Vishwambhara Item Song : మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాలకు కమిట్ అవుతూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అయితే రీ ఎంట్రీలో చిరు అనుకున్న విధంగా సక్సెస్ అందుకోలేక పోతున్నారని అభిమానులు కొంతమేర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అయితే అభిమానులను ఏ మాత్రం నిరాశ పరచకుండా కథలను ఎంపిక చేసుకుంటూ చిరంజీవి తదుపరి సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఇటీవల వాల్తేరు వీరయ్య అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకున్న చిరు త్వరలోనే వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కిన విశ్వంభర (Vishwambhara)అనే సినిమా ద్వారా రాబోతున్నారు.
స్పెషల్ సాంగ్ కోసం భీమ్స్..
నిజానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల షూటింగ్ ఆలస్యం కావడంతో విడుదల వాయిదా పడింది. ఇక ఈ సినిమాని మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టులోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారని వార్తలు ఇండస్ట్రీలో హల్చల్ చేస్తున్నాయి. ఇప్పటివరకు విషయం గురించి అధికారిక ప్రకటన మాత్రం తెలియజేయలేదు. ఇక ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి చేసుకుందని కేవలం ఒక స్పెషల్ సాంగ్ షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని తెలుస్తోంది. ఈ సాంగ్ షూటింగ్ పూర్తి అయితే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభమవుతాయి.
ఆస్కార్ అవార్డు గ్రహీత…
ఈ సినిమాలో స్పెషల్ సాంగ్(Special Song) కోసం ప్రముఖ సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియోను(Bheems Ceciroleo) రంగంలోకి దించారని తెలుస్తుంది. ఐటెం సాంగ్స్‌కు మ్యూజిక్ ఇవ్వడంలో భీమ్స్ మంచి అనుభవం ఉన్న నేపథ్యంలో చిరంజీవి ఈయనకు అవకాశం కల్పించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమా కోసం ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి(Keeravani) సంగీతం అందించారు .ఈ సినిమాలో అన్ని పాటలకు ఈయన సంగీతం అందించినప్పటికీ కేవలం స్పెషల్ సాంగ్ కోసం మాత్రమే భీమ్స్ ను తీసుకోవడంతో చిరు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్న కారణం ఏంటి? అంటూ అందరూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ సినిమాకు సంగీత దర్శకుడుగా కీరవాణి పని చేశారు అయితే ఇటీవల ఈ సినిమా నుంచి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాంగ్ మాత్రం అనుకున్న స్థాయిలో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో స్పెషల్ సాంగ్ అయినా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే విధంగా ఉండాలన్న ఉద్దేశంతోనే భీమ్స్ ను ఎంపిక చేశారని తెలుస్తోంది. మరి భీమ్స్ పై చిరు పెట్టుకున్న నమ్మకాన్ని ఆయన నిలబెడతారా? తన మ్యూజిక్ తో ప్రేక్షకులను మ్యాజిక్ చేయగలరా?అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో హీరోయిన్గా త్రిష(Trisha) నటించిన విషయం తెలిసిందే.అయితే స్పెషల్ సాంగ్ కోసం మరొక హీరోయిన్ ను రంగంలోకి దింపబోతున్నారని తెలుస్తోంది. మరి చిరుతో స్పెషల్ స్టెప్పులు వేయబోతున్న స్పెషల్ బ్యూటీ ఎవరు? ఏంటి? అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఇక ప్రస్తుతం ఈయన అనిల్ రావిపూడి సినిమా షూటింగ్ పనులలో కూడా బిజీగా ఉన్నారు.
Also Read: Sekhar Kammula: లీడర్ సీక్వెల్ కు అంతా సిద్ధం.. అందుకే ఆగిపోయిందా?