతం తీసుకుంటున్న {Ipl 2025 Captains} కెప్టెన్లు ఎవరో మీకు తెలుసా..? దీనిపై పూర్తి వివరాల్లోకి వెళితే..!
ఈ లిస్ట్ లో లక్నో సూపర్ జెయింట్స్ రిషబ్ పంత్ ని ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఏకంగా రూ. 27 కోట్లు వెచ్చించి దక్కించుకుంది. ఇతను లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్సీని పొందాడు. ఇక పంజాబ్ కింగ్స్ ఎలెవెన్ ఫ్రాంచైజీ శ్రేయస్ అయ్యర్ ని రూ. 26.75 కోట్లకి రిటైన్ చేసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ {సీఎస్కే} జట్టు కెప్టెన్ ఋతురాజ్ గైక్వాడ్ మూడొవ స్థానంలో ఉన్నాడు. సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కి ఈ ఏడాది రూ. 18 కోట్లు దక్కనున్నాయి.
2025 మెగా వేలంలో గైక్వాడ్ ని చెన్నై సూపర్ కింగ్స్ 18 కోట్లకు రిటైన్ చేసుకుంది. {Ipl 2025 Captains} ఇక నాలుగొవ స్థానంలో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్ మన్ గిల్ ఉన్నాడు. 2025 మెగా వేలంలో గిల్ ని గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం 16.5 కోట్లకు రిటైన్ చేసుకుంది. ఇక ఐదొవ స్థానంలో టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా నిలిచాడు. ఇతడిని ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ఐపీఎల్ 2025 మెగా వేలంలో రూ. 16.35 కోట్లకు దక్కించుకుంది.
Also Read: Shoaib Akhtar on Laxmipati Balaji: అక్తర్ ను నరకం చూపించిన బౌలర్..కోపంతో బ్యాట్లు కూడా విరగొట్టాడు ?
ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తన కొత్త కెప్టెన్ ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2025 లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు రజత్ పటిదార్ నాయకత్వం వహించనున్నాడు. ఈ యంగ్ ప్లేయర్ ఆడింది తక్కువ మ్యాచ్ లే. అయినప్పటికీ ఆర్సిబి కెప్టెన్ గా ఎన్నికయ్యాడు. అలాగే {Ipl 2025 Captains} అందరికంటే తక్కువ జీతం అందుకుంటున్నాడు. రజత్ పటిదార్ ఆర్సీబీ తరఫున ఇప్పటివరకు 27 మ్యాచ్లు మాత్రమే ఆడాడు. అయినప్పటికీ అతనికి ఇంత పెద్ద జట్టుకు కెప్టెన్సీ అవకాశం లభించింది. ఐపీఎల్ లో అతి తక్కువ పారితోషికం తీసుకునే కెప్టెన్ ఇతడే. రజత్ పటిదార్ ని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ ఐపీఎల్ 2025 మెగా వేలంలో కేవలం రూ. 11 కోట్లకే రిటైన్ చేసుకుంది.