E-Paper
Advertisement

Pawan Kalyan: డిప్యూటీ సీఎం కి ఇంకో రెండు సినిమాలు సెట్ చేస్తున్న త్రివిక్రమ్ శ్రీనివాస్

Pawan Kalyan: డిప్యూటీ సీఎం కి ఇంకో రెండు సినిమాలు సెట్ చేస్తున్న త్రివిక్రమ్ శ్రీనివాస్
Advertisement

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గా ఉన్న రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కెరియర్ స్టార్టింగ్ లో వరుసగా హిట్ సినిమాలు చేసి తనకంటూ ఒక స్టార్ డం సాధించుకున్నాడు. కేవలం ఎంట్రీ కి మాత్రమే మెగాస్టార్ చిరంజీవి పేరుని వాడుకున్నారు కానీ ఆ తర్వాత మాత్రం తన స్వశక్తితో టాలెంట్ తో తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు. ప్రస్తుత కాలంలో పవన్ కళ్యాణ్ సినిమాలు మామూలుగా ఉంటున్నాయి కానీ ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే ఒక రేంజ్ లో ఉండేవి. వరుసగా నాలుగు బ్లాక్ బస్టర్ సినిమాలు పడ్డాయి కళ్యాణ్ కు. ఖుషి సినిమా తర్వాత జానీ సినిమాకి తనలో ఉన్న దర్శకుని కూడా బయటికి తీసి టాలెంట్ చూపించాడు. సినిమా వర్క్ అవుట్ అవ్వలేదు కానీ పవన్ కళ్యాణ్ లోని దర్శకుడు మాత్రం చాలా మందిని ఆశ్చర్యపరిచాడు అని చెప్పొచ్చు. ఇప్పటికీ కూడా ఆ సినిమా చూస్తే టెక్నికల్ గా చాలా బ్రిలియంట్ గా అనిపిస్తుంది.

అజ్ఞాతవాసి తర్వాత గ్యాప్

Advertisement

జానీ సినిమా తర్వాత దాదాపు 10 ఏళ్లపాటు పవన్ కళ్యాణ్ కెరియర్ లో హిట్ సినిమా లేదు. హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఆ సినిమా ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డును నమోదు చేసుకుంది. పదేళ్లు హిట్టు లేకపోయినా కూడా పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ మార్కెట్ పెరుగుతూ వెళ్లాలి తప్ప ఎక్కడ తగ్గలేదు. గబ్బర్ సింగ్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో మరోసారి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ప్రూవ్ అయింది. గబ్బర్ సింగ్ సినిమా తర్వాత వచ్చిన కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా ఊహించిన స్థాయిలో ఆడలేదు. మళ్లీ త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన అత్తారింటికి దారేది సినిమా ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డును సృష్టించింది. అక్కడితో వీరిద్దరికి కాంబినేషన్ పైన విపరీతమైన అంచనాలు పెరిగిపోయాయి. ఇక వీరిద్దరి కాంబినేషన్ వచ్చిన 3వ సినిమా అజ్ఞాతవాసి. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలిపోయింది.

మరో రెండు ప్రాజెక్టులు సెట్ చేశాడు

Advertisement

అజ్ఞాతవాసి సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలు గ్యాప్ ఇచ్చారు. రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ను, ఖచ్చితంగా మీరు సినిమాలు చేయాలి అని చెప్పి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒప్పించు మరి రీఎంట్రీ ఇప్పించాడు. పవన్ కళ్యాణ్ రీఎంట్రీ తర్వాత చేసిన సినిమాలు మూడు రిలీజ్ అయ్యాయి. ఇంకో మూడు సినిమాలు నిర్మాణ దశలో ఉన్నాయి. ఇక వీటన్నిటిలో కూడా ఓ జి సినిమా ముందు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్స్ అన్ని కూడా త్రివిక్రమ్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇప్పుడు తాజాగా త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కోసం మరో రెండు ప్రాజెక్టులను సెట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీటిలో ఒక సినిమా రీమేక్, మరొకటి స్ట్రైట్ ఫిలిమ్ అని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ కి ఆర్థికంగా సినిమాలు సెట్ చేసి సపోర్ట్ చేస్తున్న త్రివిక్రమ్ తాను స్వయంగా దర్శకత్వం వహించి పవన్ కళ్యాణ్ కి హిట్ ఇవ్వాల్సి ఉంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×