Pawan Kalyan on Thalapathi Vijay : ఏజ్ అయిపోయిన సినిమా నటులందరూ రాజకీయ నాయకులు అయిపోయినట్లు, విడిపోయిన ప్రేమికులంతా స్నేహితులు కాలేరు అని త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక సినిమాలో రాస్తారు. వాస్తవానికి ఏజ్ అయిపోయిన తర్వాత చాలామంది సినిమా నటులు రాజకీయాల్లోకి వస్తారు. కానీ ఈ జనరేషన్ లో మాత్రం కెరియర్ పిక్ స్టేజ్ లో ఉన్నప్పుడే పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. అలానే తమిళనాడులో విజయ్ కూడా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. వీరిద్దరి ఇమేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తెలుగులో పవన్ కళ్యాణ్ కి ఎంత క్రేజ్ ఉందో, తమిళ్లో విజయ్ కి కూడా అంతే క్రేజ్ ఉంది. తెలుగులో కూడా విజయ్ కు మంచి క్రేజ్ ఉంది తను నటించిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించి మంచి కలెక్షన్స్ కూడా వసూలు చేశాయి.
జనసేన ఆవిర్భావం
అత్తారింటికి దారేది సినిమా అప్పటివరకు ఉన్న తెలుగు సినిమా చరిత్ర రికార్డ్స్ అన్నిటిని చెరిపేసింది. కలెక్షన్లకు కొత్తదారులు చూపించింది. అక్కడితో పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో అందరికీ తెలిసి వచ్చింది. సరిగ్గా అదే స్టేజ్ లో జనసేన అనే పార్టీను స్థాపిస్తున్నట్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేశారు. 2014లో పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ 2019లో పోటీలోకి దిగారు. అయితే ఎవరూ ఊహించిన విధంగా 2019లో పవన్ కళ్యాణ్ పార్టీ కేవలం ఒక సీటుకు మాత్రమే పరిమితమైపోయింది. అక్కడితో పవన్ కళ్యాణ్ మీద విపరీతమైన విమర్శలు వచ్చాయి. సినిమాల్లో రాణించినంత ఈజీ కాదు అంటూ చాలామంది కామెంట్స్ చేశారు. కట్ చేస్తే 2025 లో పవన్ కళ్యాణ్ పార్టీ పోటీ చేసిన 21 స్థానాల్లో 21 స్థానాలు కూడా గెలిచాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
విజయ్ పార్టీ పై పవన్ కళ్యాణ్ రియాక్షన్
మరోవైపు తమిళ్లో మంచి క్రేజ్ ఉన్న హీరో విజయ్ కూడా తమిళ వెట్రి కలగం అనే పార్టీని పెట్టారు. తన పార్టీ సిద్ధాంతాలను భారీ మీటింగ్స్ లో అనౌన్స్ చేశారు. అలానే ఆ పార్టీ మీటింగ్స్ కి కూడా భారీ స్థాయిలో ప్రజలు హాజరయ్యారు. అయితే ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ విజయ్ పార్టీ గురించి మాట్లాడలేదు. ఇక రీసెంట్ గా ఒక మీటింగ్లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ” నేను 15 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను. ఇది చాలా కఠినమైన ప్రయాణం. నేను ఎవరిని తక్కువ అంచనా వేయను” విజయ్ గారికి, ఆయన పార్టీ “తమిళ వెట్రి కలగం” ఆల్ ది బెస్ట్ అంటూ తెలిపారు పవన్ కళ్యాణ్.
Also Read : Akkineni Akhil marriage date: సినిమా అప్డేట్ ఇస్తారు అనుకుంటే అయ్యగారి పెళ్లి అప్డేట్ వచ్చింది