BigTV English

Dead Bodies Missing: శవాలు మిస్సింగ్.. మాయా లేదు మర్మం లేదు.. ఆ మిస్టరీ వెనుక ఉన్నది ఎవరంటే?

Dead Bodies Missing: శవాలు మిస్సింగ్.. మాయా లేదు మర్మం లేదు.. ఆ మిస్టరీ వెనుక ఉన్నది ఎవరంటే?

Dead Bodies Missing: అమ్మో బొమ్మ.. సినిమాలో శవం దానికంతట అదే కదులుతూ మాయమవుతుంది. ఆ సీన్ చూస్తే చాలు.. ఒళ్లు జలదరించాల్సిందే. ఇక్కడ కూడా శవాలు మాయమవుతున్నాయట కానీ.. ఇందులో మాయ లేదు, మర్మం లేదు కానీ శవాలు చిటికెలో మాయమవుతున్నాయట. ఇంతకు ఈ శవాల మిస్సింగ్ వెనుక ఏమి జరుగుతుందనేది రహస్యంగా మారింది. ఈ సంచలన ఘటన ఎక్కడ జరిగిందో తెలుసా.. ఏపీలోని ఏలూరులో..


ఏలూరులోని ప్రభుత్వాసుపత్రిలో మార్చురీ ఉంది. ఇక్కడ అనాథ శ‌వాలను ఉంచడం పరిపాటి. అయితే ఉన్నట్టుండి శవాలు మాయమవుతుండగా.. అసలేం జరిగుతుందన్నది ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది. అంతేకాదు ఈనెల 8వతేదీన ఓ అనాథ శ‌వం మాయం కాగా.. స్థానిక ఉద్యోగులు ఏమైందంటూ కంగారుపడి వెతుకులాట కొనసాగించారు. అప్పుడే పలువురు ఆ అనాథ శ‌వాన్ని తరలిస్తున్నట్లు గుర్తించి ఉద్యోగులు అడ్డుకున్నట్లు సమాచారం. అసలు మార్చురీలో ఉండే డెడ్ బాడీస్ ఎందుకు తీసుకువెళుతున్నారన్నది ప్రశ్నార్థకంగా మారింది.

కాగా.. అసలు శవాల మిస్సింగ్ ఘటన వెనుక స్థానిక ఉద్యోగులలో ఎవరో ఒకరి సహకారం లేనిదే సాగదు. మరి వారెవరనేది కూడా తేలాల్సి ఉంది. ఈ విషయం చిన్నగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి చెంతకు చేరింది. శవాల మిస్సింగ్ గురించి తెలుసుకున్న కలెక్టర్ ముందు షాక్ కు గురయ్యారట. శవాలు ఏమిటీ ? మిస్సింగ్ ఏమిటీ ? అసలు దీని వెనుక ఉన్న అసలు కథ తేలాల్సిందే అంటూ కలెక్టర్.. నిజానిజాలు తేల్చాల‌ని అధికారుల‌కు ఆదేశాలు ఇచ్చారు.


ఇక ఈ మిస్సింగ్ పై దృష్టి సారించిన అధికారులు.. విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఈ శవాల మిస్సింగ్ వెనుక ఓ ముఠా ఉన్నట్లు నగరంలో ప్రచారం సాగుతోంది. మరి ఆ ముఠా ముఖ్య ఉద్దేశం ఏమిటో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. చనిపోయిన శవాలను తీసుకెళ్లి, ఏవైనా శరీర భాగాలు విక్రయిస్తున్నారా.. ఒకవేళ అలా విక్రయించినా.. ఈ తతంగం ఎక్కడ జరుగుతుందనేది కూడా తెలియాల్సి ఉంది. అసలు శవాల మిస్సింగ్ పై రోజుకొక వార్త ప్రజల నోట వినిపిస్తోంది. మరి ఈ శవాలను ఏమి చేస్తున్నారో.. అసలు మిస్సింగ్ నిజమా.. కాదా.. నిజమే అయితే దీని వెనుక ఉన్న ముఠా ఎవరు ? అనే పూర్తి విషయాలు విచారణలో వెల్లడి కావాల్సి ఉంది.

Also Read: Shock to Swarupananda: మాజీ సీఎం జగన్ గురువుకు షాకిచ్చిన సీఎం చంద్రబాబు.. ఇంతటితో ఆగేనా.. ఇంకా ఉందా..

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×